52 ఏండ్ల వయస్సులో కవలలకు జన్మ

Sun,October 13, 2019 02:09 AM

ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చిన భద్రాచలం మహిళ
కరీంనగర్ హెల్త్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 52 ఏండ్ల మహిళ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. భద్రాచలానికి చెందిన ఆరె సత్యనారాయణ-రమాదేవి దంపతులకు కూతురు, కుమారుడు. కూతురి వివాహమైంది. కుమారుడు 18 ఏండ్ల వయస్సులో ఉండగా 15 ఏండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొడుకులేని లోటును భర్తీచేయాలని ఆ దంపతులు భావించారు. సంతానం కోసం పలు దవాఖానలకు తిరిగారు. హైదరాబాద్, వైజాగ్, ఇతర చోట్ల కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) చేయించుకుని విఫలమయ్యారు. చివరగా కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డాక్టర్ పద్మజ.. 52 ఏండ్ల రమాదేవిని పరీక్షించగా బీపీ, షుగర్, గుండె జబ్బు ఉన్నట్టు తేలింది. అయినప్పటికీ ఐవీఎఫ్ ద్వారా చికిత్సను ప్రారంభించారు. కాగా, శుక్రవారం సాధారణ ప్రసవం ద్వారా రమాదేవి కవలల (ఆడ పిల్లలు)కు జన్మనిచ్చారు. కవలలు ఆరోగ్యంగానే ఉన్నారని, ఒకరు రెండు కిలోలు, మరొకరు రెండు కిలోల 200 గ్రాములు ఉన్నట్టు వైద్యురాలు తెలిపారు.


55 ఏండ్ల వరకు అవకాశం ఉంటుంది..

రమాదేవికి సంతాన భాగ్యం కల్పించిన వెన్నెల నర్సింగ్ హోం, పద్మజా సంతాన సాఫల్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. 35 ఏండ్లు దాటిన మహిళలకు అండాలు రావడం కష్టమని, కానీ దాత అండాలతో ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం 55 ఏండ్ల వరకు టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతిలో మాతృత్వం పొందవచ్చన్నారు.

1580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles