లక్ష్యందిశగా గురుకులాలు


Wed,June 12, 2019 02:13 AM

150 TSWREIS students likely to get into medical colleges

-సంక్షేమశాఖ మంత్రి కొప్పుల
హైదరాబాద్/ బండ్లగూడ, నమస్తే తెలంగాణ: పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా కృషిచేస్తున్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయస్థాయి నీట్ అర్హత సాధించిన వారు, మారిటైం యూనివర్సిటీ, లాసెట్‌లలో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థుల అభినందన సభను మంగళవారం రాజేంద్రనగర్‌లోని గిరిజన సంక్షేమ ఐఐటీ సెంటర్‌లో నిర్వహించారు. నీట్‌లో అధిక మార్కులు సాధించడం హర్షణీయమని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. 150 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ అర్హత సాధించడం ఆనందంగా ఉందని, గురుకులాలతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఉన్నతస్థానాలను దక్కించుకుంటున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles