విద్యావాక్స్.. మాషప్స్


Sun,September 9, 2018 01:25 AM

vidya
ఇప్పుడంటే పాటలకు కవర్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తున్నది. ఏ ట్రెండ్ లేనప్పుడు మాషప్స్ ట్రెండ్ ప్రారంభించింది విద్యా. భారత సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించినవిద్యా వాక్స్ అలియాస్ విద్యా అయ్యర్ మాషప్ చేస్తూనే చాలా ఫేమస్ అయింది.విద్యాది మన పక్క రాష్ట్రం తమిళనాడు.. ప్రపంచమంతా ఆమెకు ఫిదా నేడు.ఆమె గురించి సమ్‌థింగ్ స్పెషల్ ముచ్చట్లివి..
అజహర్ షేక్

- 4.8 మిలియన్ల యూట్యూబ్ సబ్‌స్ర్కైబర్లున్న అతితక్కువ మంది ఇండియన్ మ్యూజిషియన్‌లలో విద్యా ఒకరు. 2015లో స్థాపితమైన ఈ చానల్‌కు ఇప్పటికీ సుమారుగా 550 మిలియన్లవ్యూస్ ఉన్నాయి.

- శంకర్ కంపోజర్, మ్యూజిషియన్, డైరెక్టర్. అతని ఆధ్వర్యంలో అన్ని పాటలూ పాడి వాటికి తగట్టు వీడియోలను కూడా రూపొందిస్తున్నది. విద్యా పాటలకు ఇండియన్ సెలబ్రిటీలంతా ఆమెకు ఫిదా అయ్యారు.


- ఆగస్టు నెలలో ద ఫీమేల్ ప్లానెట్ పేరుతో వీడియోను చేసింది. ఇందులో ముఖ్యంగా 360 డిగ్రీస్ వర్చువల్ రియాలిటీ వీడియో ద్వారా ఆల్బమ్‌ను రూపొందించింది. తన సంగీత ప్రయాణం గురించిన చాలా విషయాలను ఆమె ఆ వీడియోలో చెప్పింది.

- మ్యూజిషియన్, నటి, యూట్యూబర్, వ్లాగర్, డ్యాన్సర్‌గా అంతర్జాతీయ వేదికలపై పలు ప్రదర్శనలిచ్చింది. ముఖ్యంగా విద్యా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, వెస్టర్న్, కర్ణాటక సంగీతం, పాప్‌లో ప్రత్యేకంగా
పాడగలదు.

- జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ, బయో మెడికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టాలు అందుకున్నది. ఆ తర్వాత సంగీతం వైపు అడుగులు వేసి సరిగమలు నేర్చుకున్నది. తన చెల్లి వందన అయ్యర్, చెల్లె బాయ్‌ఫ్రెండ్ శంకర్‌తో కలిసి పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తయారు చేసింది.

- విద్యా వాక్స్ అసలు పేరు విద్యా అయ్యర్. చెన్నైలో పుట్టింది. అమెరికాలో పెరిగింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నది.

- విదేశాల్లో ఉంటూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ తన ప్రతి పాటలో వాటిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్ రూపొందిస్తున్నది. చాలా పాటల్లో విదేశాల్లో ఉండే అందమైన లొకేషన్లను పెడుతుంది. కేరళ, తమిళనాడు వంటి రాష్ర్టాల్లోని అందమైన ప్రదేశాలను కూడా తన పాటల్లో పెట్టింది.

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles