భావిపౌరులకు బంగారుబాట


Mon,June 17, 2019 02:27 AM

119 BC Residential Schools to be Inaugurated June 17 In Telangana

-నేడు 119 నియోజకవర్గాల్లో బీసీ గురుకులాల ప్రారంభం
-బాలురకు 63, బాలికలకు 56
-లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భావిపౌరులకు బంగారుబాటలు పరుచుకున్నాయి. పేదింటి బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు విద్యాలయాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ఒకేసారి ప్రారంభంకానున్నాయి. వీటిలో బాలుర గురుకులాలు 63 కాగా, బాలికలవి 56 ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేల చేతులమీదుగా గురుకులాలను లాంఛనంగా ప్రారంభించేందుకు బీసీ సంక్షేమశాఖ ఏర్పాట్లుచేసింది. బీసీల్లోని పేదలందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం అధికసంఖ్యలో ఏర్పాటుచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ పాలనలో సోమవారం ప్రారంభించే 119 కలుపుకొంటే వాటి సంఖ్య 281కి చేరనున్నది. ఏకకాలంలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించడం ఒక్క తెలంగాణలోనే సాధ్యపడింది. ఈ విద్యాసంవత్సరం 281 బీసీ గురుకులాల్లో 92,340 మంది విద్యార్థులకు చదువుకొనే అవకాశం దక్కనున్నది.

2134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles