త్వరలో మరో 31 గురుకులాలు

Sun,October 13, 2019 01:34 AM

-కసరత్తు ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ
-ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నా యి. వీటిలో ఉత్తమ ఫలితాలు నమోదవుతుండటంతో విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో కొత్తగా 31 గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అందుకు ఆ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. 2019-20 విద్యా సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. నాణ్యమైన విద్యావిధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రోజురోజుకు తెలంగాణ గురుకుల విద్యాలయాలకు ఆదరణ పెరుగుతున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, గురుకులాల్లో ప్రవేశాల కోసం వస్తున్న దరఖాస్తులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేసినట్టు తెలిసింది.

కొత్త విద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. నాణ్యమైన విద్యకు చిరునామాకు గురుకులాలు నిలుస్తుండటంతో ఈ నిర్ణయం అనివార్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న గురుకుల విద్యాలయాల్లోని పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో గురుకులాలు 98.57 శాతం ఉత్తీర్ణతతో మిగతా విద్యాసంస్థల కంటే ముందంజలో ఉన్నాయి. 20 గురుకులాల్లో 100 శాతం ఫలితాలు సాధించారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివినవారిలో తొమ్మిది మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు.

103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles