పరదాలు.. సరదాలు


Sun,November 18, 2018 01:12 AM

పిల్లగాలికి సుతారంగా కదిలే పరదాల రెపరెపల్ని.. అలా చూస్తూ కూర్చునే సౌందర్య పిపాసులున్నారు.. ఒకప్పుడు దుమ్ము, ధూళీ ఇంట్లో చేరకుండా ఈ తెరలు వేసేవారు.. ఇప్పుడు ఇంటి అందాన్ని రెట్టింపు చేయడానికి వేస్తున్నారు.. సాదాసీదా తెరలకు కాలం ఎప్పుడో చెల్లింది.. హరివిల్లు సోయగం ఉట్టిపడేలా రంగురంగుల కర్టెన్లు.. గదుల అందాన్ని మరింత పెంచుతున్నాయి.. వీటికోసమే ప్రత్యేకమైన షోరూమ్‌లు కూడా వెలిశాయండోయ్.. అయితే వీటిలో కూడా చాలా రకాలుంటాయి.. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని మీ పరదాల సరదాలు తీర్చుకోండి.

- సౌమ్య పలుస
Grommet-Curtains

గ్రోమెట్ కర్టెన్లు

Grommet-Curtains
వీటినే ఐలెట్ కర్టెన్లు అని కూడా పిలుస్తారు. చాలా వరకు ఇలాంటి కర్టెన్లే కొనుగోలు చేస్తారు. సింపుల్‌గా, క్యాజువల్ లుక్‌తో మెరిసిపోతాయి. మరి తేలికగా కాకుండా, ఉంటాయి. పైన వీటికి సిల్వర్ రింగ్స్ వస్తాయి. వీటివల్ల కిటికీ రాడ్‌లలో ఎక్కించడం సులువవుతుంది. అలాగే వీటిని మూయడం, తెరువడం కూడా తేలికే!
Sheer-Curtains

షీర్ కర్టెన్లు

Sheer curtains
ఈ రకం కర్టెన్లను చూస్తేనే అర్థమయిపోతాయి. చాలా పలుచని ఫ్యాబ్రిక్‌తో ఉంటాయి. దీనివల్ల కాంతి ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తుంది. కాస్త గమనించి చూస్తే గదిలోపల, బయట ఏం జరుగుతుందో కూడా ఈ కర్టెన్లలో నుంచి చూసేయొచ్చు. ప్రైవసీ కోరుకునే వాళ్లకు, కాంతి తక్కువ ఇంట్లోకి ప్రసరించాలనుకునే వాళ్లకు ఈ కర్టెన్లు ఎంచుకోవద్దు. కానీ లుక్ అదిరపోవాలనుకుంటే ఈ రకం కర్టెన్లు బాగుంటాయి.
Rod-Pocket-Curtains

రాడ్ పాకెట్ కర్టెన్లు

Rod Pocket Curtains
ఈ కర్టెన్లను కేస్‌మెంట్ కర్టెన్లని పిలుస్తారు. ఈ కర్టెన్లకు పైన పాకెట్లలాగా వస్తుంది. ఆ పాకెట్‌తో పాటు పైన కింద ఎక్కువ కుచ్చుల్లా కుడుతారు. కిటికీ లేదా తలుపు రాడ్ ఎక్కించడానికి ఈ పాకెట్‌లో నుంచి రాడ్ ఎక్కించేందుకు వీలుగా ఉంటుంది. ఇలా కుట్టించేవి, బయట దొరికేవి కాస్త తేలికగా ఉండాలి. ఇంటికి లుక్‌ని పెంచే లైట్ కలర్స్ అయితే మరింత బాగుంటాయి.
Tab-Top

ట్యాబ్ టాప్ కర్టెన్లు

Tab Top Curtains
వీటిని పాత రకం కర్టెన్లని చెప్పుకోవచ్చు. బటన్స్ వచ్చి చిన్న చిన్న లూప్స్‌ల్లాగా పైన కుడుతారు. బరువు ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్‌లతో ఇలా కర్టెన్లు చేయించుకోవచ్చు. కాకపోతే వీటిని కేవలం కిటికీలకు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు జరుపుకోకుండా ఉండే చోట్ల ఇలాంటి కర్టెన్లు వేసుకుంటే మంచిది. తలుపులకు ఇలాంటివి అస్సలు వద్దు.
Window-Scarf

విండో స్కార్ఫ్

Window Scarf
ఆడవాళ్లు స్కార్ఫ్‌లు వేసుకోవడం తెలుసు. అచ్చం అలాగే కిటికీల మీదకి కూడా అందంగా మెరిసిపోయేందుకు ఈ స్కార్ఫ్‌లు వచ్చేశాయి. అయితే ఇవి ఎండ వేడిమి నుంచి రక్షణ కలిగించవు. కానీ రకరకాల స్కార్ఫ్‌లను జత చేసి కిటికీ మొత్తం కవర్ చేస్తే అది సరికొత్త ఫ్యాషన్ అవుతుంది. లైట్ రంగులను ఎంచుకొని నీట్‌గా ఈ స్కార్ఫ్‌లను డ్రేప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే గది అందం మరింత బాగుంటుంది.
Pleat-Drapes

ప్లీటెడ్ డ్రేప్స్

Pleated Drapes
ప్లీటెడ్ డ్రేప్స్‌ని క్లాసికల్ ైస్టెల్ కర్టెన్లు అంటారు. ఇందులో చాలా రకాలున్నాయండోయ్. పించ్, గోబ్లెట్, పెన్సిల్ ప్లీట్, క్యాటరిడ్జ్, టుక్సెడో, బాక్స్ ప్లీట్ డ్రేప్స్ అని ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో ైస్టెల్‌తో మెరిపించొచ్చు. కొన్నింటిలో కాంటెంపరరీ స్టయిల్‌ని అనుకరించవచ్చు. ఇందులో పెన్సిల్ ప్లీట్ ఉన్న కర్టెన్లను బెడ్‌రూమ్‌ల వాటి వాటికి వేస్తే గది అందం రెట్టింపు అవుతుంది. గోబ్లెట్ లాంటివి లివింగ్ రూమ్‌లకు సరిగ్గా సరిపోతాయి. కొన్నింటికి పైన రింగులను అటాచ్ చేస్తే ఈ ప్లీట్స్ మరింత అందంగా కనిపిస్తాయి.
Pelmets-and-Valances

పెల్మెట్స్‌వాలాన్సిస్

Pelmets and Valances
డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్‌తో ఈ కర్టెన్లను తయారు చేస్తారు. విండోల కంటే లివింగ్ రూమ్‌ని, డైనింగ్ ఏరియాని వేరు చేయడానికి ఎక్కువగా ఈ ైస్టెల్ కర్టెన్లను వాడుతారు. కావాలనుకుంటే కిటికీలకు కూడా ఇలాంటి కర్టెన్లు వాడుకోవచ్చు. బెడ్‌రూమ్‌ల వంటి వాటికి కూడా ఇవి బాగా సూటవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన వాటిని వెనుక కర్టెన్లుగా వేసి పైన వైపు ప్లెయిన్‌గా వేసి కుచ్చులు ఎక్కువ వచ్చేలా వీటిని డిజైన్ చేస్తారు. ఇలాంటివి రెస్టారెంట్లలో కూడా ఎక్కువగా వేస్తుంటారు.
cafe-curtains

కేఫ్ కర్టెన్స్

Cafe Curtains
కిటికీని సగం వరకు మాత్రమే కవర్ చేసే కర్టెన్లను ఇలా పిలుస్తారు. కొన్నిసార్లు కిందవరకు వేసి మధ్యలో గ్యాప్ ఉంచి పైన ఒక కర్టెన్ పరుస్తారు. కింద వైపు రెండు కర్టెన్లు వస్తాయి. అటు వెలుతురూ ఇంట్లోకి వస్తుంది. ఇటు మీ ప్రైవసీకి భంగం కలుగకుండా ఉండేలా ఈ కర్టెన్లను వాడుకోవచ్చు. ఇలాంటివి ఎక్కువ కిచెన్, బాత్‌రూమ్‌ల్లో వేస్తుంటారు. ఇందులో రకరకాల కలర్స్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. తక్కువ వెయిట్ ఉండే ఇవి గదులకు మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి.

331
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles