నెట్టిల్లు


Sat,March 23, 2019 11:10 PM

సినిమా తీయడం అనేది ఒక కళ. అది అందరికీ రాదు. కొందరికి పుట్టుకతో వస్తే.. కొందరికి ప్రయత్నం, పట్టుదల ద్వారా అబ్బుతుంది. దర్శకుడు, నటుడు అనిపించుకోవడానికి కొంతమంది జీవితాంతం కష్టపడుతుంటారు. అలాంటి సినిమా కష్టజీవులు తీసిన కొన్ని షార్ట్‌ఫిలింస్ ఈ వారం నెట్టిల్లులో..

మూలుగుబొక్కmulugu-bokka

దర్శకత్వం: వీరస్వామి కర్రె

నటీనటులు : సంఘ్‌వీర్, రాధిక

తెలంగాణలో భార్యభర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాలు, అలకలు, అనురాగాలు, ఆప్యాయతల కలబోతనే ఈ షార్ట్‌ఫిలిం. ఓ ఆదివారం ఉదయం. భార్య అప్పటికే లేచి వంట చేస్తూ ఉంటుంది. బోర్ కొడితే టీవీలో పాట పెట్టి ఫుల్ సౌండ్ పెడుతుంది. ఆ సౌండ్‌కి భర్తకు మెలుకువ వచ్చి బయటకొచ్చి సౌండ్ తగ్గిస్తాడు. ఏం వండుతున్నవ్ అని భార్యను అడుగుతాడు భర్త. అన్నం భగారా వేస్తున్న అని చెప్తుందామె. కూరేం చేస్తున్నవ్? అని అడుగుతాడు ఆయన. మార్కెట్‌కి పోయి మటన్ తీస్కరమ్మని ఆర్డరేస్తుంది భార్య ప్రేమతో. మటన్ దగ్గర పెద్ద క్యూ లైన్‌లో నిలబడడం నచ్చని భర్త చికెన్ తెస్త అని చెప్తడు. దానికి భార్య ఏమొద్దు.. మటనే తీస్కరా. బొక్కలు లేకుంట మెత్త మెత్త ముక్కలు, మూల్గ బొక్కలు ఏస్కోని తే అని చెప్పి భర్తను మార్కెట్‌కి పంపిస్తుంది. భర్త మటన్ తెస్తాడు. అందులో మూల్గబొక్కలు ఉండవు. ఇద్దరూ కొద్దిసేపు వాదులాడుకుంటారు. వంట పూర్తవుతుంది. తిందామని చూస్తే అందులో రెండు మూల్గబొక్కలు కనిపిస్తాయి. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు. భార్యభర్తల బంధాన్ని మనసుకు హత్తుకునేలా తీసిన ఈ షార్ట్‌ఫిలిం మీరూ చూడండి. నచ్చుతుంది.

Total views387,038+(మార్చి 15 నాటికి) Mar 12, 2019


డేట్ విత్ జానుdate-with-jaanu

దర్శకత్వం: రాంకీ

నటీనటులు : రాంకీ, తేజస్వి, జి.మురళీధర్, అనంత్, యువరాజు, పవన్ కల్యాణ్, రాంబాబు, అలివేణి

జాను.. అందమైన అమ్మాయి. తన ఫ్రెండ్ అయిన రామ్‌ని ఇష్టపడుతుంది. ఓ రోజు బీచ్‌లో నాట్యం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రామ్ కాల్ చేస్తాడు. జాను ఆ అబ్బాయికి ఐ లవ్యూ చెప్దామనుకుంటుంది. అంతలోనే రామ్ కూడా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇద్దరూ ఆగిపోతారు. వారు రెగ్యులర్‌గా కలుసుకునే ప్రదేశానికి వస్తే ఒక విషయం చెప్పాలనుకుంటారు ఇద్దరూ. రామ్ కంటే ముందే జాను అక్కడికి వస్తుంది. రామ్ వచ్చిన తర్వాత అతని నోట్లోంచి జాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్యూ అనే మాటలు వినాలని ఆత్రుతగా ఎదురుచూస్తుంది జాను. కానీ రామ్ జానుతో ఐలవ్యూ అని కాకుండా ఐ లస్ట్ యూ అని చెప్తాడు. ఆ పదానికి అర్థం తెలుసుకున్న జాను కోపంగా, ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రామ్ ఈ విషయాన్ని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని బాధపడుతాడు. ఆ ఫ్రెండ్స్‌లో ఒకడు రామ్ చేసిందే కరెక్ట్ అని వాదిస్తాడు. మరొకడు రామ్ చేసింది తప్పు. ఆ అమ్మాయి రామ్‌ని ప్రేమిస్తుంది అని వాదిస్తాడు. ఇంతకీ ఏది కరెక్ట్. తెలియాలంటే యూట్యూబ్‌లో చూడండి.

Total views130,677+(మార్చి 15 నాటికి) Mar 8, 2019


గీతాంజలిgeetanjali

దర్శకత్వం: సచిన్ ధీరజ్

నటీనటులు : రాకేష్ గలీబీ, లక్ష్మీ భరద్వాజ్

ప్రకాష్.. ఓ రోజు తెల్లవారుజామునే బాల్కనీలో మందు తాగుతూ బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతాడు. రోడ్డు మీద వెళ్లేవాళ్లు అతడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పటికే అక్కడ గీతాంజలి అనే అమ్మాయి చేరి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే గీతాంజలి బతుకుతుంది. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. కానీ అస్సలు అధైర్య పడదు. ప్రకాష్ పక్క బెడ్డే ఆమెది కూడా. ఒకరోజు అర్ధరాత్రి గీతాంజలి బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఆమెను ప్రకాష్ చూస్తాడు. ప్రకాష్‌ని చూస్తూ.. సౌండ్ చెయ్యకు. డాక్టర్స్ వచ్చి ఈ పేషెంట్ ఎక్కడికెళ్లింది అని అడిగితే.. నాకు తెలియదని చెప్పు అంటుంది. దానికి ప్రకాష్ ఎలా వెళ్తావు అని అడుగుతాడు. క్యాబ్ బుక్ చేశా అని చెప్తుంది. నేను కూడా నీతో రావొచ్చా? కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి దొంగచాటుగా హాస్పిటల్‌లోంచి బయటపడుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారు ఎక్కడికి వెళ్లారు? డాక్టర్లకు వీళ్లు బయటకు వెళ్లిన విషయం తెలిసిందా? అనేది యూట్యూబ్‌లో చూడండి. చాయ్‌బిస్కెట్ వాళ్లు తీసిన ఈ షార్ట్‌ఫిలింకి ఎవర్‌గ్రీన్ సినిమా గీతాంజలి అని పేరు పెట్టి, హాలీవుడ్‌లో గీతాంజలి సినిమా ఎలా తీస్తారో అలా తీశారు. బాగుంది.. చూడండి.

Total views16,148+(మార్చి 15 నాటికి) Published on Mar 12, 2019


ఆర్‌ఎక్స్ 100 రిటర్న్స్rx-100

దర్శకత్వం: ఈ.వి. రమేష్

నటీనటులు : వినోద్ నువ్వులు, సహస్ర, నిధిన్, ఇందు

ఆర్‌ఎక్స్ 100 లాంటి సినిమా కథను పోలిన షార్ట్‌ఫిలిం ఇది. చిన్నప్పటి నుంచి కూతురును అల్లారుముద్దుగా, గారాబం చేస్తూ పెంచుతాడో ఓ తండ్రి. ఆమె కాస్త పెద్దదై యుక్త వయసుకు వస్తుంది. కాలేజీ చదివే తన కూతురు ఏమడిగినా కాదనకుండా ఇస్తాడు ఆ తండ్రి. ఇలా గారాబంగా పెరిగిన ఆ అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ కుర్రాడేమే అనాథ. ఎవరూ లేని ఆ అబ్బాయిని ఓ కుటుంబం పెంచి పెద్ద చేస్తుంది. ఆ కుర్రాడు ఆ కుటుంబాన్ని చాలా గౌరవిస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం పెండ్లికి ముందే ఆ అబ్బాయితో అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంది. ఆ అబ్బాయిని తొందరపెడుతుంది. ఇలా ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకుంటుంది. ఆ రోజు ఆ అబ్బాయి పుట్టినరోజు కూడా. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

Total views15,893+(మార్చి 15 నాటికి) Published on Mar 9, 2019

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

875
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles