నెట్టిల్లు


Sun,December 2, 2018 02:07 AM

వెండితెర మీద మహా దర్శకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకులు సైతం ఒకప్పుడు కథలు రాసుకొని ప్రయోగం చేసినవారే. ఆ ప్రయోగాలు, ప్రయత్నాలు సక్సెస్ అయి నేడు స్టార్ డైరెక్టర్లుగా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే బాటలో ఔత్సాహిక యువ దర్శకులు అవకాశాల కోసం తమ టాలెంట్‌ని యూట్యూబ్ వేదికగా చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా తీసిన కొన్ని షార్ట్‌ఫిలింస్‌లో ఈ వారం కొన్ని నెట్టిల్లులో..
manchigayindi

మంచిగైంది

Total views 219,006+ (నవంబర్ 23 నాటికి)
Posted On : 19 Nov 2018
దర్శకత్వం: మల్లిఖార్జున్
నటీనటులు : ఆర్.ఎస్. నంద, మహేశ్వరి, పోతు సత్యం, ధనలక్ష్మీ,
మల్లిఖార్జున్, రాధిక
ఊర్లో దారెంట వచ్చేపోయేటోళ్లను పలుకరిస్తుంటడు సదయ్య. ఏ పనీ పాట లేకుండా ఊరోళ్ల ముచ్చట్లన్నీ తెలుసుకుంటుంటడు. ఏదైనా అవసరం పడి వాళ్ల వీళ్లను అడిగితే సదయ్యకు ఎవరూ ఏ వస్తువూ ఇవ్వరు. అది మనసులో పెట్టుకోని వాళ్లకు వీళ్లకు తాకట్లు పెట్టి పంచాయితీలు పెడుతుంటడు. సత్తయ్య, మల్లయ్య అనే ఇద్దరు మిత్రులను ఎలాగైనా విడదీయాలని ప్లాన్ వేస్తాడు. లేని పోని తాకట్లు చెప్పి ఆ ఇద్దరు మిత్రుల మధ్య, వారి భార్యభర్తల మధ్య పంచాయితీ పెడుతడు. కడుపు నిండా కల్లు తాగి తన ఆలోచనా తీరేందో అక్కడ అంతా బయటపెడుతాడు. సత్తయ్య, మల్లయ్యల మధ్య చిచ్చు పెట్టిన సంగతి చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో యూట్యూబ్‌లో చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి. ఆద్యంతం కామెడీతో సాగిపోయే కథ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మన కండ్లముందు కనిపించే దృశ్యాలన్నీ ఈ షార్ట్‌ఫిలింలో చూడొచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంత వాస్తవ పరిస్థితులు ఈ షార్ట్‌ఫిలింలో కండ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.
finally-impressed

ఫైనల్లీ ఇంప్రెస్డ్

Total views 18,201+ (నవంబర్ 23 నాటికి)
Posted On : 16 Nov 2018
దర్శకత్వం: అభినవ్ ఆర్కే
నటీనటులు : క్రిష్ణప్రసన్న వురిటి, శిరీష గొలుసు, చాణిక్య చక్రవర్తి, రాధిక
ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ విషయం ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కాక ఫ్రెండ్‌ని వెంటబెట్టుకొని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడుదామని ప్రయత్నిస్తుంటాడు. ఆ ఫ్రెండేమో పనికిరాని సలహాలిస్తూ, నిరుత్సాహ పరుస్తుంటాడు. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని గమనిస్తుంది కానీ.. పట్టించుకోదు. ఆమెను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక తెలిసిన పద్ధతులన్నీ ఫాలో అవుతుంటాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆ అమ్మాయిని పలుకరిస్తాడు. ఓ ఐదు నిమిషాలు మాట్లాడుతావా అని అడుగుతాడు. నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ధైర్యం లేక ఏవో ఊసుపోని కబుర్లు చెప్తూ మెల్లగా తన ప్రేమ ప్రస్తావన తెస్తాడు. ఆ అమ్మాయి మాత్రం చాలా సింపుల్‌గా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. అని చెప్తుంది. ఆ అబ్బాయి తెగ బాధపడిపోతాడు. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్ కనిపిస్తే వెళ్లి ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. ఆమెకు పెండ్లి కుదిరిందని తెలుస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? యూట్యూబ్‌లో చూడండి.
BLACK-COFFE

బ్లాక్ కాఫీ

Total views 14,941+ (నవంబర్ 23 నాటికి)
Posted On : Nov 23, 2018
దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నటీనటులు : వంశీ పూజిత్, స్వేచ్ఛ శెట్టి, తేజ, స్వాతి
అభయ్ రెండేళ్ల నుంచి ఒక అమ్మాయిని చాలా లోతుగా ప్రేమిస్తాడు. ఎంత లోతు అంటే? 8047 మీటర్ల లోతుగా ప్రేమిస్తున్నాడు. బట్ ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం తెలియదు. చాలా మందిలాగే అభయ్‌కు కూడా భయం అనే వ్యాధి ఉన్నది. దాంతో ఎక్కడ కాదంటుందో అని ప్రేమ విషయాన్ని చెప్పకుండా ఉన్నాడు. భయానికి బ్రాండ్ అంబాసిడర్ అభయ్ అలాంటిది జీవితం విషయంలో మాత్రం తనకు నచ్చినట్టు ఉంటాడు. ఎట్టకేలకు ధైర్యం చేసి ప్రపోజ్ చేద్దామని కాఫీ షాప్‌కి వెళ్తాడు. అక్కడ చాలా నిజాయితీగా, కంఫర్ట్‌గా మాట్లాడుతాడు. తను బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ కాదని రియలిస్టిక్‌లో ఉన్న తన ప్రవర్తన గురించి చెప్తాడు. అమ్మాయి ఫ్లాట్ అవుతుంది. పడిపోతుంది. అభయ్ చేద్దామనుకున్న ప్రపోజ్ అమ్మాయి చేస్తుంది. ప్రేమ వాళ్లిద్దరినీ కలుపుతుంది. కానీ ట్విస్టులుంటాయి. బ్లాక్ కాఫీ బాగుంది. టేస్ట్ మాత్రం చేదుగా లేదు. యాక్టర్స్ ఎమోషన్స్‌ని చివరికి వరకు తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో కనెక్ట్ అవుతుంది.
LIGHT-TEESTE

లైట్ తీస్తే

Total views 10,859+ (నవంబర్ 23 నాటికి)
Posted On : Nov 23, 2018
దర్శకత్వం: సందీప్ రెడ్డి
నటీనటులు : సుధీర్, ప్రీతి, హితేష్, గణేష్, మురళీ
ముగ్గురు దోస్తులు బిల్డింగ్ దావత్ చేసుకుంటుంటరు. ఒక దోస్తు పెళ్లి అయి ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉంటడు. దావత్ చేసుకుంటున్న దోస్తులకు కాల్ చేసి టెన్షన్‌గా ఉందిగా అని చెప్తాడు. ఎందుకో తెలుసా? చీకటి అంటే అతనికి భయం. అవును. ఒక లైట్ లేకపోతే జీవితం ఎంత అంధకారంలో ఉంటుంది. కరెంట్ అనేదే లేకపోతే ఈ సమాజంలో ఎంత చీకటి నిండిపోతుంది. చీకటికి భయపడే అతడు మొదటిరాత్రి లైట్ తీసేస్తే ఏమవుతుందో అన్న భయంతో దిండు కింద క్యాండిల్స్ కూడా పెట్టుకుంటాడు. ముగ్గురు స్నేహితుల వెర్షన్, ఇటు ఫస్ట్‌నైట్ వెర్షన్ రెండూ సమాంతరంగా కామెడీగా నడుస్తుంటాయి. చిన్నప్పుడు తనకు భయం అనే వ్యాధి గురించి, దానివల్ల అతడు ఎదుర్కొన్న సమస్యలను ఫన్నీగా చూపించారు. పెళ్లి జరిగిన సందర్భం, దోస్తులతో ఎంజాయ్ చేస్తున్న సంఘటనల్లో ఫన్ బాగా జనరేట్ అయింది. లైట్ ఉన్నంతగా బాగున్న అతనికి లైట్ తీస్తే ఏమయిందో తెలియాలంటే ఈ షార్ట్‌ఫిలిం చూడాలి.

ప్రవీణ్‌కుమార్ సుంకరి
సెల్ : 9182777037

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles