అర్హులు 26.31 లక్షలు


Tue,February 19, 2019 03:24 AM

26 31 lakhs are eligible Farmers for kisan samman fund scheme

- తుది దశకు కిసాన్ సమ్మాన్ నిధి అర్హుల గుర్తింపు
- 21 లక్షల మంది డాటాను రేపటిలోగా సమర్పించేందుకు ఏర్పాట్లు
- తొలి విడుతగా పది లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.రెండువేలు జమ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హుల గుర్తింపు తుదిదశకు చేరుకున్నది. రాష్ట్రంలో దాదాపు 26.31 లక్షల మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా వ్యవసాయశాఖ గుర్తించింది. ఈ నెల 20 నాటికి 21 లక్షల మంది డాటాను కేంద్రానికి అందజేస్తామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు. వీరిలో పది లక్షల మంది రైతులకు మొదటివిడుతగా ఈ నెల 24న రూ. రెండువేల చొప్పున బ్యాంకులో జమకానున్నట్లు సమాచారం. కేంద్రం పలు ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలోని సగంమందికి అర్హత లభించదని వ్యవసాయశాఖవర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి ఒకటోతేదీ వరకు రాష్ట్రం లో 52.91 లక్షల మంది పట్టాదారు రైతులున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కేంద్రం నిబంధనల ప్రకారం పౌరసరఫరాలశాఖ ద్వారా తెల్ల, గులాబీరంగు రేషన్‌కార్డులు కలిగిన రైతుల వివరాలను వ్యవవసాయశాఖ పరిశీలించింది. వీరిలో వ్యక్తిగత పట్టాదారులై, రేషన్‌కార్డులుకల్గినవారి సంఖ్య 43.81 లక్షలుగా గుర్తించారు. మిగతా 9.10 లక్షల మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారిని పింక్ రేషన్‌కార్డులున్న రైతులుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది.

దీంతో తెల్ల రేషన్‌కార్డులు కలిగిన రైతులు 32.12 లక్షలు ఉన్నట్లుగా తేల్చారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఏడువేల మంది, రూ.పదివేలకంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నవారు రెండువేల మంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఐదెకరాలు, అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలు 26.31 లక్షలుగా గుర్తించారు. ఇందు లో ఒకే పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన కుటుంబాల సంఖ్య 23.08 లక్షలు కాగా, ఒకటికంటే ఎక్కువ పాస్‌పుస్తకాలు ఉన్నవారి సంఖ్య 3.23 లక్షలుగా గుర్తించారు. కేంద్రం నిబంధనతో ఐదు, అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్న 5.72 లక్షల మంది రైతులు అనర్హులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 23.08 లక్షల కుటుంబాల్లో 21 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉన్నాయి.

రాష్ట్రంలోని రైతుల వివరాలు

- ఫిబ్రవరి ఒకటోతేదీ వరకు రైతుల సంఖ్య : 52.91 లక్షలు
- తెలుపురంగు రేషన్‌కార్డులున్న రైతులు : 32.12 లక్షలు
- రూ.పదవేలపైన పెన్షన్ తీసుకుంటున్నవారు : 2 వేలు
- నాలుగో తరగతి మినహా ప్రభుత్వ ఉద్యోగులు : 7 వేలు
- ఐదెకరాలు, అంతకంటే తక్కువ ఉన్నవారు: 26.31 లక్షలు
- ఐదెకరాలపైన ఉన్నవారు : 5.72 లక్షలు

3543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles