బావిలోపడి ఇంటర్ విద్యార్థిని మృతి

Sun,October 13, 2019 01:29 AM

నార్నూర్: నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజుల్‌గూడలో చోటుచేసుకున్నది. రాజుల్‌గూడకు చెందిన జాదవ్ గణేశ్-లలిత దంపతుల కుమార్తె పల్లవి(17) నార్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తమ పొలంలో పత్తి ఏరేందుకు వెళ్లింది. దాహార్తిని తీర్చుకునేందుకు బావి వద్దకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles