శబరిమల అయ్యప్పస్వామి


Sun,December 2, 2018 02:19 AM

temple
మాలధారణం.. నియమాల తోరణం.. అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామిని కొలిచే దీక్షలు ప్రారంభమయ్యా యి. కఠిన నియమ, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేసి తమను తాము శాంతమూర్తులుగా, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకునే గొప్ప అవకాశం మాలధారణ వల్ల కలుగుతుంది. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం.. నల్లని బట్టలు ధరించి, అన్ని రకాల అలవాట్లను వదిలేసి పరిశుద్ధమైన మనసుతో హరిహరసుతున్ని పూజిస్తే మంచి జరుగు తుందని మాలధారులు నమ్ముతారు.

- అన్వేషిక

ఎక్కడ ఉంది?: కేరళ రాష్ట్రంలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఉంది.

ఎలా వెళ్లాలి?: రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి వాహనాల ద్వారా పంప చేరుకోవచ్చు. కొచ్చి, తిరువనంతపురంలో విమానాశ్రయాలున్నాయి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. పంపా నుంచి కాలినడకన ముందుకెళ్లి స్వా మిని దర్శించుకోవాలి.

దేవాలయ విశిష్టత: శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు,18 కొండల మధ్య ఈ గుడి కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరులో ప్రారంభమై జనవరిలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ర్టాల నుంచే కాక ఇతర రాష్ర్టాల నుంచీ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు.

మాలధారణ : శబరిమలై వెళ్లడం కోసం కార్తీకం ముందునుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి నల్లని బట్టలు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ నియమాలను పాటించాలి. అలాగే దీక్షా సమయంలో అందరిని స్వామిగా భావించాలి. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తి చేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లాలి.
శబరియాత్ర: ఇరుముడిని తలపై పెట్టుకొని శబరియాత్ర చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి నుంచి అసలు యాత్ర ప్రారంభమవుతుంది.

హైందవ ధర్మానుసారం దీక్షచేసిన భక్తులు తొలుత ఇక్కడి వావర్ మసీదును దర్శించుకొని పేటతుళ్లి ఆడుతారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు. ఇక పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! అక్క డి నుంచి పెరుర్తోడు, కాలైకట్టి, అళుదా నదీ, అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు నుంచి కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియనపట్టం మీదుగా పంపకు చేరతారు.

నెయ్యాభిషేకం: చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి శరణుఘోషతో సాగుతుంది. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజూ ఉద యం నుంచి మధ్యాహ్నం వరకూ స్వామికి నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘట్టానికి చేరుతుంది. మకరజ్యోతి దర్శనం, తిరువాభరణాల ఊరేగింపు అనంతరం భక్తులు తిరుగు పయనమవుతారు.

పంపానదిలో మునిగి

పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరువాత దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కా లి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరుతారు. ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు కొబ్బరికాయలు కొడుతారు. మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles