రాశి ఫలాలు


Sun,June 17, 2018 12:03 AM

17-6-2018 నుంచి 23-6-2018 వరకు

మేషం

రవి, శుక్ర, గురు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగస్తులకు ఆఫీసులో సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సత్ఫలితాలుంటాయి. పిల్లల చదువుల విషయంలో కలిసిరావచ్చు. సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అవకాశాలుంటాయి. పనివారితో ఇబ్బందులుంటాయి. పనులలో ఆలస్యం కావచ్చు. అన్నదమ్ములతో కలహాలు, వృథా ప్రయాణాలుండవచ్చు. అ.తే. : 21, 22, 23. అన.తే. : 17. చే.స్థో.పా. : నవగ్రహ స్థోత్ర పారాయణం, దుర్గా స్థోత్రం, గణపతి స్థోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

వృషభం

బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తున్నారు. మిగతా గ్రహాల అననుకూల సంచారం వల్ల అననుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలుండొచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సినిమా, సాహిత్య రంగాల్లోని వారికి అవకాశాలొస్తాయి. హోటల్, క్యాటరింగ్ వ్యాపారంలోని వారికి లాభాలుంటాయి. ఆర్థిక కారణాల వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలుండవచ్చు. అ.తే. : 17, 23. అన.తే. : 18, 19, 20. చే.స్థో.పా. : గణపతి స్థోత్రం, సుబ్రహ్మణ్య స్వామి స్థోత్రం, దక్షిణామూర్తి స్థోత్రం, నవ గ్రహ ప్రదక్షిణలు.

మిథునం

గురు, శుక్రులు అనుకూలంగా సంచరిస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నాయి. ప్రారంభించిన పనులు పూర్తికావొచ్చు. పిల్లల చదువుల విషయంలో అనుకూలత ఉండొచ్చు. నూతన వస్తువులు కొంటారు. సాహిత్య, కళారంగాల్లో అవకాశాలుండొచ్చు. వ్యాపారస్తులకు ఇబ్బందులుండొచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, అనవసర ప్రయాణాలు ఉంటాయి. అ.తే. : 18, 19, 20. అన.తే. : 21, 22. చే.స్థో.పా. : సంకటహర గణపతి స్థోత్రం, సుబ్రహ్మణ్య స్వామి స్థోత్రం, దుర్గా స్థోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

కర్కాటకం

శుక్రుడు, శని సంచారం అనుకూలంగా ఉంది. మిగతా గ్రహాల సంచారం అననుకూలం. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి నయమవుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అవకాశాలు, ఆదాయాలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకు అననుకూల ప్రాంతాలకు బదిలీలుండవచ్చు. వ్యాపారస్తులకు నష్ట సూచనలున్నాయి. ప్రయాణాలు కలిసిరాకపోవచ్చు. మానసిక అసంతృప్తి, పనుల్లో ఆటంకాలుండొచ్చు. వాహనాల వల్ల ఇబ్బందులు, అన్నదమ్ములతో అనవసర మనస్ఫర్థలు మొదలైన ఫలితాలు ఉంటాయి. అ.తే. : 17, 21, 22. అన.తే. : 23. చే.స్థో.పా. : దుర్గా స్థోత్రం, దక్షిణామూర్తి స్థోత్రం, ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామి స్థోత్రం.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుభవజ్ఞులు, పెద్దల సహకారం వల్ల పనుల్లో సత్ఫలితాలుండవచ్చు. అన్నదమ్ములతో సత్సంబంధాలుంటాయి. వ్యాపారస్తులకు అనుకూల వారం. ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే లాభాలుంటాయి. రాజకీయంలో ఉన్న వారికి సత్సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసర ఖర్చులు, పనుల్లో ఆటంకాలుంటాయి. అ.తే. : 18, 19, 20, 23. అన.తే. : 17. చే.స్థో.పా. : దుర్గా స్థోత్రం, హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్థోత్రం, మహాలక్ష్మీ స్థోత్రం.

కన్య

అధిక గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి పనులు చేస్తే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో అనుకూలత ఉంది. వ్యాపారంలో కలిసిరావొచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలత ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. కింది స్థాయి ఉద్యోగులతో మనస్పర్థలుండవచ్చు. అ.తే. : 17, 21, 22. అన.తే. : 18, 19, 20. చే.స్థో.పా. : గణపతి స్థోత్రం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి స్థోత్రం.

తుల

గురు మినహాయించి అన్ని గ్రహాల సంచారం అననుకూలంగా ఉన్నది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. గతంలో ప్రారంభించిన పనులు కొంత ముందుకు సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు యథావిథిగా ఉంటాయి. పనివారితో ఇబ్బందులుంటాయి. పెద్దల సూచనలు విస్మరించడం వల్ల చాలా విషయాల్లో వ్యతిరేక ఫలితాలుండొచ్చు. వాహనాల వల్ల ఇబ్బందులుండవచ్చు. అ.తే. : 17, 18, 19. చే.స్థో.పా. : సంకటహర గణపతి స్థోత్రం, ఆదిత్య హృదయం, దుర్గా స్థోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం, హనుమాన్ చాలీసా.

వృశ్చికం

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్త్ర, వస్తువులు కొనుగోలు చేస్తారు. హోటల్, క్యాటరింగ్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసిరావొచ్చు. వాహనాల వల్ల లాభాలుండొచ్చు. పెద్దల సూచనలు వల్ల పనుల్లో సత్ఫలితాలుండొచ్చు. ఖర్చులు పెరిగిపోవచ్చు. పనివారితో ఇబ్బందులుంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలుండవచ్చు. ప్రయాణాలు కలిసిరాకపోవచ్చు. పనుల్లో ఆటంకాలుంటాయి. పిల్లల ఉన్నత విద్య, విదేశీయానం ప్రయత్నాలు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడవచ్చు. అ.తే. : 18, 19, 20, 21, 22. అన.తే. : 17, 23. చే.స్థో.పా. : ఆదిత్య హృదయం, దుర్గా స్థోత్రం, హనుమాన్ చాలీసా.

ధనుస్సు

శుక్రుడు, గురు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. హోటల్, క్యాటరింగ్, ఫ్యాన్సీ వ్యాపారాల్లోని వారికి కలిసొస్తుంది. సాహిత్య, సంగీత, సినిమా రంగాల్లోని వారికి అవకాశాలు వస్తాయి. పిల్లల చదువుల విషయంలో సత్ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో మనస్పర్థలు రావచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. వ్యాపారస్తులకు ఇబ్బందులుండవచ్చు. అ.తే. : 21, 22, 23. అన.తే. : 17, 18, 19, 20. చే.స్థో.పా. : దక్షిణామూర్తి స్థోత్రం, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, దుర్గా స్థోత్రం.

మకరం

బుధుడు, రవి మినహాయించి అన్ని గ్రహాలు అననుకూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారస్తులకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగస్తులకు పై అధికారులతో సఖ్యత, అనుకూల ప్రాంతాలకు బదిలీలుండవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలుండవచ్చు. అన్నదమ్ములతో, ఆత్మీయులతో మనస్పర్థలుండవచ్చు. వాహనాల వల్ల ఇబ్బందులు కలగొచ్చు. అ.తే. : 23. అన.తే. : 17, 18, 19, 20, 21. చే.స్థో.పా. : గణపతి స్థోత్రం, దుర్గా స్థోత్రం, హనుమాన్ చాలీసా.

కుంభం

గురు, శని, రాహు అనుకూలంగా సంచరిస్తున్నారు. అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు కలిసిరావచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పిల్లల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ పరిస్థితి కొంత నయమవుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. పనివారితో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులుండవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలుండవచ్చు. అ.తే. : 17, 18, 19, 20. అన.తే. : 21, 22, 23. చే.స్థో.పా. : గణపతి స్థోత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామ పారాయణం.

మీనం

ప్రధాన గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అయినా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు, ఆస్తుల విషయంలో పేచీలు కొంత పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వాహనాల కొనుగోలు, వ్యవసాయం వల్ల లాభాలుండవచ్చు. హోటల్, క్యాటరింగ్ వ్యాపారంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కలిసివచ్చే అవకాశం ఉంది. డబ్బులు సమయానికి అందకపోవచ్చు. అ.తే. : 18, 19, 20, 21. అన.తే. : 17, 23. చే.స్థో.పా.: ఆదిత్య హృదయం, దుర్గా స్థోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం, దక్షిణామూర్తి స్థోత్రం.
Siddhanthi

1033
Tags

More News

VIRAL NEWS

Featured Articles