వాస్తు


Sun,September 17, 2017 01:01 AM

దిక్కులు మా ఇంటికి సరిగ్గా లేవు. మేం పూజగది ఎటువైపు కట్టుకోవాలి?వి.సీత, ఎల్‌బీ నగర్

ఇంటికి దిక్కులేదు అని మీరే ఒక వాస్తవాన్ని శాస్త్ర సత్యాన్ని చెబుతున్నారు. అంటే ఏంటి గృహానికి ఒక సరైన దిక్కు దిశ ఉండాలనే కదా.. దానిలో కట్టే పూజగదికి ప్రత్యేకత ఎలా వస్తుంది. శరీరం రంగు, రూపంతో కాదు హృదయంతో రాణిస్తుంది. గెలుస్తుంది. దిశలేని ఇంటికి దశను తేలేము కదా. మీరు ఉంటున్న ఇంట్లో హాలుకు తూర్పు వైపు పూజగది ఏర్పాటు చేసుకోండి. డ్రాయింగ్ గదిలో కూడా పూజ గదిని చేసుకోవచ్చు దానిని కొంత భాగం తీసి కూడా. ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు ఆ ఇంట్లో వుండబట్టి. పైగా మీరు ఆ దిక్కుల స్థలంలో ఏ దిశకు అంటే తూర్పు ఆగ్నేయం లేదా నైరుతి ఏ రోడ్లకు ఇల్లు కట్టారో తెలియదు. అనుకూల ప్రదేశంలో పూజగది పెట్టుకోండి. లేదా మంచి ఇంటిలోకి మారండి.

దక్షిణం రోడ్డు ఎత్తు వుంది. ఉత్తరం రోడ్డు డౌను ఉంది. ఇంటి ఫ్లోరింగ్ ఎంత ఎత్తు ఎలా వుండాలి.ఆర్.బాలశౌరి, రామగిరి, నల్లగొండ

ఇలాంటి స్థలంలో రెండు రోడ్లలో ఎత్తు పల్లాలు వేరువేరుగా వున్నప్పుడు ఇంటి ఫ్లోరింగ్‌ను జాగ్రత్తగా నిర్ధారించాలి. స్థలం ఏ వీధితో కూడుకొని వున్నా, ఏ రోడ్డు ఎంత ఎత్తు వున్నా రోడ్డు కన్నా ఇంటి గర్భం లెవెల్ ఎత్తుగా వుండడం అనివార్యం. అప్పుడే ఆ గృహం శోభిస్తుంది. ఎత్తు ఎంత వున్న రోడ్డు కన్నా కనీసం ఒక ఫీటు ఎత్తు వుండేలా చూసుకొని దక్షిణం చాలా తక్కువ స్థలం తీసుకొని ఉత్తరం అనుకున్న దానికన్నా ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టాలి. ర్యాంపు ఎక్కువ వస్తుంది కాబట్టి దక్షిణం ఎత్తు వుంటే మంచిదని దక్షిణంతో సమానంగా ఇల్లు కట్టవద్దు.
Train

మా నాన్న, వారి తమ్ముడు ఒకేచోట మధ్య ఖాళీ లేకుండా ఇండ్లు కట్టుకున్నారు. మా నాన్న ఇల్లు నేను తీసుకోవచ్చా? - కె. అనిత, నల్లగొండ

నిజానికి రెండు ఇండ్ల మధ్య ఖాళీ ఉన్నప్పుడే అవి రెండూ స్వచ్ఛమైన ఎదుగుదలతో వుంటాయి. మీ నాన్న ఇల్లు ఏ ముఖంతో వుందో మీరు చెప్పలేదు. ఆ ఇల్లుకు తూర్పు ముఖద్వారం వుండి ఉత్తరం ఖాళీ వచ్చి వుంటే శుభప్రదం. లేదా ఉత్తరం హద్దుమీద వారి తమ్ముడి ఇల్లు వుంటే మాత్రం మీకు ఉత్తరం ఖాళీ ఉండదు. అటువైపు ద్వారం వస్తే అది మరింత ప్రమాదం. అంటుకొని ఇండ్లు కట్టినప్పుడు దానికి అనుకూలంగా గృహ మార్పులు చేసుకోవాలి. లేదంటే, ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎవరిది అయినా, అది ఉచితంగా వచ్చినా మనకు అనుకూలం కానిది మనం పొందకూడదు. వీలుంటే మార్చుకోవాలి. మన ఇంటి పొయ్యి అయినా కొంగు పడితే అంటకుండా వుండదు. జాగ్రత్త అవసరం.

మెట్లు ఎన్ని మలుపులు తిరుగవచ్చు?వి. దేవకి, ఆలేరు

ఇల్లు ఎత్తును బట్టి, మెట్లు వేసే విధానాన్ని బట్టి మెట్ల మలుపులు వస్తాయి. అసలు ఏ మలుపు లేకుండా కూడా ఏకెత్తు మెట్లు వేయవచ్చు. దక్షిణం, పడమరల్లో, తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసినప్పుడు ఒకే మలుపుతో పై ఇంటిలోకి వెళ్లవచ్చు. అలాకాక రెండో అంతస్తుకే డైరెక్టుగా వెళ్లేటప్పుడు అంటే ఇల్లు డూప్లెక్స్ అయినప్పుడు రెండు మలుపులు వస్తాయి. అలాగే గుండ్రని రౌండు వేసినప్పుడు మూడు మలుపులు వస్తాయి. ప్రాధాన్యత మెట్ల మలుపులకు లేదు. అది వెళ్లే దిశకు ఉంది. ఏ ముఖంగా వెళుతున్నాం. ఏ చోటకు చేరుతున్నాం. అవి ఉచ్ఛమైన దశలోనే అన్నది చూసుకోవాలి.

ఫస్ట్‌ఫ్లోర్‌లో గార్డెన్ కోసం స్టిల్ట్‌ఫ్లోర్ నుంచి ఇంటి మధ్యలో హౌజ్‌లాగా కట్టి మట్టి నింపొచ్చా?శివరామ్, మెహిదీపట్నం

ఇల్లు మధ్య భాగంలో లాన్ రావడం కోసం కేవలం గర్భస్రానం నింపితే పైన లాన్ వస్తుంది కానీ కింద ఫ్లోర్‌లో గర్భం విచ్ఛిన్నం అవుతుంది. నేల ఫ్లోర్ మధ్య భాగం అంటే నాభిస్థానం అలా నింపి చుట్టూ గదులు కట్టడం చాలా దోషం. గృహం కోసం ఆఫీసుల కోసం అలా నిర్మించవద్దు. కింద పైన ఖాళీ ఉండేలా పై మేడకు స్లాబ్ వేసి దాని మీదనే లాన్ ఏర్పాటు చేసుకోండి. అప్పుడు రెండు స్థానాలు అంటే కింద పైన వేటికి అవి సజీవంగా నిలబడి శుభఫలితాలు ఇస్తాయి.

పేరుమీద ఇండ్లు కట్టుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయా?- ఎమ్. రాజేశ్వరి, వరంగల్

పేరుకు, మనిషికి అనుబంధం వుంది. అది విడదీయరానిది. దానిలో బలముంది. అయితే, ఇవ్వాళ ఒక తండ్రి ఆస్తిగా నిలబడిన ఖరీదైన ఇల్లు అతడి కొడుక్కు వచ్చే వరకు పనికి రాదు. కారణం అతని పేరు వేరే వుంటుంది. మనిషి కన్నా ఆస్తులు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రధానంగా ఇవన్నీ శాస్త్రం దృష్టికి వచ్చాయి. అందుకని ఇల్లు కట్టినప్పుడే అది తరతరాలు అందరికీ పనికి వచ్చేలా ప్లాను అంటే ఇంటి పథకం తయారు చేయడం జరుగుతుంది. లేదంటే, తండ్రి తరువాత తరం బిక్షమెత్తాల్సి వస్తుంది.

మాకు ఉత్తరం వైపు మెట్రోరైలు వెళుతుంది. అది తప్పు అవుతుందా?కె.శ్రీకాంత్, వారాసిగూడ

పట్టణాలలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ నగరాలలో అద్భుతమైన మార్పులు జరుగుతూనే వుంటాయి. అలాంటి వాటిని ఎవరూ అడ్డుకోలేరు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంటికి ఉత్తరం వైపు ఎత్తు భవనం వస్తే ఏంటి మనం ప్రహరీ కలిగి వుంటే చాలు. ప్రహరీలు లేకుండా ఖండిల్ ఇల్లు అయితే పరిసర ప్రభావం పడుతుంది. మీరు మీ గృహానికి ఉత్తరం వైపు ప్రహరీ వుంటే భయపడకండి. లేకుంటే కొంత భాగం ఇల్లు తొలగించి ఉత్తరం ఖాళీని సృష్టించండి. ఖాళీ ఇంటి చుట్టు ఉన్నప్పుడు పరిసరాల మార్పులు ఎక్కువగా మనల్ని నష్టపరచవు.

1194
Tags

More News

VIRAL NEWS

Featured Articles