చారిత్రక పుట్ట.. బొమ్మలమ్మ గుట్ట!

Wed,November 18, 2015 11:33 AM

అనగనగా ఒక కొండ.. కూర్చున్న ఎద్దులా కనిపించే దానిపై అంతెత్తు బండ.. ఆ కొండ గురించీ, మీదున్న బండ గురించీ చెబితే ఒడవనంత కథ ఉంది.. అంతకుముందు ఆంధ్రుల ఆదికవిగా చెప్పుకునే నన్నయకు అన్నయ్యలాంటి ఓ కవి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది.. తెలుగు భాషకు ప్రాచీన హోదా కట్టబెట్టిన తొలికందాల్ని తన కడుపులో దాచుకున్న ఆ ‘వృషభగిరి’పై సమైక్యాంవూధలో కొనసాగిన వివక్ష గురించీ, గ్రానైట్ తవ్వకాల పేరిట ఆ అ‘పూర్వ’ శిలాశాసన సంపదను అమాంతం మింగబోయిన సీమాంధ్ర సర్కారుపై వర్తమానంలో జరిగిన ‘చారివూతక’ పోరాటం గురించీ, రేపటి తెలంగాణ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం గురించీ ఇక్కడ చర్చించాల్సిన అవసరముంది..

ఒకప్పటి వృషభగిరే నేటి బొమ్మలమ్మ గుట్ట. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఉంది. దూరం నుంచి చూస్తే ఎద్దు ఆకృతిలో కనిపించడం, పైనున్న విశాల ఏకశిలపై ఆది తీర్థంకరుడు వృషభనాథుడి విగ్రహం చెక్కి ఉండడంతో క్రీ.శ. 10వ శతాబ్దంలో ‘వృషభగిరి’,‘వృషభావూది’గా ప్రసిద్ధిగాంచినట్లు తెలుస్తోంది. ఈ శిలపై ఉన్న పది బొమ్మలు(విక్షిగహాలు), మధ్యలోని ‘అమ్మ’ ఎవరో అర్థం కాని ఇక్కడి గ్రామీణులు ‘బొమ్మలమ్మ గుట్ట’గా పిలుచుకోగా, అదే స్థిరపడి వాడుకలో ఉంది. ఒకప్పుడు గొప్ప జైనమత క్షేత్రంగా వెలుగొంది, ఇటీవల తెలుగు భాషా చరివూతనే మలుపు తిప్పిన ఈ గుట్ట గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే అప్పటి చరివూతను కాస్త తిరగేయాల్సిన అవసరముంది.

వేములవాడ చాళుక్యుల కాలమది..
‘సీమాంవూధుల చరిత్ర’ పుస్తకాల్లో స్థానం కోల్పోయిన వేములవాడ చాళుక్యులు క్రీ.శ. 750 నుంచి క్రీ.శ. 973 వరకు.. అంటే సుమారు రెండు శతాబ్దాల పాటు మొదట బోధన్‌ను, తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని ‘సపాదలక్ష’ రాజ్యాన్ని(నేటి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రాంతాన్ని) పరిపాలించారు. వీరు రాష్ట్రకూటుల సామంతులు. వీరిలో రాజనీతిజ్ఞుడు, విద్యావిశారదుడు, కవిపండిత పోషకుడిగా గుర్తింపు పొందిన రెండో అరికేసరి, క్రీ.శ.930 నుంచి క్రీ.శ.955 వరకు వేములవాడ రాజధానిగా పాలించాడు. ఈయన ఆస్థానంలోని పంప మహాకవి, కన్నడ కవివూతయంలో ఒకడు. రెండో అరికేసరిని అర్జునుడితో పోలుస్తూ.. ఆయన రచించిన ‘విక్షికమార్జున విజయం’.. ‘పంప మహాభారతం’గా ప్రసిద్ధిగాంచింది. ఆ పంప మహాకవి తమ్ముడే జినవల్లభుడు. జైనమతాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన ఈ జినవల్లభుడే తెలంగాణ కవులను, ఆంధ్ర నన్నయకు అన్నయ్యలను చేశాడు.

