ఈట్ ఇటాలియన్


Sun,April 22, 2018 01:39 AM

డెవిల్డ్ చికెన్ వాగ్‌లెడ్స్

కావాల్సినవి :చికెన్ వింగ్స్ : 250గ్రా., అల్లం, వెల్లుల్లిపేస్ట్ : 10గ్రా., నిమ్మ రసం : రెండు స్పూన్‌లు, పార్సిలీ : 50గ్రా., కారం : 20గ్రా., ఆలివ్ ఆయిల్ : తగినంత, ఉప్పు : తగినంత

తయారీ :చికెన్ వింగ్స్‌ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవైపు ఉన్న మాంసాన్ని తీసేయాలి. ఇప్పుడు ముక్కలు చూడడానికి లాలిపాప్‌లా కనిపిస్తాయి. ఆ ముక్కలను ఓ గిన్నెలో వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పార్సిలీ, కారం, ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి బాగా కలపాలి. అలా కలపడం వల్ల వీటన్నింటి రుచి ముక్కలకు బాగా పడుతుంది. అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు బొగ్గుల మీద కాల్చుకుంటే ఆ టేస్టే వేరు. అలా కుదరని పక్షంలో స్టౌ మీద కాల్చినా కూడా బాగుంటుంది.
chicken

పాస్తా పెర్మీవ్రీ

కావాల్సినవి :పాస్తా : 250 గ్రా., మైదా : 100గ్రా., వెన్న : 100గ్రా., పాలు : లీటరు, ఉల్లిగడ్డ : ఒకటి పెద్దది, వెల్లుల్లిపాయలు : 10గ్రా., తెల్లమిరియాల పొడి : 1గ్రా., మాకోపాన్ చీజ్ : 10గ్రా., క్యారెట్ : 10గ్రా., బీన్స్ : 10గ్రా., బేబికార్న్ : 10గ్రా., మష్రూమ్ : 10గ్రా., పార్సిలీ : 20గ్రా., డ్రై హబ్స్ : 2గ్రా., క్రీమ్ : తగినంత , ఉప్పు : తగినంత

తయారీ :పాస్తాను ముందు వేడి నీళ్లలో వేసి ఉడకనివ్వాలి. క్యారెట్, బీన్స్, బేబికార్న్, మష్రూమ్‌లను కట్ చేసుకొని ఉడకబెట్టాలి. ఈ రెండింటిలో కూడా నీటిని వేరు చేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వెన్నను వేసుకొని కరిగాక అందులో మైదా వేయాలి. అయితే మైదాను కొద్ది, కొద్దిగా వేయాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత పాలు పోసి ఒక పావుగంట కలుపుతూ ఉండాలి. మరో గిన్నెలో కాస్త వెన్న వేసి అందులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు బ్రౌన్ రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇందులో పాస్తా, ఉడకబెట్టిన క్యారెట్, బీన్స్ మిగతా ముక్కలూ వేయాలి. ఐదు నిమిషాల తర్వాత మైదా మిశ్రమాన్ని కూడా వేసి.. అందులో తెల్లమిరియాలపొడి, మాకోపాన్ చీజ్, ఉప్పు, డ్రై హబ్స్, పార్సిలీ వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు క్రీమ్‌తో ఫినిషింగ్ ఇస్తే చాలు. టేస్టీ పాస్తా పెర్మీవ్రీ రెడీ అయినట్టే!
priemvri

తిరమిసు

కావాల్సినవి :కోడిగుడ్లు : 5, మెజీరోపోన్ చీజ్ : 10గ్రా., వెనీలా ఎసెన్స్ : 5మి.లీ., చక్కెర : 100గ్రా., కాఫీ పౌడర్ : 10గ్రా., కాఫీ లిక్కర్ : 2మి.లీ., చాక్‌లెట్ కేక్ స్పాంజ్ : 1పెద్దది, కోకో పౌడర్ : 5గ్రా., గ్రేటెడ్ చాక్లెట్ : 2గ్రా.

తయారీ :కోడిగుడ్లను ఒక గిన్నెలో కొట్టి తెల్లసొన, పచ్చసొనను వేరు చేయాలి. తెల్లసొన చిక్కబడే వరకు గిలకొట్టాలి. మరో గిన్నెలో పచ్చసొన, మెజీరోపోన్‌చీజ్, చక్కెర, వెనీలా ఎసెన్స్ వేయాలి. చక్కెర బాగా కరిగే వరకూ కలుపుతూ ఉండాలి. ముందు తెల్లసొన మిశ్రమాన్ని కలపాలి. ఇది క్రీమ్‌లా తయారవుతుంది. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కాఫీ పౌడర్, కాఫీ లిక్కర్ వేయాలి. అందులోనే చాక్లెట్ స్పాంజ్ వేసుకోవాలి. మనం సర్వ్ చేసుకునేందుకు గ్లాస్ లేదా గిన్నెను ఎంచుకొని అందులో ముందు కోడిగుడ్డుతో చేసిన మిశ్రమం కొద్దిగా, చాక్లెట్ స్పాంజ్ కొద్దిగా వేయాలి. ఇలా ఒకదాని తరువాత ఒకటి గిన్నె లేదా గ్లాసు నిండే వరకూ వేస్తూ పోవాలి. పై నుంచి కోకో పౌడర్, గ్రేటెడ్ చాక్లెట్‌తో గార్నిష్ చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టి తింటే చాలా బాగుంటుంది.
tiramisu

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles