లోక్‌సభలో రాష్ట్ర ఎంపీల ప్రమాణం


Wed,June 19, 2019 02:53 AM

17th Lok Sabha Newly elected MPs take oath

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: 17వ లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులు ఎంపీలుగా ప్రమా ణం చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్ నుంచి తొమ్మిది మంది ఎంపీలు, కాం గ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణ స్వీకరణ చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రమాణం చేయగా, ఆ తర్వాత వరుసగా బండి సంజయ్‌కుమార్, అరవింద్ ధర్మపురి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, డాక్టర్ రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు, సోయం బాపూరావు ప్రమాణం చేశారు. వీరిలో వెంకటేశ్ నేతకాని, బండి సంజయ్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు, సోయం బాపూ రావు తెలుగులో ప్రమాణం చేయగా.. అరవింద్ ధర్మపురి, రంజిత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంగ్లభాషలో, బీబీ పాటిల్, అసదుద్దీన్ ఓవైసీ హిందీలో ప్రమాణం చేశారు.

asaduddin-owaisi

అల్లాహు అక్బర్ అన్న ఒవైసీ

న్యూఢిల్లీ: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనకు కేటాయించిన స్థానం నుంచి ప్రమాణంచేసే ప్రదేశం వరకు ఆయన వస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్దపెట్టున జైశ్రీరాం, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఎంతో సంయమనం పాటించిన అసదుద్దీన్ వారిని నినాదాలు కొనసాగించుకోండన్నట్టు చేతులూపుతూ వెళ్లారు. వేదిక వద్దకు చేరుకున్న అసద్ తన ప్రమాణం పూర్తయిన అనంతరం జై భీమ్, తక్బీర్ అల్లాహు అక్బర్, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ సభ్యులు మళ్లీ భారత్ మాతాకీ జై అంటూ హోరెత్తించారు. ఈ పరిణామాలపై అసదుద్దీన్ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, నన్ను చూసినప్పుడు వారికి నినాదాలు గుర్తు రావడం మంచిదే.

వారు రాజ్యాంగాన్ని.. అలాగే ముజఫర్‌పూర్‌లో మృత్యువాత పడుతున్న బాలలను కూడా గుర్తుంచుకుంటారని భావిస్తాను అన్నారు. అసదుద్దీన్ ప్రమాణం సందర్భంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ కాగా, దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, సభ్యుల చేష్టలు సిగ్గుచేటు, తోటి సభ్యుడిని బెదిరించడమే అని పేర్కొన్నారు. లౌకిక గణతంత్రంలోని చట్ట సభలోనే మైనార్టీ ఎంపీని నినాదాలతో బెదిరించేందుకు ప్రయత్నించారు. ఈ మత దురభిమానులు సామాన్య ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోండి అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.

2586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles