పి.ఎస్.1619


Sun,November 4, 2018 03:36 AM

LOVE
ఒకరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఆ నెలంతా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు గుడిలో భజన చేసేవారు. నేను ప్రతిరోజూ అక్కడికి వెళ్లేవాడిని. భజన చేసేవారందరూ వయసులో నాకంటే చాలా పెద్దవాళ్లు. ఆ నెల రోజులు రెగ్యులర్‌గా భజనకు వెళ్లడంతో చివరిరోజు అందరితో పాటు నాక్కూడా శాలువా కప్పి సన్మానం చేశారు.ఐదురోజులు హాస్టల్ మూసేస్తారని తెలిసింది. సరే అని ఇంటికి బయల్దేరా. వెళ్లే దారిలో స్మృతి, వాళ్ల అక్క, నాన్న బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. పండుగకు ఇంటికి వెళ్లాను కానీ.. అన్నీ స్మృతి జ్ఞాపకాలే. సెలవులు అయిపోయిన మరుసటి రోజే కాలేజ్‌కి వెళ్లిపోయా. సాయంత్రం ఆమె బస్సు దిగే చోట ఎదురుచూస్తూ ఉన్నా.

నేను అప్పుడు బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్నా. జూనియర్ ఒకడు నా దగ్గరికొచ్చి అన్నా నేను బీసీ గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటున్నాను. నాతో పాటు ఉంటావా అని అడిగాడు. ఆ తర్వాత రోజు హాస్టల్‌కి వెళ్లి ఎలా ఉందో కనుక్కున్నా. ఒక ప్రైవేట్ బిల్డింగ్‌లో నడిపిస్తున్న గవర్నమెంట్ హాస్టల్ అది. వెళ్లి వార్డెన్ సార్‌ని కలిశాం. నెలరోజుల తర్వాత కలువమన్నాడాయన. ఈ నెల రోజులూ ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ.. రెండు రోజులు హాస్టల్ నుంచే కాలేజీకి వెళ్లిన. సాయంత్రం హాస్టల్‌కి వచ్చిన తర్వాత వార్డెన్ సార్ పిలిపించాడు. వెళ్లిపోమంటాడేమో అనుకున్నా. కానీ.. నా గురించి వాకబు చేసి సరే.. ఉండుపో.. బాగా చదువుకో అని చెప్పాడు. ఆ సమయంలో వార్డెన్ సార్ నాకు దేవుడిలా అనిపించాడు. మా హాస్టల్ ఉన్న కాలనీలో రోడ్డుకు రెండువైపులా చెట్లున్నాయి. రోడ్డు పక్కనే హనుమాన్ గుడి ఉంది. కొద్ది దూరంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. నేను కూడా వాళ్లతో కలిసిపోయి కొద్దిసేపు క్రికెట్ ఆడాను. లేటైపోతుందని హాస్టల్‌కి బయల్దేరే సమయంలో ఓ కాలేజీ బస్సు వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరమ్మాయిలు దిగారు. ఒకమ్మాయి లావుగా ఉంది. ఆమె పక్కనే పొడవాటి జుట్టుతో అందమైన అమ్మాయి నా కంట పడింది. ఆమెను చూడగానే ఈమె కోసమే నన్ను ఆ దేవుడు ఇక్కడికి పంపించాడేమో అనిపించింది. ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వాళ్ల ఇంటి వరకు వెళ్లాను. వాళ్ల ఇంటి గేటుకు పక్కనే ఉన్న నేమ్‌బోర్డు మీద రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పద్మనాభం, మరో పక్క లక్ష్మీ నిలయం, ఫ్లాట్ నెంబర్ 08 అని రాసి ఉంది. అమ్మో.. వీళ్లది కలెక్టర్ ఫ్యామిలీయా? మనల్ని ప్రేమిస్తదా? అని మనసులో అనుకున్నాను.

మా హాస్టల్ ఆ అమ్మాయి ఉండే కాలనీ వీధి చివర ఉంటుంది. అలా నడుచుకుంటూ హాస్టల్‌కి వెళ్లిపోయా. ఆ అమ్మాయి కోసం రోజుకు నాలుగుసార్లు తిరిగేవాడిని. వాళ్లిద్దరూ ప్రతిరోజూ ఉదయాన్నే ఏడున్నరకు హనుమాన్ గుడి దగ్గర కాలేజీ బస్ కోసం ఎదురుచూసేవాఉ్ల. మళ్లీ సాయంత్రం ఆరింటికి అక్కడే బస్ దిగేవారు. నేను ఎన్ని పనులున్నా ఆ రెండు సమయాల్లో అక్కడే ఉండేవాడిని. రోజూ సాయంత్రం ఆ అమ్మాయి వచ్చే సమయానికి గుడి దగ్గర పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఆమె కోసం ఎదురుచూసేవాడిని. ఇంతలో తొలి ఏకాదశి సందర్భంగా ఆ నెలంతా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు గుడిలో భజన చేసేవారు. నేను ప్రతిరోజూ అక్కడికి వెళ్లేవాడిని. భజన చేసేవారందరూ వయసులో నాకంటే చాలా పెద్దవాళ్లు. ఆ నెల రోజులు రెగ్యులర్‌గా భజనకు వెళ్లడంతో చివరిరోజు అందరితో పాటు నాక్కూడా శాలువా కప్పి సన్మానం చేశారు. అలా ఆ కాలనీ పెద్దవారితో పరిచయం ఏర్పడింది. గుడిలో ఒక శిలాఫలకం మీద చందాదారుల పేర్లున్నాయి. అందులో పద్మనాభం పదివేల నూట ఒకటి అని ఉంది. అది చూస్తుంటే నాకో ఐడియా వచ్చింది. వెంటనే మొబైల్‌లో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్స్ లిస్ట్ అని సెర్చ్ చేశా. పద్మనాభం అనే పేర్లు చాలా వచ్చాయి. నేను ఆ అమ్మాయి వాళ్ల నాన్నను ఒక్కసారి కూడా చూడలేదు. ఫేస్‌బుక్‌లో వెతికా. ఆ పేరుతో వచ్చిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఒక వ్యక్తిని మా కాలనీలో చూశా. ఆయనే పద్మనాభంగారు అనుకున్నా. ఆయన ఫ్రెండ్ లిస్ట్ ఓపెన్ చేసి చూశా. ఆ లిస్టులో ఆ అమ్మాయి ఉంది. పేరు స్మృతి. ఆ అమ్మాయిలాగే పేరు కూడా చాలా క్యూట్‌గా ఉంది కదా అనిపించింది. ఫేస్‌బుక్‌లోంచి ఆమె ఫొటో డౌన్‌లోడ్ చేసి నా మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్న.

కొన్నిరోజుల తర్వాత వినాయక చవితి వచ్చింది. ఇంటికి వెళ్లాలా? ఇక్కడే ఉండాలా? అనే డైలామా వచ్చిపడింది. ఇంటికెళ్లినా నా మనసు మాత్రం ఆ కాలనీలోనే తిరుగుతుంది. మరుసటి రోజే ఇంటి నుంచి డైరెక్టుగా కాలేజీకి వెళ్లా. సాయంత్రం హాస్టల్‌కి వచ్చి పిల్లలు క్రికెట్ ఆడే గ్రౌండ్ దగ్గరికి వెళ్లా. పక్కనే ఉన్న హోటల్‌కి వెళ్లి చాయ్ తాగుతుంటే స్మృతి వాళ్ల కాలేజీ బస్ వచ్చింది. హనుమాన్ గుడిలో వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. మా హాస్టల్‌లో వినాయకుడి నిమజ్జనం రోజూ ఊరేగింపులో జోరుగా ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నా. కాలనీ వాళ్లంతా చూస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ల ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చి చూస్తున్నారు. నేను ట్రాక్టర్‌లోకి ఎక్కా. కొబ్బరికాయ కొట్టి, వారికి ప్రసాదం పంచాను. ఆ అమ్మాయి ముందు చేతిలో హారతి వెలిగించుకొని దేవుడికి హారతి ఇచ్చాను. వారం తర్వాత హనుమాన్ గుడిలో పెట్టిన వినాయకుడి నిమజ్జనం ఉంది. ఆ రోజూ కాలనీ వాళ్లంతా వినాయకుడి దగ్గరకు వచ్చారు. స్మృతి కూడా ఉంది. ఆ రోజు మొత్తం అందరూ వినాయక నిమజ్జనంలో ఆడి పాడుతుంటే నేను మాత్రం స్మృతినే చూస్తూ గడిపా. స్మృతి వాళ్ల నాన్న పేరు ప్రసాద్ కుమార్ అని తెలిసింది. స్మృతి వాళ్ల తాతయ్య పద్మనాభం అట. నా పేరు ప్రభాకర్. స్మృతికి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తుల పేర్లతో పాటు నా పేరు కూడా అదే అక్షరం అని మురిసిపోయాను. స్మృతి వాళ్లది కర్ణాటక. వాళ్లింట్లో ఆమె ఒక్కతే కూతురు. వాళ్లు ఇంట్లో కన్నడ మాట్లాడుకుంటారు. నా హాస్టల్ రూమ్‌లో కూడా కన్నడ వాళ్లు ఉన్నారన్న విషయం నాకు లేటుగా తెలిసింది. వాళ్ల ద్వారా కన్నడ పదాలు నేర్చుకున్నాను.

ఇంతలో దసరా సెలవులు వచ్చాయి. ఈ సెలవులెందుకు వచ్చాయిరా బాబూ అనుకున్నా. హాస్టల్లోనే ఉందామనుకున్నా. ఐదురోజులు హాస్టల్ మూసేస్తారని తెలిసింది. సరే అని ఇంటికి బయల్దేరా. వెళ్లే దారిలో స్మృతి, వాళ్ల అక్క, నాన్న బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. పండుగకు ఇంటికి వెళ్లాను కానీ.. అన్నీ స్మృతి జ్ఞాపకాలే. సెలవులు అయిపోయిన మరుసటి రోజే కాలేజ్‌కి వెళ్లిపోయా. సాయంత్రం ఆమె బస్సు దిగే చోట ఎదురుచూస్తూ ఉన్నా. బస్సులో నుంచి స్మృతి దిగలేదు. వాళ్ల అక్క మాత్రమే దిగింది. ఇలా రెండు రోజులు గడిచాయి. ఆదివారం వచ్చింది. న్యూస్ పేపర్ చదువుదామని హోటల్‌కి వెళ్లా. కూర్చొని పేపర్ చదువుతుంటే స్మృతి, వాళ్ల అక్క ఇద్దరూ కనిపించారు. నన్ను చూశారు. ఏదో కొనుక్కోడానికి షాప్‌కి వెళ్తున్నారు. ఎలాగైనా ధైర్యం చేసి ఆమెకు నా ప్రేమ విషయం చెప్దామని డిసైడ్ అయ్యా. ఆ కాలనీలో చాలా కార్లుండేవి. స్మృతి వాళ్ల ఇంటి ముందు కూడా ఒక కారుండేది. ఆ కారు అద్దం మీద దుమ్ములో పీఎస్1619 అని రాశాను. పి అంటే నా పేరులోని తొలి అక్షరం, ఎస్ అంటే తన పేరులోని తొలి అక్షరం ఇక 1619 అంటే ఏబీసీడీలలో నా అక్షరం, తన అక్షరం క్రమంలో వచ్చే నెంబరు. అలా ఒక కోడ్ క్రియేట్ చేసి ఆ అద్దం మీద రాశాను.

మరుసటి రోజు కన్నడలో నువ్వు నేను అని రాశా. ఆ తర్వాత ఇంకోరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని రాశా. స్మృతికి నా ప్రేమ అర్థం కావాలని శతవిధాలా ప్రయత్నించేవాడిని. నేను రాసినవి ఆమె చూస్తుందో లేదో నాకు తెలియదు. ఇంతలో పరీక్ష తేదీలు వచ్చాయి. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. రోజూ గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని, స్మృతిని చూసి ఎగ్జామ్‌కి వెళ్లేవాడిని. ఈ విషయమంతా నా ఫ్రెండ్‌కి చెప్పా. వాడు ఆలస్యం చేయకుండా ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్లి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పు అన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాక ఒక ఆదివారం నాడు పిల్లలతో క్రికెట్ ఆడుతున్నా. ఇంతలో స్మృతి ఇంట్లోంచి బయటకు వచ్చింది. వాళ్లు పానీపూరీ తినడానికి వెళ్లారు. నేను వాళ్లనే ఫాలో అయ్యాను. వాళ్లు నన్ను చూసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయం స్మృతితో పాటు నెలరోజులు వరుసగా వాళ్ల నాన్న తోడుండేవాడు. నేను ఫాలో కావడం మానేశా. కారు మీద రాసిన పీఎస్ 1619 అనే పేరు వాళ్లు చూశారు. ఆ అమ్మాయికి తెలిసింది నేను తనని లవ్ చేస్తున్నానని. ఇంతలో మా కాలేజీలో స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. నా స్పోర్ట్స్ టీషర్టు మీద ప్రభా 19 అని రాయించుకున్నా. 19 అంటే స్మృతి పుట్టినరోజు కూడా అదేనట.

ఇంతలో కొత్త సంవత్సరం వచ్చింది. కారు మీద హ్యాపీ న్యూ ఇయర్ అని, కన్నడలో నన్ను క్షమించు, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ అని రాశా. మరుసటి రోజు చూస్తే ఆ కారు అక్కడ లేదు. గుడి దగ్గర ముగ్గుల పోటీ జరుగుతుంది. అక్కడికి వెళ్లా. నన్ను చూసి చూడనట్టు ప్రవర్తించారు. వాలంటైన్స్ డే రోజున నేరుగా వెళ్లి నా ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నా. స్మృతీ.. నా ప్రేమను స్వీకరిస్తావని ఆశిస్తూ..
నీ
ప్రభాస్మృతి

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles