రాశి ఫలాలు


Sun,December 2, 2018 12:20 AM

2-12-2018 నుంచి 8-12-2018 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారి గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవొచ్చు. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్న వారికి రోజువారి క్రయ విక్రయాల వల్ల లాభాలుంటాయి. న్యాయవాద వృత్తిలో, భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి కలిసివస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. చదువు, ఉద్యోగం, విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగవు. అ.తే.: 2, 3, 4, 5. చే.స్తో.పా.: దుర్గాస్తోత్రం, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి దేవతా గురుభక్తి పెరుగుతుంది. యాత్రలు, దేవాలయ సందర్శనలకు ప్రాధాన్యమిస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. పిల్లల శుభకార్యాలు, గృహ నిర్మాణంలాంటి పనులు చేపడుతారు. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. కానీ సమయానికి భుజించరు. పనుల్లో ఆలస్యం, పనివారితో ఇబ్బందులు ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలను విస్మరించవద్దు. అన్నదమ్ములు, బంధువులతో అననుకూలత ఉంటుంది. అ.తే.: 4, 5, 6, 7, 8. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్న వారికి కలిసివస్తుంది. ఆఫీసులో పై అధికారులు, తోటివారి సమన్వయం వల్ల మంచి పేరు పొందుతారు. నిత్యావసర, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పనివారితో సమస్యలు పరిష్కరం అవుతాయి. అ.తే.: 6, 7, 8. చే.స్తో.పా.: నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా, దుర్గాస్తోత్రం.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం వృద్ధి అవుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలం లో పూర్తవుతాయి. పిల్లల శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అననుకూల ప్రాంతాలకు స్థానచలనం ఉండొచ్చు. భార్యాపిల్లలతో గొడవలు అవ్వొచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పెద్దల సూచనలు తప్పక పాటించాలి. అ.తే.: 2, 3. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి పెద్దల సహాయ, సహకారాలు సమయానికి అందడం వల్ల చాలా పనులు నెరవేరుతాయి. కిరాణ, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పిల్లల చదువు, శుభకార్యాలు, నూతన నిర్మాణ పనులు, ఉద్యోగాన్వేషణ ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి జాగ్రత్త. అ.తే.: 4, 5. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, నవగ్రహ స్తోత్రం.

కన్య

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు, తోటి వారి సమన్వయం వల్ల పనులు నెరవేరుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలుంటాయి. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత కుదురుతుంది. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలత ఏర్పడుతుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అయినప్పటికీ ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అ.తే.: 2, 3, 6, 7, 8. చే.స్తో.పా.: విష్ణు సహస్ర నామ పారాయణం, దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల లాభాలుంటాయి. న్యాయవాద, ఇంజినీరింగ్, ఉపాధ్యాయ, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్న వారికి లాభాలుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అ.తే.: 4, 5. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, ఆదిత్య హృదయం, దుర్గాస్తోత్రం.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. పెద్దల సహకారాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. చదువు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి. పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. సమయానికి డబ్బు చేతిలో ఉండదు. దీంతో పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అ.తే.: 2, 3, 6, 7, 8. చే.స్తో.పా.: లలితా సహస్ర నామ పారాయణం, నవగ్రహ స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. అన్నదమ్ములు, బంధువులతో స్నేహ సంబంధాలు బలపడుతాయి. వాహనాల వల్ల కలిసివస్తుంది. వ్యవసాయ దారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగస్తులకు పై అధికారులతో, తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. అ.తే.: 2, 3, 4, 5. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, దుర్గా స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారు బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. అనుకూల ప్రాంతాలకు బదిలీలుంటాయి. ఆఫీసులో ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఇంజినీరింగ్, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. నిత్యావసర వస్తువులు, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి లాభాలుంటాయి. అ.తే.: 4, 5, 6, 7, 8. చే.స్తో.పా.: సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం, దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా.

కుంభం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, పై అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. మంచి పేరు పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఇంజినీరింగ్, న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అ.తే.: 6, 7, 8. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం.

మీనం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాల్లో ఉన్న వారికి కలిసివస్తుంది. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. పెద్దల సూచనలను పాటించడం వల్ల పనులు నెరవేరుతాయి. పిల్లల శుభకార్యాలు, చదువు విషయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందే అవకాశం ఉంది. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి, తోటి వారితో మనస్పర్థలుంటాయి. రాజకీయ, కోర్టు పనుల్లో ఆటంకాలుంటాయి. కార్యకర్తలతో ఇబ్బందులుంటాయి. అ.తే.: 2, 3. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్ర నామ పారాయణం.

rashulu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ. నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles