రాశి ఫలాలు

Sun,March 19, 2017 12:35 AM

rasi-vasi

మేషం


ఈ వారం మీ గ్రహబలం తక్కువగా ఉంది. సంపూర్ణ అవగాహనతో పనిచేయాలి. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. అప్పులు పెరుగకుండా చూసుకోవాలి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు. విష్ణు సహస్రనామ పారాయణ మంచినిస్తుంది.

వృషభం


ఈ వారం మీకు మంచి కాలం. అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. గొప్ప ఆర్ధిక లాభాలున్నాయి . పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు . మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తిచేస్తారు. ఈ సమయాన్ని అత్యంత విలువైన కాలంగా గుర్తించి, ఎక్కువ సమయం అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. మహాలక్ష్మి సందర్శనం మరింత మేలు చేస్తుంది.

మిథునం


ఈ వారం మీరు పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మీలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టి సారించండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకుపోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరుచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతంలో శుభ ఫలితాలున్నాయి. సాయిబాబా చరిత్ర చదవడం మంచిది.

కర్కాటకం


ఈ వారం మీ లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మనోబలంతో ముందుకుసాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్తోత్రం పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

సింహం


ఈ వారం మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఎన్ని సమస్యలున్నా మీ బుద్ధిబలంతో పరిష్కరించి అందరి ప్రశంసలూ అందుకుంటారు. కీలక సందర్భాల్లో తోటి వారి సలహాలు అవసరమవుతాయి. అపార్ధాలకు తావివ్వకండి. ఆగ్రహావేశాలకు ఆమడదూరంలో ఉండండి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి . ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు.

కన్య


ఈ వారం మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకించకండి. ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులను సహాయ సహకారాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

తుల


ఈ వారం మీకు మొదలుపెట్టిన పనిలో విజయావకాశాలు అధికమవుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. పెద్దలు లేదా అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దత్త కవచం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వృశ్చికం


ఈ వారం మీకు గ్రహబలం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఆలోచనలతో ప్రారంభిస్తారు . ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీకు అడ్డురావు. వ్యాపారంలో లాభాలున్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రయాణాలు లాభిస్తాయి. హయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది.

ధనుస్సు


గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కనపెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. ఆర్ధికంగా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన కాస్త బాధ శని దేవుని సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

మకరం


ప్రయత్న కార్యసిద్ధి ఉంది. పొదుపు సూత్రాన్ని పాటించాలి. అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి. అపార్థాలకు తావివ్వకండి. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. మనస్సు చెడును ఊహిస్తుంది. ఆరోగ్యం కీలక సమయాలలో సహకరిస్తుంది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త. దైవారాధన మానకండి.

కుంభం


ఈ వారం మీకు మంచికాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. క్రమంగా ఉన్నతస్థితికి ఎదుగుతారు. వ్యాపారస్తులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి.

మీనం


పెద్దలు చూపిన మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు లాభిస్తాయి. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు . ఉద్యోగం లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది . తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. నూతన వస్తువులు సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. దైవబలం పెరుగుతుంది. సహకరిస్తుంది.

3838
Tags

More News

మరిన్ని వార్తలు...