రాశి ఫలాలు


Sun,November 18, 2018 12:38 AM

18-11-2018 నుంచి 24-11-2018 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పూర్వం ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారంలో ఉన్న వారికి రోజువారీ క్రయవిక్రయాలు, షేర్ బిజినెస్ వల్ల లాభాలుంటాయి. ఆటోమొబైల్, నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. అ.తే.: 14, 15, 16, 17. చే.స్తో.పా.: దుర్గాస్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం, ఆదిత్య హృదయం.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల శుభకార్యాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ధైర్యంతో ముందుకు వెళ్లడంతో చాలా పనులు ఫలించే అవకాశం ఉన్నది. అయినా పనివారితో కొన్ని ఇబ్బందులుంటాయి. అ.తే.: 16, 17. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్ర నామ పారాయణం.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్న వారికి రోజువారీ ట్రేడింగ్ వల్ల లాభాలుంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. అయినా ప్రధాన గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉండడం వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అ.తే.: 11, 12, 13. చే.స్తో.పా.: దత్తాత్రేయ స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు పొందుతారు. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. విందులకు, వినోదాలకు హాజరవుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి శుభఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అ.తే.: 11, 12, 13, 14, 15. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, దుర్గా స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల సూచనలను పాటించడం వల్ల చాలా పనులు నెరవేరుతాయి. నిత్యావసర వస్తు, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. ప్రధాన గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అ.తే.: 14, 15, 16, 17. చే.స్తో.పా.: నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా, దుర్గాస్తోత్రం.

కన్య

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. దీంతో ఆదాయం పెరుగుతుంది. మానసిక సంతృప్తి కలుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కలిసి వస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అ.తే.: 16, 17. చే.స్తో.పా.: విష్ణు సహస్ర నామ పారాయణం, నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా.

తుల

ఈ రాశి వారు ఈ వారంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం గతం కంటే చాలా వృద్ధి అవుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. నిత్యావసర వస్తు, షేర్ వ్యాపారం, హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలలో ఉన్న వారికి ఈ వారం బాగా కలిసివస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలం. అ.తే.: 11, 12, 13. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, ఆదిత్య హృదయం, దుర్గాస్తోత్రం.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి సమయానికి పెద్దల సహాయ, సహకారాలు అందుతాయి. వాటిని సద్వినియోగ పరుచుకోవడంతో కొన్ని పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, హోటల్, క్యాటరింగ్ వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రధాన గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాబట్టి ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అ.తే.: 14, 15. చే.స్తో.పా.: దుర్గాస్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత ఉంటుంది. వాహనాల వల్ల పనులు కలిసివస్తాయి. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం కలిసి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి తోటి వారితో, పై అధికారులతో సమన్వయం వల్ల పనులు నెరవేరుతాయి. ఆఫీసులో మంచి పనులు అప్పజెప్పడం వల్ల మంచి పేరు పొందే అవకాశం గోచరిస్తుంది.అ.తే.: 11, 12, 13, 16, 17. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో, తోటి వారితో అనుకూలత వల్ల పనులు నెరవేరుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. రోజువారీ క్రయ విక్రయాల వల్ల లాభాలుంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అ.తే.: 14, 15. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, మహాలక్ష్మి స్తోత్రం, హనుమాన్ చాలీసా.

కుంభం

ఈ వారంలో ఈ రాశి వారి ఆదాయం కొంత వృద్ధి అవుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో మానసిక సంతృప్తి కలుగుతుంది. కిరాణా, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం కలిసి వస్తుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, కూరగాయలు వ్యాపారంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. అ.తే.: 11, 12, 13, 16, 17. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిత్య హృదయం.

మీనం

ఈ వారంలో ఈ రాశి వారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. దీంతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల శుభకార్యాలు, చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా కలిసి వస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అ.తే.: 11, 12, 13, 14, 15. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, దుర్గా స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ. నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1536
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles