బతుకమ్మ సద్దులు


Sun,September 17, 2017 01:19 AM

పదకొండు రకాల పూలతో.. పసుపు గౌరమ్మతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. ఆ తల్లికి తొమ్మిది రకాల సద్దులతో నైవేద్యం సమర్పిస్తారు. పులిహోర, తియ్యటి పొడులు, పెరుగున్నంతో ఇసుకల పుట్టిన గౌరమ్మ.. ఇసుకల పెరిగిన గౌరమ్మ.. పసుపున వసంతమాడే గౌరమ్మ.. అంటూ ఆ తల్లిని మళ్లీ ఏటి వరకు చల్లాగా చూడమని సాగనంపుతారు. ఆ బతుకమ్మకు సమర్పించే సద్దుల్లో ఓ ఐదు రకాలను ఇస్తున్నాం.కొబ్బరి లడ్డు


kobbari-laddu

కావాల్సినవి:కొబ్బరి పొడి : పావుకిలో, చక్కెర : పావుకిలో, యాలకుల పొడి : ఒక టీ స్పూన్, జీడిపప్పులు : 10, నెయ్యి : 100గ్రా.

తయారీ:కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చక్కెరలో అరకప్పు నీళు ్లపోసి సన్నని మంట మీద కాగనివ్వాలి. తీగలాంటి పాకం వచ్చేవరకు వేడిచేసి దించేయాలి. అందులో యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసి ముద్దలు కాకుండా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొబ్బరి మిశ్రమాన్ని చిన్నచిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. వాటిపై జీడిపప్పులతో అందంగా గార్నిష్ చేయాలి. తియ్యటి కొబ్బరి లడ్డూ తయార్! పచ్చి, ఎండు కొబ్బరి పొడి దేనితోనైనా తయారుచేసుకోవచ్చు.

మలీదా లడ్డు


malida

కావలసినవి:గోధుమపిండి : పావు కిలో, నెయ్యి : 100 గ్రా., బెల్లం : పావు కిలో, యాలకుల పొడి : అర టీ స్పూన్

తయారీ:బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని యాలకుల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. గోధుమపిండిని కొన్ని నీళ్లు పోసి మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి. పెనం పెట్టి నెయ్యి వేసుకొని రెండు వైపులా బాగా కాల్చాలి. ఇలా పిండి మొత్తం రొట్టెలు చేసుకోవాలి. ఇవి చలారక ముందే బెల్లంతో కలిపి రోట్లో వేసి దంచుకోవాలి. అలా అయిన మిశ్రమాన్ని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడూల్లా చేయాలి. మలీదా లడ్డూ మహా నైవేద్యంగా మీ ముందుంటుంది.

నువ్వుల పొడి


nuvvula-podi

కావలసినవి: నువ్వులు : పావుకిలో, బెల్లం : పావుకిలో

తయారీ: ముందుగా నువ్వులు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టాలి. తర్వాత బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. నువ్వుల పొడిలో బెల్లం పొడి వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. నైవేద్యానికి నువ్వుల పొడి తయారైనట్లే! బెల్లం ఇష్టం లేనివాళ్ళు చక్కెరను పొడి కొట్టుకొని కలుపుకోవచ్చు.

సత్తు పిండి లడ్డు


satthu-pindi

కావాల్సినవి:మొక్కజొన్న గింజలు : ఒక కప్పు, బెల్లం : అర కప్పు, పాలు : అర కప్పు, నెయ్యి : ఒక టీ స్పూన్, యాలకులు : 2

తయారీ:మొక్కజొన్న గింజలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు సన్నని మంటపై వేయించాలి. తర్వాత ఈ గింజలను కాసేపు చల్లరనివ్వాలి. యాలకులతో కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. పాలను మరిగించేటప్పుడు బెల్లాన్ని వేయాలి. బాగా చిక్కగా అయ్యేంతవరకు అలాగే వేడి చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న పిండిలో నెయ్యితో పాటు కలిపి చిన్న, చిన్న ఉండలుగా చేసుకోవాలి.

1214
Tags

More News

VIRAL NEWS

Featured Articles