రాశి ఫలాలు


Sun,September 9, 2018 12:17 AM

9-9-2018 నుంచి 15-9-2018 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాలన్నీ అననుకూలంగా సంచరిస్తున్నాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చదువు, శుభకార్యాలు, ఒప్పందాలు విషయంలో చేసే ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి. ప్రారంభించిన పనుల్లో శుభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం సాఫీగా సాగుతుంది. అశ్రద్ధ వలన ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. సంగీత, సాహిత్యరంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు పెరుగుతాయి. అ.తే.: 11, 12, 13. 14. అన.తే.: 9, 10, 15. చే.స్తో.పా.: విష్ణు సహస్ర నామ పారాయణం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహాలన్నీ అననుకూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో బాగా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ప్రయాణాలు కొంత వరకు కలిసి వస్తాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో రోజువారీ క్రయ విక్రయాల వల్ల లాభాలుంటాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అనుకూల వారం. చదువులు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పెద్దల సూచనలను పాటించడం మంచిది. అ.తే.: 13, 14, 15. అన.తే.: 9, 10, 11, 12. చే.స్తో.పా.: దత్తాత్రేయ స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి పూర్వం పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఆఫీసులో అందరితోనూ కలిసి ఉండడం వల్ల మంచి పేరు పొందే అవకాశాలున్నాయి. న్యాయవాద, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లోని వారికి అనుకూలమైన వారం. వ్యాపారస్తులకు రోజువారీ లాభాలుంటాయి. పనులు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. చదువుల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అ.తే.: 9, 10, 15. అన.తే.: 11, 12, 13, 14. చే.స్తో.పా.: లలిత సహస్ర నామ పారాయణం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో గతంలోని కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం దీంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. పనివారితో ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. సంగీత, సాహిత్య సభలకు హాజరవుతారు. సినిమా రంగం, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో, తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పెద్దల సూచనలను పాటించాలి. అ.తే.: 11, 12. అన.తే.: 9, 10, 13, 14, 15. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. వాటిని కార్యరూపంలో పెట్టడంతో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో సరదాగా గడుపుతారు. సభలకు, సమావేశాలకు, విందులకు హాజరవుతారు. సాహిత్య, కళా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అన్నదమ్ములతో, బంధువులతో మంచి మాట వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యం గోచరిస్తున్నది. అ.తే.: 9, 10, 13, 14. అన.తే.: 11, 12, 15. చే.స్తో.పా.: దుర్గా స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం, హనుమాన్ చాలీసా.

కన్య

ఈ రాశి వారు ఈ వారంలో ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి, పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అన్నీ ఫలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అశ్రద్ధ లేకుండా కార్యాలు చేస్తే చాలా పనుల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన వారం. సభలకు, విందులకు హాజరవుతారు. అ.తే.: 11, 12, 15. అన.తే.: 9, 10, 13, 14. చే.స్తో.పా.: ఆదిత్యహృదయం, విష్ణు సహస్ర నామ పారాయణం, హనుమాన్ చాలీసా.

తుల

ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో ఆదాయం కొంత వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయ, సహకారాలు అందుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు రోజువారీ ట్రేడింగ్ వల్ల లాభాలుంటాయి. కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అ.తే.: 9, 10, 13, 14. అన.తే.: 11, 12, 15. చే.స్తో.పా.: లలిత సహస్ర నామ పారాయణం, దత్తాత్రేయ స్తోత్రం, గణపతి స్తోత్రం.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం భార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనాలనే ఆలోచన చేస్తారు. సభలకు, విందులకు హాజరవుతారు. సంగీత, కళా రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు పెరుగడంతో ఆదాయం కూడా మెరుగవుతుంది. పెద్దల సహాయ, సహకారాలు సమయానికి అందుతాయి. వాటిని కార్యరూపంలో పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. అన్నదమ్ములు, బంధువులతో స్నేహ వాతావరణం ఉంటుంది. వాహనాల వల్ల కొన్ని పనులు కలిసి వస్తాయి. అ.తే.: 9, 10, 11, 12, 15. అన.తే.: 13, 14. చే.స్తో.పా.: విష్ణు సహస్ర నామ పారాయణం, దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు పిల్లల చదువులు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో సరదాగా గడుపుతారు. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన వారం. కొత్త వస్తువులను కొనాలనే ఆలోచన శుభ ఫలితాలకు దారితీస్తుంది. అయినప్పటికీ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారులతో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చు. అ.తే.: 11, 12, 13, 14. అన.తే.: 9, 10, 15. చే.స్తో.పా.: ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామ పారాయణం, దుర్గాస్తోత్రం.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహాలన్నీ అననుకూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి ప్రతీ విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త పనులు చేయకుండా ఉంటూ పాత పనులనే పూర్తి చేయడానికి ప్రయత్నించడం అన్ని విధాలా ఉత్తమం. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. పెద్దల సూచనలను పాటించడం మంచిది. అ.తే.: 13, 14, 15. అన.తే.: 9, 10, 11, 12. చే.స్తో.పా.: విష్ణు సహస్ర నామ పారాయణం, లలిత సహస్ర నామ పారాయణం, హనుమాన్ చాలీసా.

కుంభం

ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ముందు చూపుతో వెళ్తే చాలా పనుల్లో లాభాలు గోచరిస్తున్నాయి. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడంతో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అ.తే.: 9, 10, 15. అన.తే.: 11, 12, 13, 14. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, విష్ణు సహస్ర నామ పారాయణం, ఆదిత్య హృదయం.

మీనం

ఈ వారంలో ఈ రాశి వారికి అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలుంటాయి. పెద్దల సలహాలు సమయానికి అందుతాయి. వాటిని కార్యరూపంలో పెట్టడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో ఉన్న వారికి అనుకూలం. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అయినప్పటికీ ప్రధాన గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. అ.తే.: 9, 10, 11, 12. అన.తే.:13, 14, 15. చే.స్తో.పా.: లలిత సహస్ర నామ పారాయణం, దత్తాత్రేయ స్తోత్రం, హనుమాన్ చాలీసా.
Siddhanthi

1378
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles