రాశి ఫలాలు


Sun,April 14, 2019 01:10 AM

14-4-2019 నుంచి 20-4-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రద్ధతో పనులు నిర్వర్తించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి శుభసూచకం. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వస్త్ర, వస్తువులు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. పనివారితో ఇబ్బందులు, వృథా ఖర్చులు ఉంటాయి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం కలిసివస్తుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించాలి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. న్యాయవాద, ఇంజినీరింగ్, వైద్య వృత్తులలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యతో కొన్ని పనులు వాయిదా పడతాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. పిల్లల చదువులు అనుకూలిస్తాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం కలిసివస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. నిత్యావసర, వడ్డీ, షేర్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేట్ ఉద్యోగాలలో ఉన్న వారికి ఆఫీసులో మంచి పేరు వస్తుంది. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేట్ ఉద్యోగాలలో ఉన్న వారికి అనుకూలిస్తుంది. తోటి ఉద్యోగుల సహాయసహకారాలు అన్ని విధాలుగా ఉంటాయి. రాజకీయంగా కలిసివస్తుంది. పెద్దల సూచనలు పాటించడంతో పనులలో మంచి ఫలితాలను పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం మెరుగవుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారు అనుకూల ఫలితాలను పొందుతారు. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. క్రయవిక్రయాలలో లాభాలుంటాయి. పూర్వ పెట్టుబడుల వల్ల లాభాలుంటాయి. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్, హోటలు, క్యాటరింగ్, ఫాన్సీ, వస్త్ర వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమయానికి రావాల్సిన డబ్బు రాకపోవచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో మనస్పర్థలు ఏర్పడొచ్చు.

కన్య

ఈ రాశి వారికి ఈ వారం దాదాపు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో, పైఅధికారుల విమర్శలకు గురవుతారు. వ్యాపారంలో నష్టాలుండొచ్చు. సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వారికి అవకాశాలు రాకపోవచ్చు. వాహనాల వల్ల అనవసరమైన ఖర్చులుంటాయి. ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా పడతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. దీంతో కొన్ని పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో క్రయ విక్రయాలు లాభిస్తాయి. న్యాయవాద, ఇంజినీరింగు వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలుంటాయి.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు విందులు, సభలకు హాజరవుతారు. వస్త్ర, వస్తువులు, నగలను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యల మూలంగా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి వాహనాల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. ఆత్మీయులు, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలంగా ఉంటుంది. పంటల దిగుబడి సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను కొంటారు. సభలకు, విందులకు హాజరవుతారు. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ వ్యాపారం లాభిస్తుంది. న్యాయవాద, ఇంజినీరింగు, వైద్య వృత్తులలో ఉన్న వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు గోచరిస్తున్నాయి జాగ్రత్త.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తు, వస్ర్తాలు కొంటారు. సభలు, విందులలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రద్ధతో పనులు చేయడం వల్ల కొన్నింట సత్ఫలితాలను పొందుతారు. రోజువారీ క్రయవిక్రయాలలో ఇబ్బందులు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్య గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కొంత ఆలోచించి పెట్టుబడులు పెడితే మంచిది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలను కొనే అవకాశాలు ఉన్నాయి. సభలు, సమావేశాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల కోసం చేసే పనుల్లో సత్ఫలితాలుంటాయి.

మీనం

ఈ రాశి వారి ప్రధాన గ్రహాలు ఈ వారం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలు అనుకూలిస్తాయి. అన్నదమ్ములు, స్నేహితులతో మంచిమాట ఉంటుంది. దీంతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో ఇబ్బందులు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. వృథా ప్రయాణాలు, పనుల్లో ఆలస్యం, ప్రాధాన్యం లేని పనుల వల్ల ఖర్చులు పెరుగుతాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1005
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles