మధ్యాహ్న భోజనానికి177.7 కోట్లు విడుదల


Thu,May 16, 2019 01:21 AM

177 7 crore released for mid day meal

-ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో మధ్యాహ్న భోజన పథకానికి రూ.177.7 కోట్లు విడుదలచేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. 9, 10 తరగతుల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం భరిస్తున్నది. ఇందుకోసం రూ.8.02 కోట్లు ఇప్పటికే విడుదల చేశారని తెలిపారు. 1-5 తరగతులకు చెందిన 11,95,440 మంది, 6 నుంచి 8 వరకు 7,18,428 మంది, 9, 10 తరగతుల వరకు 4,73,883 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్న ట్లు అధికారులు చెప్పారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డీఈవోలను ఆదేశించామని పేర్కొన్నారు.

448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles