మోహన రాగం


Sun,October 8, 2017 05:10 AM

వారి కుటుంబానికి ఎలాంటి సంగీత నేపథ్యం లేదు. కానీ ఆమె చిన్నతనం నుంచే పాటే ప్రాణంగా బతికింది.రెండవ తరగతిలో తను పాడిన పాటకు బహుమతి అందుకున్నారు. ఆమెలోని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులూ ప్రోత్సాహించారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తన పాటలు పదిమంది వినాలనుకున్నారు. కానీ తను పాల్గొన్న ప్రతి టాలెంట్ షోలో చేదు అనుభవమే ఎదురైంది. అయినా ఆశ వదులుకోలేదు. సాధన చేస్తూనే వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆ బాటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా జై శ్రీరామ్ చిత్రంలో పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. బాహుబలి రూపంలో అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మనోహరి అంటూ ఆమె పాడిన పాట ఇప్పుడామెను ఎంతో ఎత్తుకు చేర్చింది. తక్కువ సమయంలోనే పాటల పూదోటలో విరబూసిన గాయని మోహన భోగరాజు.బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించడమేకాదు. పాటలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేకాదు అందులో పాడిన ఎంతోమంది కొత్తగాయకులకు లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో మోహన ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగి వచ్చిన సంగీతకెరటం అమె. చిన్నతనం నుంచీ పాటను ప్రేమిస్తూ వచ్చిన ఆమెకు బాహుబలి నిజంగానే కొత్త జీవితాన్నిచ్చిందనడంలో సందేహం లేదు.
ఇరుక్కుపో హత్తుకొని వీర.. వీర..
కోరుక్కుపో నీ తనివి తీర ..తీర..
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీయ్ రా.. తీయ్ రా.. ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్ రా చెయ్ రా..
మనోహరి.. మనోహరి..
అంటూ చాలా మనోహరంగా పాడింది మోహన. రేవంత్‌తో కలసి పాడిన ఈ గీతం మోహనలోని గాయనిని తెలుగుతెరకు పరిచయం చేసింది. నిజానికి మోహనకు ఇదే తొలి సినిమా కాదు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్‌లో సయ్యామ మాసం.. అనే పాట ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు వర్క్ ఎట్ హోమ్ చేశారు. తర్వాత సంగీతరంగమే కరెక్ట్ అని పూర్తిగా ఇటువైపు వచ్చేశారు.
ముంతలో కల్లు ఊరిస్తవుంటే ఓ సుక్క ఎసేయ్యరో.. కరెక్ట్.. ఒంటిలో వేడి తన్నేస్తవుంటే ఓ పట్టు పట్టెయ్యరో.. రైటో.. సంబరాలు చేసుకోరా సొగ్గాడే చిన్ని నాయన.. హాయ్.. అంటూ టైటిల్ సాంగ్‌తో అదరగొట్టారు మోహన.
మోహన సొంతవూరు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. దీంతో మోహన మూడేళ్ల వయసులో పాడటం నేర్చుకున్నారు. దీంతో ఎక్కడ ఏ సంగీతం కార్యక్రమం జరిగినా వాళ్లమ్మ అక్కడికి తీసుకెళ్లేది. రెండో తరగతిలో త్యాగరాయ గానసభలో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చిందని మోహన చెబుతారు.
PATALA-PUDOTA

భలే భలే మగాడివోయ్ చిత్రంలోనూ మోహన టైటిల్ సాంగ్ పాడి మెప్పించారు.
భలే భలే భలే భలే భలే ..
పేరుకేమో వీడు నాని, రెచ్చిపోతే దోని
ఎవడెంతటోడుగానీ గెలవలేడే వీడ్ని
చిన్న సినిమాలతో పెద్ద విజయాలు అందుకుంటున్న నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్ చిత్రం కోసం మోహన పాడిన గీతమిది. చిత్ర కథానాయకుడి బలాల్ని, క్యారెక్టర్ పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం ఈ పాటలో కనిపిస్తుంది.
మోహనకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ లేనప్పటికీ ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేశారు. ఎన్నెన్నో అవమానాలు, నిరాశలు, వైఫల్యాలను చవిచూశాకే విజయాల బాట పట్టారామె. బాహుబలిలో మనోహరితోపాటు బాహుబలి-2లోని హంసనావ పాటను తమిళ వెర్షన్‌లో ఒరే ఒరు ఊరిల్.. ఒరే ఒర్రాజా.. అంటూ మోహన పాడారు. రెండు పాటలు కూడా ఆమెను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి.
హైలో హైలెస్సారే హరి దాసులు వచ్చారే
దోసిట రాశులు తేరే కొప్పును నింపేయరే
డూడూ బసవన్న చూడే వాకిట నిలుచున్నడే
అల్లరి చేస్తున్నడే సందడి మొనగాడే గొబ్బియాల్లో గొబ్బియాల్లో కొండనయ్యకు గొబ్బిళ్లు, ఆదిలక్ష్మి ఆలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు
అంటూ శతమానం భవతి చిత్రంలోని ఈ పాట సంక్రాంతి పండుగ ప్రాముఖ్యాన్ని, ఆ రోజు ప్రతి ఒక్కరు చేసే సరదా పనులను వర్ణిస్తూ సాగుతుంది. మిగిలిన గాయకులతో పాటు మోహన భోగరాజు గాత్రం ఈ పాటకు బాగా కుదిరింది.
మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు.
జిందగీ కేలియే జాస్ జరూరీ హై జీనే కేలియే ఆర్మాస్ జరూరీ హై అంటూ హిందీ వెర్షన్‌తో మొదలై
కనులు నావైనా.. కలలు నీవేలే, పెదవి నాదైనా పిలుపు నీదేలే..
ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే, ఈ ప్రాణం నాదైనా ఊపిరి నువ్వేలే..
అంటూ ప్రేమ మునిగిన ప్రేమికుల హృదయాన్ని ఆవిష్కరించారు ఇజం సినిమాలో. ఈ గీతానికి మోహన గాత్రం మరింత వన్నె తెచ్చింది.
సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మోహన తక్కువ సమయంలోనే గుర్తింపునిచ్చే పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలెన్నో సినిమాల విజయంలో కీలకం కావడం విశేషం. మంచి గాత్రం ఉన్న మోహన భోగరాజు భవిష్యత్తులో మరిన్ని పాటలు పాడి ఉన్నత స్థానాన్ని సాధిస్తారని ఆశిద్దాం.

బాహుబలి అని తెలియకున్నా..

సినిమాలకు ప్రయత్నం చేసే క్రమంలో మోహన కీరవాణి గ్రూపులో చేరారు. అక్కడ చేరాక ఏమోగుర్రం ఎగరావచ్చుకి కోరస్, రీ-రికార్డింగ్ పాడా. తర్వాత దిక్కులు చూడకు రామయ్యకు సోలో సాంగ్ పాడే అవ కాశం వచ్చింది. ఆయన దగ్గర రికార్డ్ అయిన మొదటి పాట బాహుబలి సినిమాకే. ప్రభాస్ పుట్టిన రోజుకి విడుదల చేసిన మొదటి టీజర్ అది. నిజానికి ఆ పాట బాహుబలి కోసమని అప్పటి వరకు మోహన కు తెలి యదట. ఆగ్రూపు సాంగ్ తర్వాత అదే సినిమాలో మనోహరీ పాటతెలుగు, తమిళం లో, బాహుబలి-2లో ఒరే ఒరూరిల్ ఒరేఒర్ రాజా (హంసనావ) పాట తమిళ వెర్షనలో పాడే అవకాశాన్ని మోహన దక్కించుకున్నారు.

మెల్లగా తెల్లారిందోయ్
అలా వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
అంటూ ప్రాసలో సాగే పాటను శతమానం భవతి చిత్రంలో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరాలతో కలసి మోహన భోగరాజు పాడారు. తెల్లవారు జామునా పల్లెలో ఉండే అద్భుత దృశ్యకావ్యాన్ని ఈ పాటలో వర్ణించిన తీరు, పాడిన తీరు అందరినీ ఆకట్టు కుంది.

1793
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles