నెట్టిల్లు


Sun,April 22, 2018 12:19 AM

లవ్యూ శ్రావణి

Total views192, 898+(ఏప్రిల్ 14 నాటికి)Published On : 09 April 2018
నటీనటులు : నిధీన్, ప్రియా, ప్రసాద్, బేబీ బిందు
దర్శకత్వం: హరీ
ఒక జీవితం పదిమంది జీవితాలకు వెలుగునివ్వాలి. దేవుడు అందరినీ ఒకేలా పుట్టిస్తాడు. ఒకేలా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో మనం బతికిందే మన జీవితం అనే కాన్సెప్టుతో ఆలోచిస్తుంటుంది శ్రావణి. ఎప్పుడు బోర్ కొట్టినా లగేజీ సర్దుకొని హైదరాబాద్‌లోని ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కొన్నిరోజులు సరదాగా గడిపి తిరిగి వెళ్లిపోతాడు. ఇలాంటి పరిస్థిత్లులో ఆ అబ్బాయి ఒకమ్మాయిని చూస్తాడు. చూడగానే ఇష్టపడుతాడు. ఒకరోజు ఎలాగైనా తన ప్రేమను ఆమెకు చెప్పాలని బయల్దేరుతాడు. కొద్దిసేపు తర్జనభర్జన తర్వాత తన మనసులోని మాట శ్రావణికి చెప్పేస్తాడు. అప్పుడు శ్రావణి ఎలా స్పందించింది? ఆ అబ్బాయికి ఏం చెప్పింది? అతడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
love-you-sravani

లైలా మజ్ను

Total views 21,514+(ఏప్రిల్ 14 నాటికి)Posted on : 10 April 2018
నటీనటులు : గణేష్ రెడ్డి, మౌనిక, గౌతమ్ యాదవ్, అవినాష్ కల్లూరి
దర్శకత్వం: నవీన్ మిన్నీ
వినయ్ ఓ ఫొటోగ్రాఫర్. తన కెమెరా, బుల్లెట్ బైక్. అవే.. తన ప్రపంచం. వైజాగ్‌లోని జగదాంబ సెంటర్‌లో ఉండే వినయ్. అక్కడి ప్రతీ మూమెంట్‌ను ఫొటో తీస్తుంటాడు. అలా తను ఫొటోగ్రఫీ చేస్తుండగా ఒకబ్బాయి, ఒకమ్మాయిని ఫాలో అవుతుండడం గమనిస్తాడు. వారిద్దరినీ ప్రతిరోజూ ఫాలో అయి ఫొటోలు తీస్తాడు. ఆ అబ్బాయి అమ్మాయిని చాలా ఇష్టపడుతాడు. కానీ డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడడానికి, తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయడు. ఈ తతంగమంతా వినయ్ ఫొటోగ్రఫీలో బంధిస్తుంటాడు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో వినయ్ తన బైక్ మీద రూమ్‌కి వస్తుండగా మార్గమధ్యలో యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే తన కెమెరా బ్యాగ్ పోగొట్టుకుంటాడు. ఆ బ్యాగ్ ఒకమ్మాయికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది యూట్యూబ్‌లో చూడండి.
Laila-majnu

లవ్ హేట్ లవ్

Total views14,350+(ఏప్రిల్ 14 నాటికి)Posted on : 09 April 2018
నటీనటులు : సాయి నిఖిల్, లవ్లీ మధు, సుజిత్ సంతోష్, లక్ష్మణ్ రెడ్డి, వెంకీ, దిలీప్ శివకుమార్, దివ్య, ఇంద్ర, నగ్మా
దర్శకత్వం : సోమరాజు
అమ్మ తిట్టినా, నాన్న కొట్టినా ఏడవని అబ్బాయిలు.. అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోతే మాత్రం ఓ.. ఏడ్చేస్తారు. మందు బాటిల్స్ ఖాళీ చేసేస్తారు. ఈ కథలో అబ్బాయి కూడా అలాంటి టైపే. మధు అనే అమ్మాయిని చూసీ, చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమె మనసులో స్థానం సంపాదించడం కోసం నానా యాతన పడుతుంటాడు. ఎలాగోలా ధైర్యం చేసి ఒకరోజు తన మనసులో మాట ఆ అమ్మాయికి చెప్పేస్తాడు. ఆమె మాత్రం ఆ అబ్బాయికి ఎలాంటి రిైప్లె ఇవ్వదు. రెండుమూడు రోజుల తర్వాత మధు ఆ అబ్బాయికి కొన్ని కండీషన్స్ పెడుతుంది. ఆ రూల్స్ అన్నింటికీ ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. ఇంత ప్రేమించుకున్న వారిద్దరు ఎందుకు విడిపోయారన్నది కథ.
love-hate-love

సిగరెట్

Total views 7,548+(ఏప్రిల్ 14 నాటికి)Posted On : 06 April 2018
నటీనటులు : సంఘీర్, రోహిత్, రోహిణి ఆరెట్టి, ఈ. అచ్చయ్య గౌడ్, శివ లాస్య
దర్శకత్వం: జయేంద్ర కొడువటి
ఒక ఇంట్లో తండ్రి ప్రతిరోజూ తన కొడుకును పాన్‌షాప్‌కి పంపించి సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకుంటాడు. ఆ కుర్రాడు చదువుకుంటుంటే.. తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటాడు. స్కూల్‌కెళ్లిన తర్వాత వాళ్ల టీచర్ కూడా క్లాస్ అయిపోగానే.. గ్రౌండ్‌లోకెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇదంతా ప్రతిరోజూ గమనిస్తున్న ఆ కుర్రాడు ఒకరోజు తండ్రి జేబులోంచి సిగరెట్ తీసుకొని చాటుగా కాలుస్తుంటాడు. ఒకరోజు వాళ్ల టీచర్ చూసి ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేస్తాడు. ఆయన ఆ కుర్రాడి తండ్రిని పిలిపించి మందలిస్తాడు. అసలు వాడికి సిగరెట్ అలవాటు ఎందుకయిందో తెలుసుకొని ఆ తండ్రి సిగరెట్ మానేస్తాడు. మంచి సందేశమున్న ఈ షార్ట్‌ఫిలిం ఇది.
cigarate

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles