రాశి ఫలాలు


Sun,March 17, 2019 12:24 AM

17-3-2019 నుంచి 23-3-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలుంటాయి. అననుకూల ప్రాంతాలకు బదిలీలుంటాయి. తోటి ఉద్యోగులతో మనస్ఫర్థలు ఏర్పడొచ్చు. పెద్దల సహాయ సహకారాలను విస్మరించకూడదు. అనవసర ప్రయాణాలు ఉంటాయి. పనివారితో ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి సరైన సమయంలో ప్రాజెక్టులు పూర్తికాకపోవచ్చు. అన్నదమ్ములు, బంధువులతో వైషమ్యాలు ఏర్పడ తాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులుంటాయి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నతవిద్యకు అనుకూలంగా ఉంటుంది. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉల్లాసంగా ఈ వారం గడుపుతారు. ఉద్యోగస్తులు మంచి నైపుణ్యం చూపడం వల్ల మంచి జరుగుతుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందక పోవచ్చు.

మిథునం

రాజకీయంలో ఉన్న ఈ రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో సహ ఉద్యోగులతో సమన్వయం కుదురుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లకు ప్రాధాన్యం ఇస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారు కొత్త అవకాశాలను పొందుతారు. భూముల వల్ల కలిసి వస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో స్నేహ వాతావరణం ఏర్పడుతుంది. వృథా ప్రయాణాలు ఉంటాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు బాగా కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలను ఆచరిస్తారు. పేరుప్రతిష్టలను సంపాదిస్తారు. దేవతాగురుభక్తి పెరుగుతుంది. ఆర్థికసమస్యల నుంచి విముక్తులవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పనులలో వేగం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్ వ్యాపారాలు లాభిస్తాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారి గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో, తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అనాలోచిత పెట్టుబడులు పెట్టకూడదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి న్యాయపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు, ఆలస్యం కనిపిస్తున్నది. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవచ్చు.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తులవుతారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. హోటల్, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధద్రవ్యాలు, నిత్యావసర వస్తు వ్యాపారాలు లాభిస్తాయి. న్యాయవాద, ఇంజినీరింగ్, వైద్యవృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. డబ్బులు సమయానికి అందకపోవచ్చు.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. అనుకూల ప్రాంతాలకు బదిలీలుంటాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. మంచి పేరు సంపాదిస్తారు. ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనివారితో పూర్వం ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ దారులకు అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలను ఆచరిస్తారు. పెద్దల సూచనలను పాటిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. న్యాయవాద, ఇంజినీరింగ్, వైద్య వృత్తులలో ఉన్న వారు మంచి ఫలితాలు పొందుతారు.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానగ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సమస్యలను చర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నష్టాలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. సాహిత్య, పత్రికా రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఉండొచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కిరాణా, షేర్, వడ్డీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అనుకూల ప్రాంతాలకు బదిలీలు, ప్రమోషన్‌లు ఉంటాయి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అలసట లేకుండా శ్రద్ధతో పనులు చేయడం వల్ల చాలా విషయాలలో సత్ఫలితాలు పొందుతారు. అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి.

మీనం

ఈ రాశి వారు ఈ వారంలో మంచి పేరు పొందుతారు. దేవతా గురు భక్తి పెరుగుతుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్త్తారు. నదీస్నానాలను ఆచరిస్తారు. పిల్లల చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృథా ఖర్చులు చేస్తారు. వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులుంటాయి.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

639
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles