విషవలయం


Sun,September 16, 2018 03:43 AM

Crime
అతను యూనివర్సిటీకి ఫోన్ చేసి ఆ రోజు మోడ్రన్ హిస్టరీలో తను తీసుకోవాల్సిన క్లాస్‌ని అనారోగ్య కారణంగా రద్దు చేసాడు. రెండు బీర్లకే తనకి అంత హేంగోవర్ ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు. మాంటీస్ సిగరెట్ తాగుతూ, పీకలని కిటికీలోంచి బయటకి విసిరేస్తూ గడిపాడు. మధ్యమధ్యలో చేతి గడియారం వంక, బేంక్ గుమ్మం వంక అసహనంగా చూడసాగాడు. పది నిమిషాలు గడిచాయి. చివరికి జాన్ బయటకి వస్తూ కనిపించాడు.
మల్లాది వెంకట కృష్ణమూర్తి


23-9-18 ప్రొఫెసర్ జాన్ ఉదయం కాఫీ కప్పుని నోటి దగ్గరకి తీసుకెళ్తూండగా అపార్ట్‌మెంట్ తలుపు మీద ఎవరో దబ దబ బాదిన శబ్దం వినిపించింది. ఎవరో తెలుసు కాబట్టి ఆయన వెంటనే లేవలేదు. అది తన పేరు మాంటీగా చెప్పుకున్న ఓ వ్యక్తి. అతనికేం కావాలో కూడా జాన్‌కి తెలుసు. ఎనిమిది వేల డాలర్లు.
- ప్రొఫెసర్ జాన్‌కి గత రాత్రి నిద్ర పట్టకపోవడానికి కూడా అదే కారణం. ఆయన దగ్గర అంత డబ్బు లేదు. దాన్ని ఎలా సంపాదించాలో కూడా ఆయనకి తెలీదు. మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది.
ప్రొఫెసర్ జాన్ కప్పుని బల్లమీద ఉంచి తలుపు దగ్గరకి వెళ్ళి గడియ తీసాడు. తన పేరు మాంటీగా చెప్పుకున్న వ్యక్తి లోపలకి వచ్చి తలుపు మూసాడు. అతని ఎత్తు, బరువు కూడా జాన్ ఎత్తు, బరువే. ఐతే అతని మొహం, కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి. మాంటీ ఓసారి ఆ గదిని చురుగ్గా పరిశీలించాక అడిగాడు.
డబ్బివ్వు, నా దగ్గర లేదు. అది ఇంతకు మునుపే చెప్పాను. లేకపోతే ఎక్కడ నించైనా తెమ్మని కూడా నేను చెప్పాను మాంటీ గొంతు పెంచి చెప్పాడు.
అతను ఛాతీ మీద బలంగా నెట్టడంతో ఆయన వెనక్కి తూలి కుర్చీలో కూలబడ్డాడు. జాన్లో కోపం చెలరేగడంతో చెప్పాడు.
చెప్పేది విను.

నేను చెప్పేది నువ్వు విను. నువ్వు నాకు సరిగ్గా ఎనిమిది వేల డాలర్లు బాకీ పడ్డావు. గురువారం రాత్రి పోకర్ ఆటలో దాన్ని నువ్వు ఓడిపోయావు. నిన్న ఉదయం నీకు ఆ విషయం చెప్పి, నువ్వు బాకీ పడ్డ నీ సంతకం గల రసీదుని చూపించాను. నిన్న రాత్రి ఆ డబ్బివ్వమన్నాను. ఇవ్వలేదు. నాకు ఇప్పుడు కావాలి.
- ప్రొఫెసర్ జానికి గురువారం రాత్రి జరిగింది లీలగా మాత్రమే గుర్తుంది. ఆ ఉదయం అతని భార్య కొడుకు డేనీని తీసుకుని తమ అమ్మమ్మని చూడటానికి ఊరెళ్ళింది. వాళ్ళని బస్ ఎక్కించాక ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్ళబుద్ది కాక మాంటీస్ రేసినో అని పిలువబడే బార్‌కి బీర్ తాగడానికి వెళ్ళాడు. ఓ అపరిచితుడు తనతో మాటలు కలిపితే, తన భార్య కొడుకు ఊరెళ్ళడం గురించి చెప్పాడు. అతను జాన్‌కి తన డబ్బుతో ఓ బీర్ ఆర్డర్ చేసాడు.
ఆ తర్వాత అతని జ్ఞాపకాలన్నీ అల్లుకుపోయినట్లుగా ఉన్నాయి. పేకముక్కలు, ఏదో కాగితం మీద సంతకం చేయడం గుర్తున్నాయి. తను అది బార్ బిల్ అనుకున్నాడు. తనని ఎవరో కుర్చీలోంచి బలవంతంగా లేపడం వరకే గుర్తుంది.
శుక్రవారం ఉదయం తన ఇంట్లో నిద్ర లేచాక రాత్రి ఇంటికి ఎలా చేరాడో జాన్‌కి గుర్తులేదు. విపరీతమైన తల నొప్పి, చెవుల్లో హోరు, గొంతు ఎండుకుపోయి జిగటగా అనిపించిన నోరు.
అతను యూనివర్సిటీకి ఫోన్ చేసి ఆ రోజు మోడ్రన్ హిస్టరీలో తను తీసుకోవాల్సిన క్లాస్‌ని అనారోగ్య కారణంగా రద్దు చేసాడు. రెండు బీర్లకే తనకి అంత హేంగోవర్ ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు. కొద్దిసేపటికి మాంటీస్ అనే వ్యక్తి వచ్చి, తను సంతకం చేసిన కాగితం చూపించి, రాత్రికల్లా ఎనిమిది వేల డాలర్లు ఇవ్వమని కోరాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు.
నువ్వు నా బీర్లో ఏదో మందు కలిపావు జాన్ పెగుల్చుకుని చెప్పాడు. అది నాకు తెలీదు. నువ్వు పేకాటలో ఓడిపోతూ నా దగ్గర అప్పు తీసుకుంటూనే ఉన్నావు. నా అప్పు వెంటనే చెల్లించు.
వెంటనే జాన్‌కి ఆ మోసం అర్థమైంది. కేసినోలోకి ఒంటరిగా వచ్చిన వ్యక్తితో వారి మనిషి మాటలు కలిపి పేకాట మీద మోజు లేకపోతే తాగే బీర్లో ఏదో మందు కలిపి, పేకాట గదిలోకి తీసుకెళ్ళి, తనేం చేస్తున్నాడో తెలీని పరిస్థితిలో పెద్ద మొత్తానికి ప్రోనోట్ మీద సంతకం చేయిస్తారు. తర్వాత డబ్బు అడుగుతారు.

నేను మీకు ఏదీ బాకీ లేను. మీది మోసం జాన్ గట్టిగా చెప్పాడు.
వెంటనే మాంటీస్ కుడి పిడికిలి జాన్ నోటి మీద బలంగా తాకింది. ఆ ఆకస్మిక పరిణామానికి నివ్వెర పోయిన జాన్ నమ్మలేనట్లుగా చేత్తో తుడుచుకుంటే రక్తం అంటింది. అతని జీవితంలో అంతదాకా ఎవరూ అతణ్ని కొట్టలేదు. కొట్టడం అనాగరికమని అతని నమ్మకం. జాన్లో కోపం మంటలా చెలరేగింది. అతను కుర్చీలోంచి సగం లేవగానే మాంటీస్ చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.
కూర్చో, డబ్బివ్వు. సమయాన్ని వృధా చేయడు. నీకు గ్రేస్ అనే భార్య, డేనీ అనే కొడుకు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో లేరు. ఇంటికి తిరిగి వచ్చేప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగడం ఇష్టమా?

జాన్ తన చెవులని తనే నమ్మలేకపోయాడు. ఆధునిక సమాజంలో ఇంతటి దౌర్జన్యం ఉంటుందా? డబ్బు సంపాదనలో నైతికత లేని ఈ వ్యక్తి ఏమైనా చేయగలడు అనిపించింది. మాంటీస్ మీద గల కోపం తీవ్ర అసహ్యంగా మారింది. ఇలాంటి దుర్మార్గులని సమాజంలో ఉండనివ్వకూడదు. ఏదో విధంగా అణిచేయాలి.
కానీ, తనేం చేయగలడు? పోలీసులకి ఫిర్యాదు చేస్తే? ఋజువు కోరతారు. గ్రేస్, డేనీలని పోలీసులు శాశ్వతంగా కాపాడలేరు. అకస్మాత్తుగా అతనికి అలసట కలిగింది. తన చేతులని అతను అదృశ్య తాళ్ళతో కట్టేసాడని అనిపించింది. ఈ దుర్మార్గుడి బారిన పడ్డ ఎందరో ఇలాంటి సందర్భాల్లో తమ వారిని రక్షించుకోవడానికి ఎంత డబ్బు చెల్లించారో అనుకున్నాడు. నెమ్మదిగా లేస్తూ చెప్పాడు.
నేను డ్రెస్ చేసుకుని బేంక్‌కి వెళ్ళి అక్కడ నాకు అప్పు దొరుకుతుందేమో కనుక్కోవాలి.
సరే. మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. బేంక్‌లోంచి పోలీసులకి ఫోన్ చేస్తే తాగి, పేకాడి పడిపోయిన ఓ కాలేజ్ ప్రొఫెసర్‌ని ఇంటికి మోసుకు వెళ్ళారని పేపర్లో వార్త వస్తుంది. అది నీ ఉద్యోగానికే ప్రమాదం అని గుర్తుంచుకో.

జాన్ బట్టల అలమర తెరచి కుడి వైపున్న మూడు ఇన్సూరెన్స్ పాలసీలని తీసి వాటిమీద ఎంత అప్పు రావచ్చో లెక్క కట్టాడు. ఐదు వేల డాలర్లు. మాంటీస్ ఐదు వేలతో తృప్తి పడచ్చు. తనకి వచ్చే తక్కువ జీతంతో ఎక్కువ ఆదా చేయలేకపోయాడు. ఈ రక్తం తాగే జలగలతో ఎలా పోరాడటం? చెడుని చెడుతోనే ఎదుర్కోవాలి. అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ ఆలోచించాడు. అతనికి అద్దంలోంచి డేనీ గదిలోని ఒకటి, రెండు ఆట వస్తువులు కనిపించాయి. వాటిని జేబులో ఉంచుకుని చెప్పాడు.
పద. నేను కార్ డ్రైవ్ చేయలేను. నీ కార్లో వెళ్దాం. ప్రొఫెసర్ జాన్ బ్రీఫ్ కేస్‌ని అందుకున్నాడు.
* * *
మాంటీస్ కారు సిటీ ట్రస్ట్ అండ్ సేవింగ్స్ బేంక్ ముందు కస్టమర్లకి మాత్రమే కేటాయించిన పార్కింగ్ లాట్లో ఆగింది. కారు దిగి వెళ్ళే ప్రొఫెసర్తో మాంటీస్ హెచ్చరికగా చెప్పాడు.
మూర్ఖపు పనేమీ చేయకు. చేస్తే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో పడతావని గుర్తుంచుకో. అలాగే చెప్పి జాన్ బేంక్లోకి నడిచాడు.
మాంటీస్ సిగరెట్ తాగుతూ, పీకలని కిటికీలోంచి బయటకి విసిరేస్తూ గడిపాడు. మధ్యమధ్యలో చేతి గడియారం వంక, బేంక్ గుమ్మం వంక అసహనంగా చూడసాగాడు. పది నిమిషాలు గడిచాయి. చివరికి జాన్ బయటకి వస్తూ కనిపించాడు.
నా రసీదు ఇవ్వు బ్రీఫ్ కేస్ తెరచి డబ్బు చూపించి అడిగాడు.

మాంటీ ఆ రసీదుని కిటికీ లోంచి బయట పడేసి, బ్రీఫ్ కేస్‌ని లాక్కుని కారుని స్టార్ట్ చేసాడు. అకస్మాత్తుగా బేంక్‌లోంచి అలారం మోగిన శబ్దం వినిపించింది. అదే సమయంలో బేంక్ గార్డ్ చేతిలో రివాల్వర్తో బయటకి వచ్చాడు. జాన్ బయల్దేరిన ఆ కారుని గార్డ్‌కి చూపించాడు. గార్జ్ తక్షణం దాని వైపు రివాల్వర్తో కాల్చాడు.
బర్గర్ అలారం సమీపంలోని పోలీస్ స్టేషన్లో కూడా మోగడంతో రెండు పెట్రోల్ కార్లు బేంక్ చెరో వైపు నించి బయలుదేరాయి. మాంటీస్‌కి తన కారుకి అడ్డంగా ఆగిన పోలీస్ కారు కనిపించింది. కారు దిగి బ్రీఫ్ కేస్తో పారిపోయే అతణ్ని ఓ పోలీస్ ఆఫీసర్ ఆగమని అరిచాడు. ఆగకపోవడంతో కాల్చాడు.
గుండు భుజాల మధ్య నించి లోపలకి దిగగానే మాంటీస్ ఎగిరి కింద పడ్డాడు. పేవ్‌మెంట్ రాయి అతని తలకి బలంగా తాకింది. తెరచుకున్న బ్రీఫ్ కేస్ లోంచి నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటితో పాటు పిల్లలు ఆడుకునే ఓ కౌబాయ్ రివాల్వర్, రెడ్ డెవిల్ మారక్స్ కూడా అందులోంచి రోడ్ మీదకి పడ్డాయి. ప్రొఫెసర్ జాన్ తన జేబులోని అలాంటి మరో ఇతని తడుముకుంటూ ఇంటి దారి పట్టాడు.
(రిచర్డ్ ఓ లెవిస్ కథకి స్వేచ్ఛానువాదం)

658
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles