ప్రశాంత ప్రేమ నక్షత్రం!


Sun,September 9, 2018 02:17 AM

love
మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలో కూర్చొని కంగారుగా ఎదురుచూస్తున్నా. ప్రశ్నాపత్రం కోసం కాదు ఓ అమ్మాయి కోసం. ఆమెనే నక్షత్ర. తనది మా ఊరే అయినా ఎక్కువ పరిచయం లేదు అప్పటివరకు. ఆ పరీక్షలే మా ప్రేమకు పునాది వేశాయి. ఇద్దరం ఒకే గ్రూప్ అవడం వల్ల రోజూ సబ్జెక్టు గురించి చేర్చించుకునేవాళ్లం.

ఇంకా నీ ఇష్టం అని చెప్పా.. ఏడుపే సమాధానంగా వచ్చింది.ఏదో చెపుతుంది నాకు అర్థం అవ్వడంలేదు ఆ కన్నీటి స్వరంలో.. నేను లేనిదే బతకలేనని, నేనంటే ప్రాణం అని మాత్రం అర్థమైంది. మనుసులు కలిసాయి జీవితాలు ఒక్కటయ్యాయి.. నాకైనా, ఆమెకైనా జీవితం అంటే మేము ఇద్దరం కలిసున్నదే జీవితం.
love1
లోకంలోని ప్రతి రంగుని కుంచెగా మార్చి రాశానో ప్రేమకథ మా ప్రేమ గురించి. హృదయస్పందనలున్నాయో లేవో నాకు తెలియదు. ఉన్నా ఆ గుండె కొట్టుకుంటుందో లేదో నాకు ముఖ్యం కాదు. నాకు నా ప్రేమే ముఖ్యం. నా ప్రేమలో నా ప్రియురాలు ఉందనేదే ముఖ్యమని నేను నా ప్రేయసితో చెప్పాలనుకున్నా. నేనంటే నీకిష్టం లేదా? అని ఆమె అడిగినందుకు నాకెందుకో అలానే చెప్పాలనిపించింది.
తెల్లారితే తన పెండ్లి. అంతా సిద్ధమైంది. పెండ్లి కొడుకు ఓ గవర్నమెంట్ ఉద్యోగి. తెల్లారితే నాకూ ఓ పరీక్ష. అదే గ్రూప్స్ పరీక్ష. ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది. అని ఆలోచించినా సమాధానం దొరుకలేదు. ఆమెకు కూడా తెలుసు. అందుకే తెల్లారితే పెండ్లి.. నువ్వేం చేయలేవా? అని నా కాలర్ పట్టుకొని అడిగింది. ఒకవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి.. మరొకవైపు ప్రాణం ఇచ్చిన తల్లిదండ్రుల బాధ్యత.. ఇంకోవైపు అహోరాత్రులు కష్టపడి చదివిన పరీక్షలు. ఒకరకంగా గ్రూప్స్ నా జీవితాశయం. జీవితపు పద్మవ్యూహంలో ఏం నిర్ణయించుకోవాలో.. ఏది నా జీవితాంతం ఉంటుందని నిర్ణయించుకోవాలో తేల్చుకోవాల్సిన రోజది. కానీ అది బయటకు రావడం లేదు. అంతా లోపలే. నా మనసు అంతఃరంగంలో మాత్రం దాని స్వరం వినిపిస్తూనే ఉంది.

కలలాగా కరిగింది కాలం..
నా ఎదలో నింపింది విషాదం..
ప్రేమతో నిండిన నా ప్రతికణం చేస్తున్నది ఆగని రణం..
కాష్టంపై నా కాయం కాలేంత వరకు నీ కోసమే ఈ ప్రాణం .. ఓ నా నక్షత్ర!
నక్షత్ర పేరుకు తగ్గట్టే అందమైన రూపం. చూసినవెంటనే ఏదో తెలియని ఆప్యాయత. మంచితనం తొణికిసలాడే వ్యక్తిత్వం. కాలం తెలియని మనసులని కలుపుతుంది.. కలిసిన మనసులని విడగొడుతుంది. అలాగే నాకు ఒక తెలియని మనుసుని పరిచయం చేసింది.. మా మనసులు కలిశాయని ప్రపంచానికి తెలిసేలోగా దూరం చేయాలనుకున్నది! మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలో కూర్చొని కంగారుగా ఎదురుచూస్తున్నా. ప్రశ్నాపత్రం కోసం కాదు ఓ అమ్మాయి కోసం. ఆమెనే నక్షత్ర. తనది మా ఊరే అయినా ఎక్కువ పరిచయం లేదు అప్పటివరకు. ఆ పరీక్షలే మా ప్రేమకు పునాది వేశాయి. ఇద్దరం వేరే కాలేజ్. కానీ పరీక్షా కేంద్రం ఒక్కటే అవడం తన హాల్‌టికెట్ నెంబర్ ప్రకారం నా పక్కనే కూర్చోవడం మా ఇద్దరి పరిచయాన్ని పెంచింది. ఇద్దరం ఒకే గ్రూప్ అవడం వల్ల రోజూ సబ్జెక్టు గురించి చేర్చించుకునేవాళ్ళం. ఆలా మా స్నేహం పెరిగింది. పరీక్షలు ముగిశాయి.

డిగ్రీ ఇద్దరం పక్కనే ఉన్న ఒక చిన్న నగరంలో వేరు వేరు కళాశాలల్లో జాయిన్ అయ్యాం. రోజూ పక్కనే ఉన్న నగరంలోని కళాశాలకు బస్‌లో వెళ్లి వచ్చేవాళ్ళం. ఇంతకుముందే పరిచయం ఉండడం, రోజూ కలుసుకోవడం వల్ల మా స్నేహం పెరిగింది. ఇద్దరం మా జీవితాల్లో ప్రతిదాన్ని ఆశలు, గమ్యాలు, సంతోషాలు బాధలు ఇలా ప్రతీది చర్చించుకునేవాళ్లం. రోజులు గడుస్తున్నాయి. మా మధ్య అనుబంధం పెరుగసాగింది. ఎంతలా అంటే మేం ఇద్దరం మాట్లాడుకోకుండా, కలుసుకోలేకుండా ఉండలేని స్థాయికి చేరుకున్నాం. జీవితంలో చాలారోజులు నా జీవితం ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ అలాంటి రోజులు చాలా తక్కువగా వస్తాయి. అలాంటి ఆనందమైన రోజులే నా జీవితంలో వచ్చాయి. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఆమె నా లోకం, నాకు తెలిసిన సంతోషం, బాధ, అందం, ఆనందం, జ్ఞానం, అజ్ఞానం అంతెందుకు ఆమే నా జీవితం. ఆమెతో నా ప్రేమ విషయం చెప్పాలనుకున్న, పరిచయం లేని వ్యక్తికి ప్రేమ చెప్పడం సులువే, కానీ ఇంతా దగ్గరయ్యాక ఆమెకు ఎలా చెప్పాలో,

ఎం చెప్పాలో తెలియక గుండెల్లో తెలియని తీయని బాధ మొదలయింది. కనిపించే నీ కళ్ళని ప్రేమించే, కనపడని నా మనసుని చూపేదెలా?
ఆమెలో నాకు నచ్చేవి కపటం లేని కళ్లు, నల్లని కురులు. నన్ను ప్రేమతో చూసే ఆమె చూపు, తాను చూపించే ప్రేమ, ఆమె ప్రేమని చెప్పకనే చెప్పాయి. మళ్ళీ పరీక్షలు వచ్చాయి, ఆమె కోసం ఎదురుచూస్తున్నా, పరీక్షా కేంద్రంలో కాదు, పార్కులో. ఇద్దరం రోజూ కలిసి చదువుకునేవాళ్ళం ఆ పార్కులో. ఈ రోజు ఎలాగైనా నా ప్రేమని చెప్పాలని ఎదురుచూస్తున్నా .
ఆలాపనో, కాలయాపనో తెలీదుకానీ ..

ప్రతి రూపనా తన రూపమే చూపింది నా కనుపాప.
పార్క్‌లోకి ఏ అమ్మాయి వచ్చినా తనే అనుకొని గుండె వేగంగా కొట్టుకోసాగింది. చూస్తుండగానే ఆమె రానే వచ్చింది. ఇద్దరం కొద్దిసేపు చదువుకున్నాం, పరీక్ష సమయం అవడంతో బయలుదేరడానికి సిద్ధం అయ్యాం. నాకు ఎలా చెప్పాలో తొందరలో అర్థంకాకా ఆమె చెంపపై ముద్దు పెట్టా. ఆ టెన్షన్లో కనీసం ఆమెవైపు చూడకుండా అక్కడినుండి వెళ్ళిపోయా. పరీక్షకైతే వెళ్లాను కానీ ఆమె ఏమనుకుంటుందో, ఏమంటుందో, అసలు మళ్లీ నాతో మాట్లాడుతుందా? లేదా? అని ఆలోచించడంతోనే పరీక్ష ముగిసింది. ఇంటికి వెళ్లినా నిద్ర పట్టడం లేదు, ఇంకా భరించలేకా ఫోన్ చేశా. నీకు బుద్ధి ఉందా, ఎంత బయపడ్డానో తెలుసా? అంది. ఇంకేదో అంటుందని చూస్తున్న నాకు మౌనమే సమాధానంగా వచ్చింది. నేను ఇలా చెప్పా మన మధ్య బంధానికి ప్రేమ అనేపదం చిన్నదవుతుందేమో అని, ఎలా చెప్పాలో తెలియక ముద్దు పెట్టా. ఇంకా ఆ రాత్రి నా మనసులో ఆమెపై పెంచుకున్న అనురాగాన్ని చెప్పా..

ఆ నీలి నిశీధి నీడనా..
నక్షత్రాల వెలుగులో, పచ్చని ప్రకృతి ఒడిలో..
నీ ఎదపై చిత్రించా నా మనసు అంతరంగాన్ని.. నక్షత్ర.!
ఇంకా నీ ఇష్టం అని చెప్పా.. ఏడుపే సమాధానంగా వచ్చింది. ఏదో చెపుతుంది నాకు అర్థం అవ్వడంలేదు ఆ కన్నీటి స్వరంలో.. నేను లేనిదే బతకలేనని, నేనంటే ప్రాణం అని మాత్రం అర్థమైంది. మనుసులు కలిశాయి జీవితాలు ఒక్కటయ్యాయి.. నాకైనా, ఆమెకైనా జీవితం అంటే మేం ఇద్దరం కలిసున్నదే జీవితం. ఆమె లేకుండా నా అనే కుటుంబాన్ని ఎప్పుడూ ఊహించలేదు!
ప్రేమే జీవితమనుకున్నా..
ప్రేమే లక్ష్యమనుకున్నా..
ప్రేమలో ఎదిగాను..
ప్రేమై బతికాను..
ప్రేమే కరువై..
ఏకాకిలా మిగిలాను!
love2
నువ్వేం చేయలేవా అన్న ప్రశ్న నా చెవుల్లో మారుమోగింది. మన సమాజంలో ఇంటి ఇంటికి ఉండే సమస్యలే పేదరికం, నిరుద్యోగం నన్ను నిస్సహాయుణ్ణి చేశాయి. ఏ పరీక్షలైతే మమ్మల్ని కలిపాయో, ఏ పరీక్షలప్పుడు మా ప్రేమలను తెలియజేసుకున్నామో, ఆ పరీక్షలే మమ్మల్ని విడగొడుతున్నాయి. నీ జీవితాన్ని ప్రశ్నగా మార్చి, సమాధానమే రాయకుండా ప్రేమ పరీక్షలో ఓడి, జీవితమనే పరీక్షలో గెలిచి, ఓడేందుకు వెళుతున్నా ఉద్యోగ పరీక్షకి.
నీ తీపి స్మృతులే వెలిగే దీపికలై..
నను వెలిగిస్తుంటే..
నీ జ్ఞాపకాలే నీడలై నిత్యం నను వెంటాడుతుంటే ..
నీ మాటలే అమృత స్వరాలై..
నను బతికిస్తుంటే..
నీవు దక్కవని తెలిసి.. మరిచిపోనా లేక మరణించనా..
ప్రతి నక్షత్రం లో ప్రేమ ప్రశాంతతని వెతికే నీ ప్రశాంత్.!

827
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles