వీధి వైద్యం.. స్నేహ హస్తం


Sun,April 21, 2019 02:56 AM

మనకు జబ్బు చేస్తే వెంటనే ఆస్పత్రికి పరిగెడతాం. అనారోగ్యంతో బాగా అస్వస్థత చెందితే ఆస్పత్రిలో చేరుతాం. బంధువులు వచ్చి చూస్తారు. మనల్ని ప్రేమించే వారు వచ్చి పలుకరిస్తారు.. ఇలా సగం రోగం మన చుట్టూ ఉన్నవారిని చూస్తేనే పోతుంది. అందరూ ఉండి చూడడానికి రాకపోతేనే మనం బాధపడుతుంటాం.. మరి ఎవరూ లేని వారి పరిస్థితి ఏంటి? మంచి చెడులు అడిగే బంధువులు కూడా లేని వారు విశ్వనగరంలో అనేకం. అలాంటి వారికీ మేమున్నామంటున్నారు స్ట్రీట్ మెడిసిన్ సభ్యులు..

ప్రస్తుతం ఎక్కడికెళ్లినా గుర్తింపు కార్డు అడుగుతున్నారు. ప్రస్తుత చిరునామా అడుగుతున్నారు. మరి అవేమీ లేనివారికి జబ్బు చేస్తే వారి పరిస్థితి ఏంటి? పుట్‌పాత్‌పై నిద్రించే వారు అనారోగ్యం బారిన పడితే వారి పరిస్థితేంటి? కనీసం బట్టలు కూడా బాలేని వారిని ఏ ఆసుపత్రిలో బాగా చూస్తారు. ఇలాంటి వారికి అండగా నిలబడతాం అంటున్నారు అమన్ వేదిక సభ్యులు..
BIG_Accident

అండగా నిలబడి..

ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఒకరి గురించి మరొకరు పట్టించుకోవడమే కష్టం. ఎవరి బిజీ వారిది. అలాంటిది రోడ్డు పక్కన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే.. ఆ వ్యక్తికి నా అనే వాళ్లు ఎవరూ లేకపోతే వారి పరిస్థితి ఏంటి? ఇలా సిటీలో అనాథలకు, పుట్‌పాత్‌పై బతుకీడ్చే వారికి, ఇల్లు లేని వారికి జబ్బుచేస్తే, అనారోగ్యం వేధిస్తే మేమున్నాం అంటున్నారు స్ట్రీట్ మెడిసిన్ సభ్యులు..

ఎవరు చేస్తున్నారు?

ఒంటరిగా బతుకుతున్న వారికి, అనాథలకు సేవ చేసేందుకు అమన్ వేదిక ఆధ్వర్యంలో స్ట్రీట్ మెడిసిన్ కార్యక్రమం చేపడుతున్నారు. వేధికలో సభ్యులైన ఎంబీబీఎస్ డాక్టర్ రాజేందర్, నర్సు రాణి, ఫీల్డ్ వర్కర్ పాల్ హైజాక్, సోషల్ వర్కర్ కం డ్రైవర్ రాకేశ్ వ్యాన్‌లో వెళ్లి రోగికి సేవలందిస్తున్నారు. ముందుగా ఫీల్డ్ వర్కర్ పాల్ హైజాక్ బైక్‌పై నగరంలోని కొన్ని ఏరియాలు తిరిగి వస్తాడు. ఆ తర్వాత అతడి దృష్టికొచ్చిన రోగుల గురించి తన టీంతో చర్చిస్తాడు. అనంతరం వారు ఆ స్థలానికి వెళ్లి వైద్యం అందిస్తారు. ఎవరైనా ఫోన్ చేసినా ఆంబులెన్స్‌లో వెళ్లి ప్రాథమిక చికిత్స అందిస్తారు. రోగిని ఆంబులెన్స్‌లోనే గాంధీ, ఇతర దవాఖానాలకు తీసుకెళ్తారు. అక్కడ పూర్తి వైద్య పరీక్షలు చేయిస్తారు.

రికవరీ షెడ్డు..

అమన్ వేదిక ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో ఒకటి స్ట్రీట్ మెడిసిన్. దాతల సహాయంతో నడిచే అమన్ వేదిక ద్వారా ఎవరూ లేని వారికి జబ్బు చేస్తే డాక్టర్ రిఫరెన్సు మేరకు బేగంపేటలోని రికవరీ షెడ్డుకు తరలిస్తారు. అక్కడి నుంచి రోగులను డాక్టర్ కనల్టేషన్‌కు తీసుకెళ్తారు. ఇలా అనాథ రోగికి అనారోగ్యం నయమయ్యే దాకా అమన్ వేదిక ఆధ్వర్యంలో స్ట్రీట్ మెడిసిన్ సభ్యులు సేవలందిస్తున్నారు.

358
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles