లలనామణులకు.. లాంగ్ గౌన్లు!


Sun,October 7, 2018 01:27 AM

పాపాయి నుంచి అమ్మాయిగా మారినా.. ఫ్రాక్‌ల మీద ఉన్న మోజు తీరదు.. అందుకే ఫ్యాషనిస్టులు మగువలు మెచ్చేలా.. లాంగ్ ఫ్రాక్‌లను సిద్ధం చేస్తున్నారు.. ఆర్గానిక్ కాన్సెప్ట్‌తో అన్ని అకేషన్‌లకు. ఆ లాంగ్‌ఫ్రాక్‌ల సోయగాలు అదిరిపోతాయి..
Dresses
సింపుల్ అండ్ ైస్టెలిష్‌గా మెరిసేందుకు ఈ గౌన్ వేయాల్సిందే! ప్యూర్ సిల్క్ మెటీరియల్‌ని ఆర్గానిక్ ఎమరాల్డ్ గ్రీన్ వెజిటెబుల్ డై చేయించాం. దీనికి కలంకారి బార్డర్ జత చేశాం. స్లీవ్స్, బెల్డ్‌లాగా ఇవ్వడం అదనపు ఆకర్షణగా నిలిచింది.
Dresses2
ఆకుపచ్చని సిల్క్ మీద టై అండ్ చేయించి దాన్ని హాఫ్ షోల్డర్‌గా డిజైన్ చేశాం. కింద వైపు సాఫ్ట్ నెట్ మీద సీక్వెన్స్ వర్క్‌తో ఫుల్‌గా నింపేశాం. స్లీవ్స్ మీద, బెల్ట్‌లాగా ఇదే వర్క్ కంటిన్యూ చేశాం. పింక్ కలర్ బాందినీ చున్నీకి సీక్వెన్స్ బార్డర్ ఇచ్చాం.
Dresses3
జర్దోసీ సిల్వర్ గౌన్‌కి యాంటిక్ స్టోన్ వర్క్ చేశాం. గ్రే కలర్ నెట్ మీద కూడా హెవీగా వర్క్ చేయించి ఎర్రని రాసిల్క్, గోటా పట్టీ బార్డర్‌ని ఇచ్చాం. పర్పుల్ కలర్ నెట్ దుపట్టాని కూడా హెవీగా డిజైన్ చేయడంతో పార్టీ లుక్ వచ్చింది.
Dresses4
వెజిటెబుల్ డైతో డ్రెస్‌కి మరింత అందం వస్తుంది. బ్లూ కలర్ సిల్క్ చందేరీ మెటీరియల్‌తో ఫ్లోర్ లెంగ్త్ గౌన్ కుట్టాం. దీనికి బెనారస్ బార్డర్‌ని జతచేశాం. 3/4 స్లీవ్స్‌కి, బెల్ట్‌లాగా కూడా బెనారస్ మెటీరియల్‌ని ఉపయోగించాం.
nikhila
నిఖిల రాజశేఖర్
షెల్ఫ్ 2 సెల్ఫ్ కోచర్
బంజారాహిల్స్, హైదరాబాద్
https://www.facebook.com/
shelf2self/
ఫోన్ : 9959919400

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles