పొగమంచుతో రోడ్డు ప్రమాదం


Sun,January 13, 2019 02:27 AM

12 Vehicles Collides Due to Fog in Ranga Reddy district

-ఒకదానికొకటి 12 వాహనాలు ఢీ
-రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ వద్ద ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/నందిగామ: పొగమంచు కారణంగా వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టడం మనకు విదేశాల్లోనో, ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, హర్యానాల్లో జరిగినట్టు తెలుసు. కానీ హైదరాబాద్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. పొగమంచు కమ్ముకోవడంతో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ వద్ద బైపాస్ రోడ్డుపై 12 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో అన్ని వాహనాలు ధ్వంసమవగా ప్రాణనష్టమేమీ జరుగలేదు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం 7:15 గంటలకు దట్టమైన పొగమంచుతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు బస్సులు, మూడు లారీలు, రెండు ఆటోలు, ఐదు కార్లు ఒకదానికొకటి వెనుకనుంచి ఢీకొన్నాయి. మొదట ఓ ఆర్టీసీ బస్సు ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో మొదటి ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో వెనుకాల నుంచి వచ్చిన వాహనాలు వరుసగా ఢీకొట్టుకున్నాయి. స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.

ఔటర్‌పై వేగానికి కళ్లెమేద్దాం!

-ప్రమాదాలు అరికట్టడంపై పోలీస్‌శాఖ దృష్టి


ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్)పై మితిమీరిన వేగంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడంపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. రయ్‌మంటూ దూసుకుపోతున్న వాహనాల వేగాన్ని కట్టడిచేసేందుకు ఇప్పటికే లేజర్ స్పీడ్‌గన్ కెమెరాలను వినియోగిస్తూ.. కేసులు నమోదుచేసి, భారీగా జరిమానా వసూ లు చేస్తున్నది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొంగుళూరు - రావిర్యాల మధ్య ఓఆర్‌ఆర్‌పై అంబులెన్స్‌ను కారు అతివేగంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనవేగం గంటకు వంద కిలోమీటర్లు దాటితే రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అవసరమైతే జరిమానా మొత్తాన్ని మరింత పెంచాలని ఆలోచిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని సైన్‌బోర్డుల ఏర్పాటుతో పాటు డ్రైవర్‌ను అలర్ట్ చేసేకోవటంపై అధికారులు చర్చించారు.
ACCIAANT-CAR1

2461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles