ప్రేమమ్ కుట్టి!


Sun,September 2, 2018 12:42 AM

Anju-Kurian
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా..దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ల జీవితాల్ని తారుమారు చేస్తుంది. అది హిట్ అయినా, ఫట్ అయినా.. ఈ కేరళ కుట్టి కూడా ఒకే హిట్‌తో స్టార్ అయిపోయింది. ప్రేమమ్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన అంజు కురైన్..తమిళ ఇండస్ట్రీ మీదుగా తెలుగులోకి అడుగుపెట్టింది. సుమంత్‌తో ఇదమ్ జగత్ అంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.అంజు కురైన్ చేసిన అల్లర్లు, ఆమె గురించి సమ్‌థింగ్ స్పెషల్ ముచ్చట్లు..
-అజహర్ షేక్

- ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరన్ తీసిన నేరమ్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్‌తో తెరంగ్రేటం చేసింది. శాంతి హోసన్న లో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆల్ఫోన్స్ పుతెరన్
దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమమ్‌లో కూడా నటించింది.

- ప్రేమమ్ అయిపోయాక రెండేళ్ల విరామం తర్వాత కవి ఉదేసిచత్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. చదువు కొనసాగిస్తూనే మోడలింగ్‌లో రాణించింది. చెన్నై 2 సింగపూర్ చిత్రంలో నటించి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Anju-Kurian2
- ప్రేమమ్ సినిమా దక్షిణ భారత దేశ సినీ పరిశ్రమలోని చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా అంజు జీవితాన్ని కూడా మార్చేసింది. ప్రేమమ్ హిట్ టాక్ తర్వాత తమిళ్, తెలుగు ఇండస్ట్రీల నుంచి ఆహ్వానాలు రావడం మొదలయ్యాయి.

- కేరళలోని కొట్టాయంలో పుట్టిన ఈ పాప ఉన్నత విద్య అనంతరం చెన్నైలో స్థిరపడింది. చెన్నై హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చదివింది.

- చేసింది కొన్ని సినిమాలే అయినా అంజుకు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. కవి ఉదేసిచత్ చిత్రం కేరళలో 73 థియేటర్‌లలో విడుదలయింది. రెండు రోజుల్లో 1.2 కోట్లు
సంపాదించింది.

- కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీ సమయం ఉంటే చాలు పెంపుడు జంతువులతో ఆడుకుంటుంది.
Anju-Kurian1

- లిప్ సింక్ మ్యూజికల్ యాప్స్, డబ్‌స్మాష్ వీడియోలు చేసి సరదాగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంది. 2017లో మొదటిసారి తల్లిదండ్రులతో కలిసి దిగిన చిత్రాన్ని ఇన్‌స్టగ్రామ్‌లో అభిమానుల కోసం విడుదల చేసింది.
Anju-Kurian3
- పేపర్ బోట్ మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కనిపించింది. పలు కమర్షియల్ యాడ్‌లలో తళుక్కుమన్నది.

331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles