రాశి ఫలాలు


Sun,April 21, 2019 02:25 AM

21-4-2019 నుంచి 27-4-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి గురు ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిబద్ధత అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రద్ధతో పనులు చేయడంతో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వారం ప్రారంభంలో కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి అధికారులతో మనస్పర్థలు ఉంటాయి. వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఆటంకాలున్నాయి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి పనుల్లో కొంత అనుకూలత ఉంటుంది. వారాంతంలో గురు రాశి ప్రవేశం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. భార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంజినీరింగ్, న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మనస్పర్థలు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల సూచనలు తప్పక పాటించాలి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. పనిలో అధికారుల ఆదరణ పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సంపాదన పెరుగుతుంది. రోజువారీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. పెద్దల సలహాలు, సూచనలు పాటించడం తప్పక అవసరం. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మీయులు, కావాల్సిన వారితో చర్చలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వస్త్ర, వస్తువులు, ఆభరణాలు కొనే అవకాశం ఉంది. శుభకార్య ఢూపయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సూచనలను పాటిస్తారు. నలుగురిలో మంచిపేరు తోటి ఉద్యోగులతో సమన్వయంతో ఉంటారు. అధికారుల ఆదరణ వల్ల చాలా పనులు అనుకూలిస్తాయి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారు దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. రోజువారీ క్రయవిక్రయాలలో ఆటంకాలు ఉంటాయి. అయినా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్, వస్త్ర, ఫ్యాన్సీ, హోటల్, క్యాటరింగ్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు, పై అధికారుల అనాదరణ ఉంటుంది. ప్రతికూల ప్రాంతాలకు బదిలీ ఉండొచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికావు. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. పెద్దల సూచనలు పాటించాలి.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో దాదాపు అన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఉండొచ్చు. ప్రయాణాలు అనుకూలించక పోవచ్చు. వృథా ఖర్చులుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు అనుకూలించక పోవచ్చు. పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొన్ని ఆటంకాలుంటాయి.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వారం మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా, తరువాత ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పేరు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారు నలుగురిలో మంచి పేరు పొందుతారు. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదిస్తారు. రాజకీయంలో ఈ రాశి వారికి అనుకూలత ఉంటుంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో విఘ్నాలున్నాయి. పనివారితో మనస్పర్థలు ఏర్పడతాయి. చదువు, విదేశీ ప్రయాణ, ప్రయత్నాలలో ఆలస్యం జరుగుతుంది.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మంచి పేరు పొందే అవకాశం గోచరిస్తున్నది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. కొంత సాహసించి పనులు చేయాలి. వ్యాపారం లాభిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్, హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. రాజకీయంలో కార్యకర్తలతో మనస్పర్థలు ఉంటాయి.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. పనులలో సత్ఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. కొత్త వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొనే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధద్రవ్యాలు తదితర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అన్నదమ్ములు, స్నేహితులతో మనస్పర్థలు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులు గోచరిస్తున్నాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరమైన సమస్యలు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. వస్త్ర, వస్తువులు, ఆభరణాలను కొంటారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పిల్లల చదువు, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రోజువారీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్, హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు తదితర వ్యాపారాలు లాభిస్తాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో స్నేహితులు, బంధువులతో మంచి మాట ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పనులలో సత్ఫలితాలను పొందుతారు. పిల్లల చదువు, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వైద్య, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఏర్పడ తాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

5167
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles