జూరాలకు 2900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


Thu,May 16, 2019 02:10 AM

2900 cusecs Inflow to jurala project

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. నారాయణపుర ప్రా జెక్టు నుంచి గూగల్, గిరిజాపూర్ బరాజ్‌లకు అక్కడినుంచి నీరు జూరాల ప్రా జెక్టుకు మంగళవారం అర్ధరాత్రి చేరుకున్నది. బుధవారం జూరాలకు 2900 ఇన్‌ఫ్లో నమోదైంది. పైనుంచి వచ్చిన జలాలతో 0.220 టీఎంసీల సామర్థ్యం పెరిగినట్టు జూరాల ప్రాజెక్టు ఈఈ హెచ్‌టీ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టులో నీటిమట్టం ప్రస్తుతం 313 మీటర్లకు చేరుకున్నదని, మరో 0.4 టీఎంసీల నీళ్లు వచ్చాక జూరాల నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని వదిలేందుకు మెరుగైన అవకాశాలుంటాయని తెలిపారు. జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి పథకాలకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్‌ఫ్లోతో ఉమ్మడి పాలమూరు ప్రజలు తమ దాహార్తి తీరుతుందని భావిస్తున్నారు. అధికారులు జూరాల నుంచి రామన్‌పాడు రిజర్వా యర్‌కు సాధ్యమైనంత త్వరగా నీటిని విడుదల చేసి తాగునీటి పథకాలకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

86
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles