ఉపవాసాలు చేయను!


Sun,August 13, 2017 02:55 AM

samantha ప్రేక్షకులతో ఏం మాయ చేశావే అనిపించింది. సినిమాల్లో దూకుడు చూపిస్తుంది. ఆమె ఉంటే సినిమాలు బ్రహ్మోత్సవం చేసుకోవాల్సిందే! కత్తిలాంటి ఈ అమ్మాయి.. గురించి కొన్ని సమ్‌థింగ్.. సమ్‌థింగ్ విషయాలు..

డైట్ : నాకు ఉపవాసాలు చేయడం, డైటింగులు పాటించడం పట్ల పెద్ద ఆసక్తి లేదు. అన్ని ఆహార పదార్థాలను మితంగా తీసుకుంటా. నచ్చింది తినేస్తా. వ్యాయామాలకి తగినట్లుగా ప్రొటీన్ ఫుడ్‌ని ఇష్టపడుతాను. సాంబరన్నం అంటే చాలా ఇష్టం. దోశ, వడ, ఇడ్లీ అంటే ప్రాణం. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతా. అంతేకాదు.. పచ్చళ్లు, స్వీట్స్, బ్లాక్ కాఫీ, చికెన్.. ఇలా చెప్పుకుంటూ పోతే నా ఫుడ్ లిస్ట్ చాలా పెద్దది.

బ్యూటీ : నాకు వదులుగా ఉండే బట్టలు ఇష్టం ఉండదు. నా తత్వాన్ని ప్రతిబింబించే బటల్నే ఇష్టపడుతాను. బ్యాగ్‌లో ఎప్పుడూ సన్‌స్క్రీన్ ఉంటుంది. రాత్రి కచ్చితంగా మేకప్ తీసి, ముఖం కడిగిన తర్వాతే పడుకుంటాను. ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అందం అదే రెట్టింపు అవుతుందన్నది నా నమ్మకం.

ఫిట్‌నెస్ : ఎంత బిజీగా ఉన్నా జిమ్ముకి తప్పకుండా వెళ్లి తీరుతాను. ఒకవేళ ఏదైనా ట్రైనింగ్ సెషన్ అంటే 15 నిమిషాలు ముందే ఉంటా. వర్కవుట్లంటే అంత ఇష్టం. షూటింగులుంటే ఐదింటికల్లా జిమ్ములో ప్రత్యక్షమవుతా. వర్కవుట్లు చేయలేకపోతే కనీసం ఆ రోజు గంటపాటు జాగింగ్ అయినా చేస్తా.

789
Tags

More News

VIRAL NEWS