బొమ్మలమ్మే జైనచక్రేశ్వరి..
క్రీ.శ.945లో జినవల్లభుడు, బొమ్మలమ్మ గుట్టపై నిలిచి ఉన్న సమతలసిద్ధ శిలపై జైనుల దేవత చక్రేశ్వరిని, ఆమె పైభాగాన ఆది, అంత్య తీర్థంకరులైన వృషభనాథుడు, వర్థమాన మహావీరుడి విగ్రహాలను ఆకర్షణీయంగా చెక్కించాడు. అష్టభుజాలు కలిగిన చక్రేశ్వరీ దేవి, వివిధ ఆయుధాలు, ఆభరణాలతో గరుడవాహనంపై కొలువుదీరగా, ఆమెకిరువైపులా ముగ్గురి చొప్పున ఆరుగురు జైన దిగంబరులున్నారు. ఇక చక్రేశ్వరి భుజాలకిరువైపులా ఆమె సేవకులుగా భావించే స్త్రీ రూపాలు చెక్కి ఉన్నాయి. జినవల్లభుడు ఇంకా ‘త్రిభువన తిలక’మనే జైనబసది, ‘మదనవిలాస’మనే తోటను గుట్టపై ఏర్పాటు చేసి, కింద ‘కవితాగుణార్ణవం’ అనే చెరువును తవ్వించాడు. ఇవన్నీ నేటికీ నిలిచి ఉండడం విశేషం.

తెలుగుకు ‘ప్రాచీన హోదా’ కట్టబెట్టిన కందాలు..
ఈ జైనచక్రేశ్వరి, దిగంబర విగ్రహాల కింది భాగాన జినవల్లభుడు చెక్కించిన త్రిభాషా(తెలుగు, కన్నడ, సంస్కృత) శాసనమే తెలుగుభాషా చరివూతను మలుపుతిప్పింది. ఆంధ్రుల ఆదికవిగా చెప్పుకునే నన్నయనకీ.శ.1051)కు వందేళ్ల ముందే ఇక్కడ తెలుగులో సాహిత్యం వచ్చిందని ఆధారసహితంగా రుజువైంది. క్రీ.శ.945లో వేయించిన ఈ శాసనం చివరన ఉన్నవి తొలి తెలుగు కంద పద్యాలని తేలింది. ఇవి అప్పట్లోనే ‘ఆంవూధవూపదేశ్ ప్రభుత్వ పురావస్తుశాఖ’ పుస్తకాలకెక్కినా సీమాంధ్ర సర్కారు వివక్షతో పాఠ్యపుస్తకాల్లో మాత్రం స్థానం సంపాదించలేకపోయాయి. 1995లో కరీంనగర్ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కవి, డాక్టర్ మలయశ్రీ పరిశోధనతో ఇవి తెలుగుభాషలోనే మొట్టమొదటి కంద పద్యాలని ప్రపంచానికి తెలిసింది. అనంతర కాలంలో తమిళంలాగే తెలుగుకూ ప్రాచీనభాష హోదా కల్పించాలనే ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా బయలుదేరింది. ఈమేరకు రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన ఆధారాల్లేక కేంద్రవూపభుత్వం ససేమిరా అంది. ఆ సమయంలో బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కందపద్యాలే కీలకమయ్యాయి. నిజానికి సీమాంధ్ర ప్రభుత్వం, అక్కడి చరివూతకారుల వివక్షతోనే ఈ పద్యాలు మరుగునపడ్డాయి. కాని చివరికి వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం మన తెలుగుభాషకు ప్రాచీనహోదా కల్పించింది. ‘ఒడ్డెక్కే దాకా ఓడ మల్లన్న, ఒడ్డెక్కినంక బోడ మల్లన్న’ అన్న చందంగా ఈ అ‘పూర్వ’ చారివూతక సంపద సంరక్షణను ఎప్పట్లాగే సీమాంధ్ర సర్కారు గాలికొదిలేసింది. ఫలితంగా ఇక్కడి త్రిభాషా శాసనం క్రమక్షయానికి లోనవుతూ కనుమరుగయ్యే దుస్థితికి చేరింది.

గ్రానైట్‌వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర..
సంపాదనే తప్ప, మరే ‘చారివూతక’ సంపదా పట్టని గ్రానైట్ వ్యాపారుల కళ్లు బొమ్మలమ్మగుట్టపై పడనే పడ్డాయి. 2008-09లో ఏకంగా 17 సంస్థలు, ఈ వృషభావూదిని పిండి చేసేందుకు దరఖాస్తు చేసుకోగా, ఎమ్మార్వో నుంచి ఏడు సంస్థలకు అనుమతులు దక్కాయి. ఉపవూదవాన్ని పసిగట్టిన వెంటనే సమీప గ్రామం కొండన్నపల్లికి చెందిన ఉప్పు లింగయ్య, రేండ్ల కళింగశేఖర్, రేండ్ల రాజేష్, కురిక్యాలకు చెందిన నల్లాల రాజేందర్, నేరెళ్ల శ్రీనివాస్ తదితరులు ‘బొమ్మలమ్మ గుట్ట పరిరక్షణ సమితి’ పేరిట ఏకమయ్యారు. వీరికి పలు యువజన సంఘాలు తోడయ్యాయి. ఇంకేం.. బొమ్మలమ్మగుట్ట పరిరక్షణ ఉద్యమం ఉధృతమైంది. జిల్లావ్యాప్తంగా చరివూతకారులు, కవులు, కళాకారులు, పర్యావరణవేత్తలు కూడా కలిసివచ్చి మూకుమ్మడిగా కదం తొక్కారు. జర్నలిస్టులూ గొంతు కలిపారు. మీడియా ప్రచారం కూడా కలిసివచ్చింది. ఫలితంగా అంతకుముందు, గుట్టపై ఎలాంటి దేవస్థానంగానీ, చారివూతక ఆధారాలు గానీ లేవని నివేదిక ఇచ్చిన జిల్లా అధికారులు దిగివచ్చి, గ్రానైట్ సంస్థలకిచ్చిన అనుమతులను వెనక్కి తీసుకున్నారు. కానీ కథ అంతటితో ముగిసిపోలేదు.

ఆ తర్వాత కూడా సీమాంధ్ర సర్కారు బొమ్మలమ్మ గుట్టను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పరిరక్షణసమితి అధ్యక్షుడు ఉప్పు లింగయ్య రూటు మార్చారు. ఇక్కడి ‘కన్నడ’ ఆనవాళ్ల గురించి, త్రిభాషా శాసన ఔన్నత్యం గురించి అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లేఖ రాశారు. స్పందించిన ఆయన, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రత్యేకంగా మాట్లాడగా, దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు సర్కారు నుంచి ఓ సందేశం వచ్చింది. 2011 సెప్టెంబర్ 27న స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య బొమ్మలమ్మగుట్ట వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్షికమంలో దానిని చదివి వినిపించి వెళ్లారు.

‘పర్యాటక’ గుర్తింపు ఎక్కడ?
తెలుగుభాషా ఔన్నత్యానికి నిలు ప్రతీకలా ఉన్న బొమ్మలమ్మ గుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించి, అభివృద్ధి చేయాలనే డిమాండ్ 20 ఏళ్లుగా ఉన్నా సీమాంధ్ర సర్కారు పట్టించుకోలేదు. 2011 ప్రకటన తర్వాత కూడా విగ్రహాలు, త్రిభాషా శాసనాన్ని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2012 సెప్టెంబర్ 27 పర్యాటక దినోత్సవాన అప్పటి జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్, పురావాస్తు శాఖాధికారి వెంక బొమ్మలమ్మ గుట్టను సందర్శించారు. కురిక్యాల నుంచి రోడ్డు, గుట్టపైకి మెట్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.50 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదటివిడత 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చి వెళ్లారు. కానీ నేటికీ నయాపైసా రాలేదు. ఇక గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి మరో రూ.10 లక్షలు కేటాయిస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో అధికారులు, ప్రజావూపతినిధుల తీరుపై చరివూతకారులు, భాషావేత్తలు, స్థానికులు మండిపడుతున్నారు. రాబోయే తెలంగాణ సర్కారైనా బొమ్మలమ్మగుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించి, అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కంద పద్యాలు..
1. జిన భవనముపూత్తించుట
జిన పూజల్సేయుచున్కి జిన మునులకు న
త్తిన యన్న దానం బీవుట
జినవల్లభు బోలంగలరె జిన ధర్మపరుల్
2. దినకరుసరి వెల్గుదుమని
జినవల్లభు నొట్టనెత్తు జితకవినననున్
మనుజుల్గలరే ధాత్రిం
వినుతిచ్చెదు ననియవృత్త విబుధ కవీంవూదుల్
3. ఒక్కొక్క గుణంబ కల్గుదు
రొక్కొణ్డిగా కొక్కలక్క లేవెవ్వరికిం
లెక్కింప నొక్కొ లక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్
‘‘జినభవనాలు కట్టించడం, జినసాధువుల పూజలు చేయడం, జినమునులకు నచ్చిన భోజనాలు పెట్టడంలో ఇతర జైనుపూవ్వరినీ జినవల్లభునితో సరిపోల్చలేం. సూర్యుడితో సమానంగా వెలుగువారు, జినవల్లభునితో సరితూగు మరే కవులూ లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సుగుణంతో ఉంటారు. ఆలోచించి చూస్తే జినవల్లభుడే గుణమణి. పైగా ఆయన గుణపక్షపాతి’’ అని ఈ కందాల అర్థం.

8203

More News

Featured Articles

Health Articles