36 మందికి కీర్తి పురస్కారాలు


Sat,April 30, 2016 01:24 AM

36 people fame Awards

-తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటన

తెలుగు యూనివర్సిటీ: తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతి, సంఘసేవ తదితర రంగాలలో విశిష్ట సేవలందించిన 36 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2014 సంవత్సర కీర్తి పురస్కారాలను ప్రకటించింది. వర్సిటీ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న నిపుణుల సంఘం పురస్కారానికి అర్హులైన వారిని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ తోమాసయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. త్వరలో పురస్కార ప్రదాన కార్యక్రమం జరుగుతుందని, పురస్కార గ్రహీతలను రూ.5116ల నగదు, శాలువ, పురస్కార పత్రంతో సత్కరిస్తామని వెల్లడించారు.
పురస్కారాలకు ఎంపికైనవారు: వనపట్ల సుబ్బయ్య (సృజనాత్మక సాహిత్యం), ద్యావనవల్లి సత్యనారాయణ (పరిశోధన), శ్రీరమణ (హాస్య రచన), కొండవల్లి నీహారిని (జీవితచరిత్ర), ఎం హేమలత (ఉత్తమ రచయిత), రమాదేవి (ఉత్తమ నటి), నిట్టల శ్రీరామమూర్తి (ఉత్తమ నటుడు), డీ వీ రమణమూర్తి (ఉత్తమ నాటక రచయిత), కుర్రా హనుమంతరావు (హేతువాదం), షాజహానా (ఉత్తమ రచయిత్రి), జక్కని వెంకటరాజం (కవిత్వం), కోట్ల వేంకటేశ్వరరెడ్డి (వివిధ ప్రక్రియలు), భండారు శ్రీనివాసరావు (పత్రికారచన), మలుగు అంజయ్య (అవధానం), మాంటిస్సోరి కోటేశ్వరమ్మ (మహిళాభ్యుదయం), ఎం రాంచందర్ (గ్రంథాలయకర్త), కే రమణయ్య (గ్రంథాలయ సమాచార విజ్ఙానం), సత్యవాడ సోదరీమణులు (కథ), శ్రీపాద కుమారశర్మ (నాటకరంగంలో కృషి), బబ్బెళ్ళపాటి గోపాలకృష్ణసాయి (సంఘసేవ), దెందులూరి పద్మమోహన్ (ఆంధ్రనాట్యం), గూటం స్వామి (నవల), పీ నర్సింహారెడ్డి (భాష , సాహితీ విమర్శ), మోతె ఉప్పలయ్య (జానపద కళలు, చెక్కబొమ్మలు), పేట శ్రీనివాసులరెడ్డి (ఆధ్యాత్మిక సాహిత్యం), టీ శ్రీరంగస్వామి (సాహితీ విమర్శ), రుక్మాంగదరెడ్డి (పద్యరచన), మద్దాళి రఘురాం (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), కొప్పుల హేమాద్రి (జనరంజక విజ్ఙానం), ప్రభాకర్ (జానపద గాయకుడు), డీ సుజాత దేవి (బాల సాహిత్యం), మర్రి రమేశ్ (ఇంద్రజాలం), అక్కిరాజు సుందర రామకృష్ణ (పద్యరచన), శంకర్ (కార్టూనిస్ట్), కేబీకే మోహన్‌రాజు (లలిత సంగీతం), నీతా చంద్రశేఖర్ (శాస్త్రీయ సంగీతం).

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles