మీ కళ్లు సల్లగుండ!

Sun,March 19, 2017 01:05 AM

glassesచల్లటి వాతావరణం మెల్లగా జారుకుంది.. భానుడి భగభగకు ఎవరైనా భయపడాల్సిందే!తలకు పెట్టుకునే క్యాప్ నుంచి.. కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు.. ఈ సీజన్‌లో అన్నీ మారిపోవాల్సిందే!

వేసవిది.. సన్‌గ్లాసెస్‌ది విడదీయరాని బంధం. మరి ఈ సీజన్‌లోఏ ముఖాకృతికి ఎలాంటి చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి?ముఖాకృతిని బట్టి ఎలాంటి కళ్లద్దాలు ఎంచుకోవాలి? ఏ రంగు వారి ఎలాంటి సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి?


ఎవరికి ఏ రంగు?

ఫెయిర్ స్కిన్ టోన్ :


ఈ రంగు వాళ్లు ముదురు రంగు సన్‌గ్లాసెస్ వాడాలి. లెన్స్ లేదా ఫ్రేమ్స్ ముదురు రంగుల్లో ఉంటే ఈ స్కిన్ టోన్ వారికి బాగుంటుంది. లేత రంగులు వాడితే రంగులో కలిసిపోయిన మాదిరిగా కనిపిస్తాయి.

డార్క్ స్కిన్ టోన్ :


నలుపు రంగులో ఉన్న వాళ్లు లేత రంగుల సన్‌గ్లాసెస్ ఎంచుకోవాలి. బ్రౌన్, మేట్ బ్లాక్, బ్లాక్ రిమ్స్, గోల్డ్ రంగులు బాగా నప్పుతాయి. అలాగే బ్లాక్ ఏవియేటర్ షేడ్స్‌లో స్టయిలిష్‌గా కనిపిస్తారు. కొట్టొచ్చినట్టు కనపడే ఈ లెన్స్‌ని వాడకపోవడమే మంచిది.

పీచ్ స్కిన్ టోన్ :


ఈ రంగు ఉన్నవాళ్లకి లేత గోధుమ రంగు, కారమిల్, చాక్‌లెట్ బ్రౌన్, గ్రే, ఆలివ్ గ్రీన్ రంగులు బాగా సూటవుతాయి. ఇక సన్‌గ్లాసెస్ పెట్టుకునే బ్యాండ్ లేదా ఫ్రేమ్‌లు పేస్టల్ రంగుల్లో లేదా అదే రంగు ఉన్నా బాగుంటాయి.

ఏ ఆకృతికి ఎలాంటివి?
మనం ఎలా పడితే అలాంటి చలువ కళ్లద్దాలను తీసుకున్నామనుకోండి.. అవి మనకు నప్పవు. అసలు మన ముఖాకృతిని బట్టి మన కళ్లద్దాలను సెలెక్ట్ చేసుకోవాలని ఎంతమందికి తెలుసు? తెలియని వారికోసమే ఈ లిస్ట్. మీ ముఖాకృతి ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి సన్‌గ్లాసెస్ సెలక్ట్ చేసుకోండి.

ఓవల్ షేప్ :


మీరు చాలా లక్కీ : మీ ముఖాకృతికి ఎలాంటి సన్‌గ్లాసెస్ అయినా బాగా సూటవుతాయి. ఎక్కువగా స్కేర్, చివర్లు రౌండ్‌గా వచ్చిన వాటిని ఎంచుకోవడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు.

గుండ్రటి ముఖం..


చంద్రబింబం లాంటి ముఖం కలిగిన వారు గుండ్రటి కళ్లద్దాలను, చివరలు షార్ప్‌గా ఉన్న కళ్లద్దాలను ఎంచుకోకూడదు. వీరి కనుబొమ్మలు షార్ప్‌గా ఉంటాయి. కాబట్టి ఫ్రేమ్ కూడా కనుబొమల చివరి వరకు ఉండేలా పెద్దవి ఎంచుకోవాలి. అంటే చతురస్రాకారంలా ఉండాలి. దీనివల్ల రెట్రో లుక్ మీ సొంతమవుతుంది.


చతురస్రాకారం..


వీరికి గదుశ పెద్దగా ఉంటుంది. వీళ్లకి గుండ్రని, ఏవియేటర్ షేస్‌లైతే బాగుంటాయి. ఓవల్ షేప్ ఉన్న ఫ్రేములైనా బాగా సరిపోతాయి. అయితే మీరు చతురస్రాకారం ఉన్న వాటి జోలికి వెళ్లొద్దు. పెద్ద ఫ్రేమున్నవి అయితే మీకు పర్‌ఫెక్ట్ ఛాయిస్. అయితే అవి ముఖాన్ని దాటి వెళ్లకుండా చూసుకోండి.

హృదయాకారంలో..


ఈ ముఖాకృతి కలవారికి.. గదువ చిన్నగా ఉండి చెంపలు, నుదురు సరైన ఆకృతిలో ఉంటాయి. వీరికి పిల్లి కళ్లద్దాలైతే ఓకే. వెఫేరర్ కూడా బెస్ట్. ఈ ఫ్రేములు చివరలు కిందవాటికంటే షార్ప్‌గా ఉంటాయి. వీళ్లు దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారంలో ఉన్న వేటినైనా నిరభ్యంతరంగా సెలెక్ట్
చేసుకోవచ్చు.

చలువ కళ్దద్దాలు.. రకాలు..


ఫ్యాషన్ ప్రపంచంలో చలువ కళ్లద్దాలకు క్రేజ్ పెరిగిపోతుంది. అందుకే ముఖం ఆకృతిలోనే కాదు.. సన్‌గ్లాసెస్‌లలో కూడా రకాలుంటాయని తెలుసుకోండి. వాటి ఎంపిక మీకు సులువవుతుంది.

aviators

ఏవియేటర్ సన్‌గ్లాసెస్..


1936లో ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు రక్షణగా ఉంటాయని ఈ కళ్లద్దాలను తయారుచేశారు. వరల్డ్ వార్ 2 తర్వాత ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. అసలైతే.. ఇది మగవాళ్లకోసం తయారు చేశారు. ఆ తర్వాత ఆడవాళ్లకూ తయారు చేయడం ప్రారంభించారు. ఆడవాళ్ల చలువ కళ్లద్దాలకు, మగవాళ్ల చలువ కళ్లద్దాలకు కొద్దిగానే వ్యత్యాసం ఉంటుంది. ఆడవాళ్ల లెన్స్ కాస్త లావుగా, ఫంకీ కలర్స్‌తో మెరిసిపోతుంటాయి. ఆడవాళ్ల కోసం కాస్త ముదురు రంగులున్న ఫ్రేములు ఈ చలువ కళ్లద్దాల్లో దొరుకుతాయి.

Wayfarer-Sunglasses

వెఫేరర్ సన్‌గ్లాసెస్..


50వ దశకంలో ఈ చలువ కళ్లద్దాలు చాలా ఫేమస్. వీటిని కూడా ముందుగా మగవాళ్ల కోసమనే తయారుచేశారట. కొన్ని మార్పులతో మగువల కోసం దీన్ని తీర్చిదిద్దారు. వైబ్రెంట్ కలర్స్‌తో ఉండే వాటిని ఆడవాళ్ల కోసం తయారు చేశారు. ఈ రకంలో కూడా మళ్లీ రెండు రకాలు ఉన్నాయి. క్లాసీగా, మోడ్రన్ టచ్‌తో ఉండే ఈ చలువ కళ్లద్దాలు అందరికీ బాగా సరిపోతాయి.

over-sized

ఓవర్ సైజ్డ్ సన్‌గ్లాసెస్..


సినిమా హీరోయిన్‌లు ఈ ైస్టెల్ కళ్లద్దాలను ఎక్కువగా వాడుతుంటారు. ైస్టెలిష్ ఐకాన్‌గా ఈ సన్‌గ్లాసెస్‌కి పేరుంది. ఈ కళ్లద్దాల వల్ల కనులతో పాటు పక్క భాగం కూడా చాలావరకు కవర్ అవుతుంది. ఎండ నుంచి ఎక్కువ రక్షణ పొందేందుకు వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫ్రేముల్లో కూడా రకాలు ఉంటాయి. చతురస్రాకారం, గుండ్రని, జామెట్రిక్ షేప్‌ల్లో ఓవర్ సైజ్డ్ చలువ కళ్లద్దాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

cat-eye

క్యాట్ -ఐ సన్‌గ్లాసెస్..


50, 60వ దశకాల్లో ఈ సన్‌గ్లాసెస్ తెగ పాపులరయ్యాయి. హై సొసైటీలో ఉన్నవాళ్లు వీటిని ఎక్కువగా కొనుగోలు చేసినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి పిల్లి కళ్లలా కనిపించేందుకు ఈ కళ్లద్దాలను వాడతారు. గుండ్రటి, ఓవల్ షేప్ ముఖాకృతి ఉన్నవాళ్లు వీటిని పెట్టుకోవచ్చు. చిక్‌లుక్‌తో అదిరిపోవచ్చు.

Clubmasters

క్లబ్‌మాస్టర్ సన్‌గ్లాసెస్..


రే-బాన్ నుంచి వచ్చిన ఈ చలువ కళ్లద్దాలు ఒక సమయంలో ఓ ఊపు ఊపాయి. ఇప్పటికీ ట్రెండ్ సృష్టిస్తూనే ఉన్నాయి. పైన ఫ్రేమ్ ఉండి, కింద ఫ్రేమ్‌లెస్‌గా ఉండడం దీని ప్రత్యేకత. క్లాసీ లుక్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇవి బాగుంటాయి. జీన్స్, టీషర్ట్ లాంటి సింపుల్ డ్రెస్ వేసినప్పుడు ఈ కళ్లద్దాలను పెట్టి చూడండి.. మీ లుక్కే మారిపోతుంది.
సౌమ్య పలుస

1158
Tags

More News

మరిన్ని వార్తలు...