వాట్సప్ మళ్లీ కలిపింది.. కానీ..


Sun,February 11, 2018 01:00 AM

Love-Story
ఇంటర్మీడియెట్ చదివే రోజులు. నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని. కొందరు అర్థం చేసుకున్నా.. ఇంకొందరు అర్థం చేసుకోలేని పరిస్థితి.
అలా అర్థం చేసుకోలేని జాబితాలో టాప్‌లైన్లో ఉన్న అబ్బాయి రవికృష్ణ. చాలా మంచోడే అయినప్పటికీ.. తిక్కల్ పోరగానిలెక్క చేస్తుండేటోడు.
అందరూ నవ్వినప్పుడు నవ్వడు. అందరూ బాధపడ్డప్పుడు బాధపడడు. ఎవరితోనూ తొందరగా కలిసిపోడు. చదువులో మాత్రం చురుకైన వాడు.
హాయ్ రవీ అంటూ ఎంత ఆప్యాయంగా పిలిచినా ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు అతనికి. మనుషుల్ని హర్ట్ చేయడంలో మాత్రం ముందుంటాడు.

కానీ.. నేను ఎవర్నీ హర్ట్ చేయను. అది నా మనస్తత్వం కాదు. నన్ను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వంటుంటావుగా నేను అందరికీ అర్థం కాను అని. నేను కూడా అలాగే అనుకో. నా సైలెన్స్‌ను అసమర్థతగా మాత్రం భావించకు వంటి మేధో డైలాగ్స్ అన్నీ విసురుతాడు. మళ్లీ ఏం తెలియనట్లు అమాయకంగా ఫేసు పెట్టి కృతకంగా నవ్వుతూ కనిపిస్తాడు.
అలాంటి రవి ఫస్ట్‌టైమ్ నా మనసు దోచాడు. ఒకే ఒక్కరోజు మా ఇద్దరి మధ్యన అయస్కాంతమేసి బంధించింది.

అందరూ నా కలివిడితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. రవి మాత్రం ఏనాడూ నా గురించి పట్టించుకోలేదు. అసలు నన్ను గుర్తించనూ లేదు. అదే మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడేట్లు చేసింది.

ఎప్పుడూ మూడీగా.. ఎవరితో మాట్లాడకుండా ఉండే రవి.. హే.. నేను బావున్నా. నువ్వెలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? పెండ్లయిందా? అని ఉత్తేజంగా అడిగాడు.

కానీ పైకి కనిపించినంత కఠోరమైన వ్యక్తి మాత్రం కాదు అతను. చాలా సున్నిత మనస్కుడు. తనతో బాగుంటే బాగుంటాడు.

ఇద్దరం ప్రేమించుకున్నాం.
నేను లేకుండా రవి ఉండలేడు. అతను లేకుండా నేనుండలేను. అందరికీ మా ప్రేమ గురించి తెలిసిపోయింది.
ఇంటర్ అయిపోయింది. డిగ్రీలో నాది వేరే కాలేజ్. అతనిది వేరే కాలేజ్. రోజూ కలుస్తూ ఉండే మేం.. మాట్లాడుతూ ఉండే మేం.. వారం పది రోజులకు గానీ కలువలేని పరిస్థితి.
ఇప్పట్లాగా మొబైల్ ఫోన్లు లేవు అప్పుడు. వాళ్లింటికి రోజూ ఫోన్ చేయలేను. చూడాలనుకున్నప్పుడు.. మాట్లాడాలనుకున్నప్పుడు రవి మా కాలేజీకి చుట్టపు చూపుగా వస్తుండేవాడు. ఓ గంట సేపు ఏ బేకరీలోనో కూర్చొని ముచ్చట్లు పెట్టడంతో సరిపోయేది.
ఇంతలో దురదృష్టం వెంటాడింది. రవితో ప్రేమ వ్యవహారం మా ఇంట్లో తెలిసింది.
అమ్మాయిలను ఇలా స్వేచ్ఛగా వదిలేసి చదివిస్తే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఓ అయ్యింటికి ఇచ్చి పెండ్లి చేస్తే ఓ పనైపోతుందనే అభిప్రాయం మా పేరెంట్స్‌ది.

బహుషా అమ్మాయి ఇష్టాయిష్టాలు పట్టని ప్రతీ పేరెంట్స్‌ది ఇదే సమస్య అయుండొచ్చు.
ఎగ్జామ్స్ అయిపోయాయి. పెండ్లి గురించి మాటా ముచ్చట అంతా జరిగిపోయింది.
అన్నీ సిద్ధం చేసుకున్నారు ఇంట్లో. ఏమైందో ఏమోగానీ.. ఉన్నట్టుండి అబ్బాయి పెండ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.

ఆ సమాచారం తెలిసి మావాళ్లు చాలా బాధపడ్డారు.
నేనూ చాలా బాధపడ్డాను.
ఒక అబ్బాయిని ప్రేమించి.. పెండ్లి చేసుకుందామనుకునే భావనలో ఉన్న నన్ను అతడి నుంచి దూరం చేసి వేరే వ్యక్తికి అతడి ఉద్యోగం చూసి.. ఆస్తి చూసి పెండ్లి చేయాలనుకోవడం పేరెంట్స్ తప్పే.
కుటుంబం కోసమో.. పరువు కోసమో నేను ఏ రాద్ధాంతమూ చేయలేదు. బయటపడి అందరికీ తెలిసి ఇంకా ఆవేదన చెందడం ఎందుకుని సైలెంట్‌గా ఉండిపోయాను.

నాకు ఇప్పుడు మళ్లీ పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అబ్బాయితో దాదాపు పెండ్లి ఫిక్స్ అయింది. కానీ ఈసారి టెక్నాలజీ నా జీవితంలో మరో ఆట మొదలుపెట్టింది.
మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఓసారి గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. నా మొబైల్ నంబర్ ఎలా సంపాదించారో ఏమోగానీ.. పిలుపు అందించారు.

గెట్ టు గెదర్ బాగా జరిగింది. అసలు కలుస్తామో కలువమో అనుకున్న స్నేహితులం మళ్లీ కలుసుకున్నాం.
హాయ్ రవీ ఎలా ఉన్నావ్? అని అతణ్ణి పలుకరించాను.
రవి చాలా మారిపోయాడు. అతడిలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కనిపిస్తున్నాయి. గెట్ టు గెదర్ ప్లాన్ చేసింది కూడా అతనేనంట.

ఎప్పుడూ మూడీగా.. ఎవరితో మాట్లాడకుండా ఉండే రవి..
హే.. నేను బావున్నా. నువ్వెలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? పెండ్లయిందా? అని ఉత్తేజంగా అడిగాడు.
నేనే కాదు మా బ్యాచ్ అంతా రవి తీరును చూసి షాక్ అయ్యాం.
అందరం కల్సి ఫొటోలు దిగి మొత్తానికి ఆ రోజు ఉల్లాసంగా గడిపాం.
తెల్లారి నుంచి మొదలైంది వాట్సప్ గోల. మా ఇంటర్మీడియెట్ బ్యాచ్ పేరిట ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు.
పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేదాకా దాంట్లో ఒక్కటే ముచ్చట. చాలా బాగా అనిపించింది. చాలాకాలం దూరంగా ఉన్న మేం ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ప్రతీక్షణం మాట్లాడుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
గ్రూప్ సంభాషణ మెల్లగా మా ప్రేమ మీదకు మళ్లింది.
అంతా రోజులకొద్దీ చర్చించారు.
Love-Story2
ఇప్పుడు ప్రేమ పెండ్లి అంటే ఎవరు ఒప్పుకుంటారు? పరువు పోతుంది కదా? అనిపించింది. నా విషయంలో ఇప్పటికే ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మళ్లీ ఇప్పుడు జరిగితే ఫ్యామిలీ తట్టుకోగలదా? అనే సంకోచంలో పడ్డాను. ఏమైందో ఏమోగానీ.. నేను పెండ్లి చేసుకోబోయే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం.. అదికాస్తా వార్తల్లోకి ఎక్కడంతో ఆ సంబంధానికి కూడా పుల్‌స్టాప్ పడింది.

మీరు అంతగా ప్రేమించుకున్నారుగా. ఇద్దరికీ పెండ్లి కాలేదు. ఇప్పుడు పెద్దలతో మాట్లాడి పెండ్లి చేసుకోండి అంటూ స్నేహితులు సలహాలిచ్చారు.

రవి కూడా సానుకూలంగానే స్పందించాడు. కానీ నా పరిస్థితి భిన్నంగా ఉంది.
ఆల్మోస్ట్ ఆల్ పెండ్లి సెట్ అయింది. ఇప్పుడు ప్రేమ పెండ్లి అంటే ఎవరు ఒప్పుకుంటారు? పరువు పోతుంది కదా? అనిపించింది.
నా విషయంలో ఇప్పటికే ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మళ్లీ ఇప్పుడు జరిగితే ఫ్యామిలీ తట్టుకోగలదా? అనే సంకోచంలో పడ్డాను.
ఏమైందో ఏమోగానీ.. నేను పెండ్లి చేసుకోబోయే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం.. అదికాస్తా వార్తల్లోకి ఎక్కడంతో ఆ సంబంధానికి కూడా ఫుల్‌స్టాప్ పడింది.
వాట్సప్ కలిపిన ప్రేమ సాక్షిగా నేను రవినే చేసుకోవడానికి ఓకే అన్నాను. ఇంట్లో కూడా సీరియస్‌గా చెప్పేశాను.

నీ ఇష్టం అన్నారు. ఇంకో నెల రోజులాగి మా పెండ్లికి శుభం కార్డ్ వేస్తాం. అనుకున్న సమయంలోనే రవికి వేరే అమ్మాయితో పెండ్లి సంబంధాలు అనే విషయం తెలిసింది. కానీ రవి ఒప్పుకోడనే అనుకుంటున్నా.
చూడు రవీ.. ఎన్నో మలుపులు తిరిగిన మన ప్రేమ తొలుత నీ మౌనం వల్ల.. నీ మొహమాటం వల్ల ఒకసారి బ్రేక్ పడింది. నేను నిన్ను తిట్టుకునేది కూడా ఈ విషయంలోనే. ఇప్పుడు ఎలాగోలా మనకు అన్ని లైన్లూ క్లియర్ అయిపోయాయి అనుకునే సమయంలోనే ఇప్పుడు నీకు వేరే అమ్మాయితో పెండ్లి అంటున్నారు. నువ్వైతే ఒప్పుకోవనే అనుకుంటున్నాను. రవీ.. నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా మా ఇంట్లో.. మీ ఇంట్లో మాట్లాడు. నీకోసం ఇంతకాలం ఉన్నందుకు నాకు న్యాయం చెయ్యి. నీ ప్రేమ పిలుపు కోసమే ఎదురుచూస్తూ..
నీ మహేశ్వరి!

తొలిప్రేమకు ఆహ్వానం!

ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరువని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేము కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!

ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1045
Tags

More News

VIRAL NEWS