దేవుడి సన్నిధి

Mon,July 31, 2017 12:47 PM

డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులంతా ఘనంగా సంబరాలు జరుపుకుంటారు. చర్చిలలో దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దేవుడి పండుగ సందర్భంగా తెలంగాణ సహా దేశవిదేశాల్లో ఉన్న ప్రముఖ క్రైస్తవాలయాల గురించి తెలుసుకుందాం..

సెయింట్ జాన్స్ చర్చ్, సికింద్రాబాద్


st-marys-secbad
జంటనగరాల్లో ఇది పురాతన క్రైస్తవాలయం. 1813లో టస్కాన్ ఆర్కిటెక్చర్ ైస్టెల్‌లో నిర్మితమైన ఈ అద్భుత కట్టడం.. ఇటీవలె రెండువందల సంవత్సరాల వేడుకులు జరుపుకొంది. 1998లో చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. అద్భుతమైన చిత్రకళను కలిగిఉండటం ఈ చర్చి ప్రత్యేకత. మింటన్ టైల్స్‌తో నిర్మితమైన ఈ చర్చి.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఆల్ సెయింట్ చర్చ్, తిరుమలగిరి


all-saints-tirumalgiri
జంటనగరాల్లో నిర్మితమైన ప్రముఖ చర్చిలలో ఇది కూడా ఒకటి. తిరుమలగిరి ప్రాంతంలో 1880లో ఈ చర్చిను నిర్మించారు. గోతిక్ ైస్టెల్‌లో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేకంగా దర్శనమిచ్చే ఈ క్రైస్తవాలయం.. పర్యాటక ప్రదేశంగానూ పేరొందింది. బ్రిటీష్‌వారి కాలంలో అభివృద్ధి చెందిన ఈ చర్చిలో.. అప్పటి పరిపాలకుల పేర్లన్నీ చెక్కి ఉంటాయి.

బెసిలికా ఆఫ్ బోమ్ జీస్ చర్చి, ఓల్డ్ గోవా


Old-Goa
జాలీ ట్రిప్ వెళ్లాలనుకునేవారు ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ గోవానే. అక్కడి ఎంజాయ్‌మెంట్‌ను తనివితీరా ఆస్వాదించాలనుకుంటారు. అయితే అక్కడ మరో అద్భుతం కూడా ఉంటుందని మాత్రం మరిచిపోవద్దు. అదే ఓల్డ్ గోవాలోని బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్. బరోక్యు ైస్టెల్‌లో నిర్మితమైన ఈ చారిత్రక చర్చి.. దేశంలోనే ప్రముఖమైందిగా పేరొందింది.

కేథడ్రిల్ ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్, ఢిల్లీ


delhi-church
దేశరాజధాని ఢిల్లీలోని ప్రముఖ చర్చిలలో ఈ క్రైస్తవాలయం ఒకటి. ఇక్కడి పురాతన బిల్డింగ్స్ జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. భాయ్ వీర్‌సింగ్ మార్గ్ రోడ్డులో, పద్నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేథడ్రిల్ చర్చిలో ఏడాది పొడవునా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 1929లో రెవరెండ్ డాక్టర్ ఇ వన్నీ, దీని నిర్మాణానికి పునాది వేయగా.. 1930లో నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి మార్బుల్స్, ఫర్నీచర్ అన్నీ ప్రత్యేకంగా వివిధ దేశాల నుంచి బ్రిటీషు ఆఫీసర్లు తెప్పించినవే. చర్చి బిల్డింగ్ నిర్మాణాన్ని బ్రిటీష్ ఆర్కిటెక్చర్ హెన్రీ మెడ్ డిజైన్ చేశారు.

సెయింట్ ఆండ్రూస్ బెసిలికా, కేరళ


delhi-church
ఇండియాలో చర్చిలకు కేరళ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మరి కేరళలో ఫేమస్ చర్చి ఏదంటే మాత్రం అర్తుంకాల్ సెయింట్ ఆండ్య్రూస్ బెసిలికా పేరే ముందుంటుంది. డయోసిస్ ఆఫ్ అలప్పిగా మారిన తొలి బెసిలికా చర్చి ఇదే. అంత ఫేమస్ చర్చి కాబట్టే.. ఏటా ఇక్కడికి సందర్శకులు, భక్తులు లక్షల్లో వస్తుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ పర్వదినంలో ఇక్కడ కాలు పెట్టేందుకు సందు దొరకదంటే అతిశయోక్తి కాదు.

సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, మైసూర్


MYSURE-CHURCH
మైసూర్‌లోని గొప్ప స్మారకం సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. ఇది జర్మనీలోని కోలన్ కేథడ్రిల్ చర్చిను పోలి ఉంటుంది. 1936లో ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డాలీ .. అద్భుతమై చిత్రకళతో దీనిని నిర్మించారు. దీన్ని సెయింట్ జోసఫ్ చర్చిగా కూడా పిలుస్తారు. చర్చి ఎదుట ఉన్న సెయింట్ జోసఫ్ విగ్రహం.. ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. అందుకే ఈ చర్చి మైసూర్‌లో ప్రధాన దైవక్షేత్రంగా, పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.

చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్, జెరూసలేం


JERUSLAM
క్రిస్మస్ పర్వదినాన ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన ప్రదేశం జెరూసలేం. ఏసుక్రీస్తు పుట్టింది ఇక్కడేనని క్రైస్తవుల నమ్మకం. సమీపంలోని బెతలెహమ్‌లో క్రీస్తు జన్మించాడని విశ్వసిస్తారు. దీనికి గుర్తుగా ఇజ్రాయిల్‌లో నిర్మితమైన అద్భుత క్రైస్తవాలయం చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్. గోల్కోథాలోని హిల్ ఆఫ్ కల్వరిలో ఉన్న ప్రాంతంలో ఏసు క్రీస్తు సమాధి ఉందట.

బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్, ముంబై


MUMBAI-CHURCH
ముంబై నగరంలో అతిపురాతన చర్చిగా ప్రసిద్ధికెక్కింది బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్ చర్చి. వెస్ట్ బాంద్రాలోని ఒక చిన్న కొండపై ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడికి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ చర్చి పర్యాటక ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది.

నోట్రి డేమ్ డీ పారిస్ చర్చ్, పారిస్


paris
వందేళ్లపాటు నిర్మాణం జరుపుకొన్న అరుదైన చర్చి ఇది. యూరప్‌లోని ఈ అందమైన కేథడ్రిల్ చర్చిలలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వీటిపై ఏర్పాటు చేసిన శిఖరం, రంగులు అద్దిన గాజు అద్దాలు, విగ్రహాల ప్రతిష్టాపన.. ప్రతీ అంశమూ అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే చారిత్రక వైభవాన్ని తిలకించేందుకు వివిధ దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి తరలివస్తుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిలో సరికొత్త సందడి నెలకొంటుంది.

సెయింట్ మేరీస్ చర్చ్, సికింద్రాబాద్


st-marys-secbad
బ్రిటీష్ పరిపాలనా కాలంలో ఏర్పడిన ప్రధానమైన చర్చిలలో సెయింట్ మేరీస్ ఒకటి. సికింద్రాబాద్‌లోని ఈ చర్చి.. బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్‌గా కీర్తికెక్కింది. నిజాం కాలంలో కంటోన్మెంట్ ఏరియాలో బ్రిటీష్ సైన్యాధికారులు నివాసముండేవారట. వారు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా సెయింట్ మేరీస్ చర్చ్‌ను నిర్మించారని చెబుతారు చరిత్రకారులు. బ్రిటీష్ ప్రతినిధి మర్ఫి ఆధ్వర్యంలో 1840లో ప్రారంభమైన దీని నిర్మాణం 1850లో పూర్తయ్యింది. 1842లో బొల్లారంలోని సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ చర్చి కూడా ఈయన ఆధ్వర్యంలోనే నిర్మితమైంది. బిషప్ మర్ఫి ఇక్కడున్న విద్యార్థులకు ఇంగ్లీష్‌ను బోధించేందుకు సెయింట్స్ సెమినరీ స్కూల్స్‌ను ప్రారంభించాడు. ప్రతి ఏటా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

కేథడ్రిల్ చర్చ్, మెదక్


medak-cherch
ప్రపంచంలోనే ప్రముఖమైన క్రీస్తు ఆలయంగా పేరొందిన మెదక్ కేథడ్రిల్ చర్చి, విశేషమైన, ప్రత్యేకమైన చరిత్రను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో ఉన్న ఈ క్రైస్తవక్షేత్రం.. దేవుని సన్నిధిగా, పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రిటీషువారి కాలంలో ఈ క్రీస్తు దేవాలయం నిర్మించబడింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో విపరీతమైన కరువు తాండవం చేసింది. తిండి లేక జనాలు అల్లాడిపోయారు. దీంతో అప్పుడున్న రెవరెండ్ వాకర్ పోస్నెట్... ప్రజల ఆకలి తీర్చేందుకు , చర్చి నిర్మాణం ప్రారంభించారు. చర్చి నిర్మాణంలో పాలు పంచుకునేవారికి అన్నం పెడతామని ప్రకటించి... పనికి ఆహార పథకం మొదలెట్టారు. 1914 నుంచి 1924 వరకు, సుమారు పది సంవత్సరాల పాటు ఈ చర్చి నిర్మాణం సాగింది. అలా ఆనాటి కరువు నుంచి తమను కాపాడుకునేందుకు.. ప్రజలు ఈ దైవసన్నిధినే మార్గంగా ఎంచుకున్నారు. అందుకే నేటికీ ఈ చర్చంటే ఒక ప్రత్యేకమైన భక్తిభావం ప్రజల్లో ఉంది. ప్రతీ ఆదివారం చర్చి ప్రాంగణమంతా... పర్యాటకులతో సందడిగా మారిపోతుంది. క్రిస్మస్ వేడుకలకు చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అశేష భక్తజనం ఇక్కడికి తరలివచ్చి.. ప్రభువు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరొందిన దీని నిర్మాణశైలి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్.. పూర్తి తెల్లరాయినే ఉపయోగించారు.
ఈ చర్చికి అమర్చిన రంగురంగుల కిటికీలు.. బైబిల్ సారాన్ని బోధిస్తాయి.
- సంతోష్‌కుమార్ ప్యాట

7071
Tags

More News

Featured Articles

Health Articles