షార్ట్ ఫిల్మ్స్ రివ్యూస్

Sun,March 19, 2017 01:34 AM

ఈ ప్రపంచాన్ని నడిపించేవి మూడే. ఒకటి అమ్మ, ప్రేమ, మానవత్వం. ఈ అంశాలతో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. సినిమాలే కాదు.. నవలలు, పుస్తకాలు కూడా మనసుకు హత్తుకుంటాయి. ఈ వారం విడుదలైన షార్ట్‌ఫిలింస్ అన్నీ వీటి కోణంలోనే ఉన్నాయి. వాటిలోంచి కొన్ని మీకోసం..

aaame

ఆమె


Total views
25,276+
(మార్చి 10 నాటికి)


Published on Mar 7, 2017
నటీనటులు : నవ్య కనకాల, జాను మిన్ని, దివ్య నర్ని, చైతు సోఫి, పవన్ రెడ్డి,
పరశురామ్, శ్రీనివాస్, మిషల్ జైన్
దర్శకత్వం : వెజ్జు సత్యనారాయణ
ఆడపిల్ల అనే అందమైన వెలుగును దూరం చేస్కుంటూ బతుకుతున్న వాళ్లు ఈ షార్ట్‌ఫిలింతో అయినా మారాలని ఆశిస్తూ.. ఆడపిల్లలందరికీ ఈ షార్ట్‌ఫిలిం అంకితం అంటూ డైరెక్టర్ వెజ్జు సత్యనారాయణ చెప్పిన ైస్టెల్ ఆద్యంతం ఆకట్టుకుంది. కాలేజీకి బయల్దేరిన అమ్మాయి, పెళ్లిచూపుల్లో పెళ్లివారి ముందు కూర్చున్న అమ్మాయి, అర్ధరాత్రి బయల్దేరిన అమ్మాయి.. మూడు వెర్షన్లలో దర్శకుడు ఆడపిల్ల గురించి చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. చర్మాన్ని చూసి ధర్మాన్ని తప్పుతున్న ఈ తరం మగవారికి దర్శకుడు చెంపపెట్టులాంటి చురకలంటిస్తూ.. బుద్ధిచెప్పిన తీరు బాగుంది. నటీనటులు కూడా అందరూ పోటీ పడి మరీ నటించారు.


makaram

మకురం


Total views
12,625+
(మార్చి 10 నాటికి)


Published on Mar 8, 2017
నటీనటులు : స్నగ్య యదువంశీ, సృజన్ కొత్తపల్లి, అవంతి దీపక్, గార్గేయ్ యెల్లాప్రగడ,
మాధవ్ హోలగుండి, అఫ్ఫాన్
దర్శకత్వం: శ్రీక్రిష్ణ చైతన్య
అమ్మతనానికి, ఆడతనానికి జరిగిన సంఘర్షణే ఈ షార్ట్‌ఫిలిం. ఒక స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు అందానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాముఖ్యం దేని మీదకు మళ్లుతుంది అనే విషయాన్ని దర్శకుడు శ్రీక్రిష్ణ చైతన్య చాలా చక్కగా చూపించాడు. పళ్లై పిల్లలు పుట్టగానే కుటుంబం, పిల్లలు వారి ఆలనాపాలనా చూసుకునే మహిళ ఆలోచన అందం మీదకు మళ్లితే ఏమవుతుంది? అదే సందర్భంలో ఆమెలోని అమ్మతనం ఎదురు తిరిగితే ఆ మహిళ దేన్ని గెలిపిస్తుంది? అనే రెండు కోణాల మధ్య జరిగే సంఘర్షణే మకురం. స్నగ్య యదువంశి మంచి నటనా చాతుర్యాన్ని కనబర్చింది. స్త్రీలోని రెండు విభిన్న కోణాలను స్పృశించిన శ్రీక్రిష్ణ సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే! కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, తేలికపాటి డైలాగులు అన్నీ కుదిరాయి.


ninnu-kalavalani

నిన్ను కలవాలని..


Total views
26,216+
(మార్చి 10 నాటికి)


Published on Mar 3, 2017
నటీనటులు : హరీష్ కుమార్, ఆషా ఏంజిల్, భూపతి వర్మ
దర్శకత్వం: ఆదిత్య శహెంషాహ్
కళ్యాణ్‌కి ఫేస్‌బుక్ ఛాటింగ్‌లో సింధు పరిచయం అవుతుంది. ఇద్దరూ కలుద్దామనుకుంటారు. మరుసటి రోజు కళ్యాణ్ బయల్దేరుతాడు. ఓ ఫ్రెండ్ కాల్ చేసి ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయిందిరా.. బ్లడ్ కావాలి. అర్జంటుగా అపోలోకి రా రా అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మిస్ చేసుకోవద్దని హాస్పిటల్‌కి వెళ్లకుండా కాఫీషాప్‌కి వెళ్తాడు. ఎలాగైనా సింధుకు లవ్ ప్రపోజ్ చేద్దామనుకుంటాడు కళ్యాణ్. మరి కళ్యాణ్‌కి సింధుకు ప్రపోజ్ చేస్తాడా? యాక్సిడెంట్ అయిన ఫ్రెండ్ పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చూడాల్సిందే. అమ్మాయిని కలవాలనుకుంటే ఎప్పుడైనా కలవొచ్చు. కానీ ఆపదలో ఉన్నామని ఎవరైనా మనల్ని సాయమడిగితే వెంటనే చేయాలి. ఇంకోసారి చేయడానికి అవకాశం రాకపోవచ్చు అనే లైన్ తీసుకుని దర్శకుడు ఆదిత్య చెప్పిన ైస్టెల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.


thamasi

తామసి


Total views
52,164+
(మార్చి 10 నాటికి)


Published on Mar 3, 2017
నటీనటులు :దీపు జాను, చంద్రకళ, సుమంత్ వీరెళ్ల, ప్రసాద్, ఆరిఫ్ భాషా, హుష్‌కాకి అప్పారావు, సాయిరాం, అరుణ్, సంపత్ పరిటాల
దర్శకత్వం: బాలరాజు. ఎం
సాయి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. ఊర్లో ఉండే లక్ష్మీ అంటే సాయికి చాలా ఇష్టం. ప్రతి దీపావళికి ఆ అమ్మాయిని చూడడానికి ఊరొస్తాడు. నేను ప్రేమిస్తున్నాను.. నీక్కూడా ఇష్టమని నాకు తెలుసు. సాయంత్రం పశువుల పాక దగ్గర నీకోసం ఎదురుచూస్తుంటా అని కాగితం మీద రాసి ముగ్గేస్తున్న లక్ష్మీ మీదకి విసురుతాడు. లక్ష్మీని సాయి ప్రేమిస్తున్నాడని సాయి వాళ్ల అన్నకు తెలుస్తుంది. రాజకీయాలు, కుల పట్టింపుల మధ్య సాయి, లక్ష్మీ ఇద్దరూ కలుస్తారా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? సాయి, లక్ష్మీల ప్రేమ గెలుస్తుందా? చివర్లో జరిగిన సీన్ కథనే మలుపు తిప్పింది.
ఆ సీనేంటి? తామసి చూడండి.
సమీక్ష : ప్రవీణ్‌కుమార్ సుంకరి

1603
Tags

More News

మరిన్ని వార్తలు...