5 థింగ్స్


Sun,December 2, 2018 01:19 AM

Happy-Mood

మూడ్ మార్చేస్తుంది!

అఅనారోగ్యానికి ముఖ్య కారణం మనిషి మానసిక స్థితేనని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. మూడ్ సరిగా ఉంటే.. మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవల గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేకపోతే ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటారట. ఒక రోజులో అనుభవించే మానసిక స్థితిగతులను అంచనా వేసేందుకు ఎఫ్‌ఎంఆర్‌ఐ స్కానింగ్‌లోని మెదడు కదలికలపై పరిశోధనలు చేశారు. ఓ వ్యక్తి మూడ్ మంచిగా ఉన్నప్పుడు అతని మెదడు చురుగ్గా పనిచేసిందని, మూడ్ సరిగా లేనప్పుడు ఆందోళన, నిరాశ కలిగి మెదడు కదిలికలు నామమాత్రంగా ఉండడాన్ని గుర్తించారు. ఇలా వారం నుంచి ఏడాది వరకూ ఎంతోమంది కార్యకపాలు నమోదు చేసి, అధ్యయనం చేశారు.
New-Trend

వామ్మో.. ఇదొక ట్రెండా!?

ఫ్యాషన్ ప్రియులను కొంగొత్త ట్రెండ్ భయపెడుతూ ఆకర్షిస్తున్నది. వర్క్ ఆఫ్ ఆర్ట్‌గా పిలుస్తున్న కెనడియన్ బ్రాండ్ ఫేషియల్ పదార్థం మానవ చర్మాన్ని పోలి ఉంటుంది. దీనితో భయంకరరంగా రెడీ అవొచ్చు. ఈ ఫేషియల్‌కు అయ్యే ఖర్చు దాదాపు పదివేల డాలర్లు. ఈ కొత్త రకపు ఫేషియల్ పదార్థంతో శరీరానికి కొమ్ములు, కళ్లు, ఎముకలు అమర్చవచ్చు. ప్రస్తుతం ఈ కొత్తరకపు ట్రెండ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఒళ్లు గగుర్పొడిచే ఈ నయా ట్రెండ్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నది. ఈ ట్రెండ్ సృష్టికర్తలు రోజ్ డాల్టన్, స్టీవెన్ భాస్కరన్. దెయ్యాన్ని పోలిన ఆకారాలతో విడుదల చేసిన మోడల్స్ ఫొటోలు చూస్తుంటే.. ఒకింత భయం, ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు పలువురు. అంత ఖర్చు పెట్టిమరీ ఇంత విహీనంగా తయారవ్వలా అని మరికొందరు పెదవి విరుస్తున్నారు.
shiva_murti

భారీ శివమూర్తి!

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తర్వాత మరో భారీ విగ్రహం రూపుదిద్దుకుంటున్నది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో దాదాపు 351 అడుగుల భారీ విగ్రహాం నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన 85 శాతం పనులు పూర్తయ్యాయి. దీనిని 2019 మార్చి నాటికి ప్రారంభించాలని నిర్మాణకర్తలు చెబుతున్నారు. ఈ శివమూర్తి విగ్రహం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద భారీ విగ్రహంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అనుకున్న సమయానికల్లా పూర్తి చేసేందుకు దాదాపు 750 మంది కార్మికులు నాలుగేండ్ల నుంచి నిత్యం పనులు చేస్తూనే ఉన్నారు. దీనికి 2012లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శంకుస్థాపన చేశారు.
Platelets

ప్లేట్‌లెట్స్ పెంచుదాం!

శీతాకాలంలో విషజ్వరాలు విజృంభిస్తుంటారు. దీంతో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేస్తే.. రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్స్ పడిపోయి ప్రాణాలు పోయే ప్రమాదముంది. దీంతో ప్లేట్‌లెట్స్ లెవల్స్ పడిపోకుండా ఉండేందుకు.. ఆరోగ్య నిపుణులు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినమని చెబుతున్నారు. వైరల్ ఫీవర్స్ వస్తే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి వెంటనే కోలుకోవడానికి దానిమ్మపండ్లను అధికంగా తినమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పండులో పాలీ ఫినోలిక్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ ఇన్‌ఫెక్షన్ తగ్గించి ప్లెట్‌లెట్స్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడుతుంది. కివిలీ పండ్లలో విటమిన్ సీ, ఈ, ఫొల్లెట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కివిలీ జ్యూస్‌ను తాగడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో ఉండే న్యూట్రీషియన్ బెనిఫిట్స్ ఒంటికి మేలు చేస్తాయి. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల విష జ్వరాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్లేట్‌లెట్స్ పునరుత్పత్తిలో బొప్పాయి మంచి సహాయకారిణి. బొప్పాయి ఆకుల రసం, పచ్చి/పండు బొప్పాయి ఏది తిన్నా మేలే.
winston-pink-legacy

రూ.361 కోట్ల పింక్ డైమండ్!

దక్షిణాఫ్రికాకు చెందిన అరుదైన పింక్ డైమండ్ ఒకటి కొత్త రికార్డు సృష్టించింది. 19 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం ఏకంగా 50.3 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు(సుమారు రూ.361 కోట్లు)లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ.18.7 కోట్లు. స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన ఈ వేలంలో అమెరికాకు చెందిన హ్యారీ విన్‌స్టన్ సంస్థ దీన్ని దక్కించుకుంది. వేలం ప్రారంభమైన 5 నిమిషాల్లోనే హ్యారీ విన్‌స్టన్ సంస్థ భారీ ధరకు దీన్ని సొంతం చేసుకుంది. అనంతరం విన్‌స్టన్ పింక్ లెగసీ అని దానికి నామకరణం చేశారు. ఇంతకుముందెన్నడూ ప్రపంచంలో ఎక్కడా గులాబీ వజ్రం ఇంత ధర పలుకలేదని వేలం వేసిన సంస్థ క్రిస్టీస్ వెల్లడించింది. వందేండ్ల కిందట దక్షిణాఫ్రికాలోని గనుల్లో దొరికిన ఈ వజ్రాన్ని 1920లో సానపట్టి తుది రూపమిచ్చారట.

- డప్పు రవి

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles