వాస్తు


Sun,April 21, 2019 02:29 AM

మంచి ఇంటికి వచ్చినా మనఃశ్శాంతిగా లేదు. మరి ఏం చేయాలి?వి.పద్మాదేవి, కల్లూరు

కారు కొనగానే సరిపోదు. చక్కని డ్రైవింగ్ స్కిల్ పెంచుకోవాలి. తప్పక మీకు శాంతి కలుగుతుంది మంచి ఇంటికి ఈ మధ్యనే వచ్చారు అన్నారు కదా.. ఇక మీరు ఆలోచనా సరళిని సంస్కరించుకోవాలి. ప్రపంచంలో జరిగే వాటిని ఎవరూ మార్చలేరు. చిత్రం ఏమిటంటే భగవంతుడు కూడా అవి మార్చడు. కానీ మార్చుకోగలం. ఇది శాస్త్రం చెప్పేమాట. శాస్త్ర గృహం శాంతికి తోవ, నిజాయితీ జీవనం జీవితానికి శాంతి. సమస్య, దుఃఖం, సంఘర్షణ ఇవి ఇతరుల వల్ల కలుతుగాయి అనేది లోక విదితం. కానీ అవి మన మనస్సు స్వీకరిస్తేనే అనేది అర్థం చేసుకోవాలి. ఎదుటివారి మార్పు, ఎదుటివారి ఆప్యాయతలు, బాగోగులు మన బాగోగులు సమకూర్చుతాయి అనేది గొప్ప అబద్ధం. వాళ్లు మారరు అనే వాస్తవం మనకు తెలియక పోవడం మన ఘర్షణలకు కారణం అవుతుంది. ఎదుటివాళ్లు కూడా మనం మారాలని అనుకోవచ్చు కదా. మంచి శాస్త్రగతమైన మీ గృహంలో ధర్మగతమైన నిజాయితీ జీవితాన్ని గడపండి. ప్రకృతి నిజాయితీగా ఉంటుంది. మన గృహం జీవనం అలాగే ఉండాలి. మన మనో నియంత్రణ మనకు శాంతిని సమకూరుస్తుంది.
vasthu

భూమి అంతా ఒక్కటే కదా.. ఒక్కో దానికి ప్రత్యేక శక్తి ఎలా ఉంటుంది?- కె. అవినాష్, బర్కత్‌పుర, హైదరాబాద్

భూమిని పైపైన చూసి అంచనా కట్టవద్దు. దాని అంతరంగాన్ని చూడగలగాలి. నేల మనసును ఆ నేలపైన ఉన్న మొక్కలు, చెట్లు జీవరాశులు రాళ్లు, రప్పలుకూడా ఆవిష్కరిస్తుంటాయి. వాటిని చదువగలిగితే ఏమిటన్నది తెలుస్తుంది.అందుకే కొన్ని చోట్ల అన్ని పంటలు పండవు. కొన్ని నేలలు బాదామ్, ఆక్రోట్ మొదలైన గొప్ప పంటలు ఇవ్వగలిగితే కొన్ని ఏమీ ఇవ్వక రాతి నేలతో, కొన్ని శ్మశానాలుగా ఉంటాయి. కొన్ని చోట్ల బీడులుగా నిలబడతాయి. దళసరి ఆకులు ఉండే చెట్లు మర్రి, రాగి, మోదుగ చెట్లు ఉన్న నేలలో నీటి అంశ ఉంటుంది. అలాంటివి శక్తిగల నేలలుగా నిలబడతాయి. భూమి శక్తిని దాని స్వరూపాలుగా చెబుతాయి. అలా ఆయా నేలలు ఆయా ప్రత్యేకతలను చాటుతాయి. కాబట్టి అంతా ఒక్కటిగా కనబడినా ఒక్కో నేల అంతర్గత నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగి ఉంటుంది. తద్వారా గృహ నిర్మాణ స్థలం ఎంచుకోవాలి.

ఇంటికి ఉత్తరం పిల్లర్స్ వేసుకుని ఇల్లుపైన పెంచుకోవచ్చా?- పెరిక రాము, గోదావరిఖని

మీ ఇంటికి ఉత్తరంలో ఎంత ఖాళీ స్థలం ఉందో మీరు చెప్పలేదు. ఒక రూము మందం స్థలం కన్నా ఎక్కువ ఉంటే.. ఇంటిని ఉత్తరం పెంచుకోవచ్చు. అంటే ఇల్లు పెంచినా కూడా అటువైపు దక్షిణం కన్నా ఎక్కువ స్థలం ఉండగలగాలి. అలాగే ఇల్లు క్రింద వదిలి పైన పెంచడం మంచిది కాదు. ఉత్తరం పెరుగుదల మంచిదే కానీ కింది భాగం పైన భాగం రెండు సమంగా పెరగాలి. అలాగే ఇంతకు ముందు ఉన్న ఇంటికి పెరగిన భాగాన్ని అందులో ఇమిడిపోయేలా డ్రాయింగ్ రూము, మధ్య హాలు అలాగే సింహద్వారాలు తిరిగి ఉత్తరం వైపునకు జరపాలి. అన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్న తరువాతనే ఇంటి మార్పునకు సిద్ధం కావాలి. కేవలం పైన మాత్రమే పెంచకండి.

ఇంటి పడమర మధ్య కారు పార్కింగ్ పెట్టొచ్చా?- సోమరాజు కాకాని, లింగంపల్లి

ఇల్లును ముట్టకుండా.. ఏదో మూల కత్తిరించకుండానే కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు మూలలు కట్ చేసి కారు పార్కింగ్ ఇవ్వడం శాస్త్రం ఆమోదించదు. మన పల్లెటూళ్లలో ఏ ఇల్లు ఏ మూల కట్ చేసి కట్టారో చూడండి. అందుకే ఇంటికి ఐదు మూలలు(కోణాలు) రాకూడదు అంటారు. కారు పార్కింగ్ చేసిన ఇంటికి ఐదు మూలలు వస్తాయి. తద్వారా ఇంటి లోపలి ప్రాంగణం అపసవ్యంగా మారుతుంది. ఒక అవయవం లేని వ్యక్తి ఎలా ఇబ్బంది పడుతాడే ఆ ఇంటి స్థితి కూడా అలాగే మారుతుంది. అవకాశం కుదుర్చుకొని ఇంటికి తూర్పులో లేదా ఉత్తరంలో ఖాళీ ఎక్కువగా వదిలి ఆ చోట పార్కింగ్ పెట్టుకోండి. కానీ ఇంటిని కట్ చేయడం మానండి..

మా ఇంటి ముందు ఆలయ ప్రాకారం చాలా ఎత్తుగా ఉంది. మాకు బాగుంటుందా?- నేలపల్లి వనజ, కురవి, మహబూబాబాద్

గుడి గోపురాల వెనుక కోట బురుజుల వెనుక వాటినే ఇంటి తూర్పు ప్రాకారాలుగా చేసుకుని నివాసాలు కట్టుకోవద్దు. అవి మన ఇంటి ప్రగతిని నిరోధిస్తాయి. ప్రధానంగా చర్చీలు, మసీదులు, ఆలయాలు మన నివాసం పరిసరాల్లో ఉంటే వాటికి అంటే మందిర నిర్మాణాలకు మాడ వీధులు ఉంటే ఆ చోట గృహాలు ఉంటే ఆ గృహాలకు ప్రాకారాలు కట్టబడి ఉంటే దోషం ఉండదు. కానీ వాటిని తూర్పు-ఉత్తరం హద్దులుగా చేసుకుని ఉండకూడదు. మీ ఇంటి పరిసర కొలతలు పరిస్థితులు చూసే నిర్ణయించుకుంటే అవసరం అయితే మీ ఇంటిని కమర్షియల్‌గా మార్చుకుని ఇల్లు వేరుగా చేసుకోండి.

299
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles