క్రాస్‌కు 100 మిలియన్ డాలర్ల ఆర్డర్


Fri,July 12, 2019 02:12 AM

100 million order for Cross

-భారత సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌కు బరాక్-8 మిసైల్స్, కిట్స్ సరఫరాకు ఒప్పందం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణరంగ పరికరాల తయారీసంస్థ రాఫెల్ అడ్వాన్స్ సిస్టమ్స్‌కు భారత్‌కు చెందిన కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (క్రాస్) మధ్య 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.684 కోట్ల) ఆర్డర్‌కు ఒప్పందం కుదిరింది. భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు 1000 బరాక్-8 ఎంఆర్‌ఎస్‌ఏఎం మిసైల్స్, కిట్స్ సరఫరా చేసేందుకు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాఫెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్, ఎయిర్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ డివిజన్ బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) పినియుంగ్‌మన్.. కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇండియా (క్రాస్) చైర్మన్ బాబా కల్యాణికి ఒప్పంద పత్రాలను అందించారు. కల్యాణి సంస్థ ఈ మిసైల్స్, కిట్స్‌ను మరింత మెరుగుపర్చేందుకు బీడీఎల్‌కు అందిచనున్నది. అక్కడినుంచి అవి భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చేరుతాయి. ఈ సంస్థ మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిఫెన్స్ పరికరాలను తయారు చేయనున్నది. 2023 నాటికి 300 మంది సాంకేతిక నిపుణులతో క్రాస్ తమ సంస్థను మరింత బలపర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.

తెలంగాణలో రెండో యూనిట్

ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బిగ్రేడియర్(రిటైర్డ్) పిని యుంగ్‌మన్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా క్రాస్‌తోపాటు ఇతర భారతీయ రక్షణరంగ పరిశ్రమలతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. కల్యాణి గ్రూప్ చైర్మన్ బాబా కల్యాణి మాట్లాడుతూ దేశంలో తమకున్న సామర్థ్యానికి ఈ ఆర్డర్ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎంతో గొప్పగా ఉన్నదని చెప్పారు. క్రాస్ విస్తరణలో భాగంగా తెలంగాణలో రెండో యూనిట్‌ను నెలకొల్పేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని, వందఎకరాల స్థలం కావాలని ప్రతిపాదనలు పెట్టినట్టు వివరించారు. భవిష్యత్తులో సొంతంగా తమ సంస్థ ద్వారానే రక్షణరంగ పరికరాలు తయారుచేసే ప్రణాళికలు ఉన్నట్టు పేర్కొన్నారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles