నెట్టిల్లు


Sun,September 9, 2018 01:20 AM

galaiah

ఎస్. గాలయ్య రూల్ నెం-43

Total views 40,984 + (సెప్టెంబర్ 1 నాటికి)
Posted On : Aug 25, 2018
నటీనటులు : రోహిత్, సంఘీర్, రోహిణి, శ్రీశైలం
దర్శకత్వం: ప్రవీణ్‌కుమార్ సుంకరి
ఒక పొద్దు పొడుస్తున్న రోజు పచ్చని పల్లెటూరు ప్రశాంతంగా ఉన్నది. రోజువారిలాగే ఆ ఊర్లో అన్ని సహజంగా ఉన్నాయి. కానీ ఒక విద్యార్థి మనసులో మథనపడడం మొదలుపెట్టాడు. స్కూల్లో పిలిచే పిలుపు, ఊర్లో పలికే పేరు నచ్చక చావడానికే సిద్ధపడుతాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గుట్టకు బయలుదేరుతాడు. అక్కడ తారసపడ్డ ఓ స్వామిజీ చెప్పిన మాటలకు తన మూలాలు తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు. తనకు పెట్టిన పేరు గురించి తెలుసుకునే క్రమంలో జీవిత సారాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? పేరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది అన్న అంశాలను దర్శకుడు కళ్లకు కట్టి చూపించాడు. కెమెరా పనితనం బాగుంది.
sahasra

సహస్ర

Total views 39,864+ (సెప్టెంబర్ 1 నాటికి)
Posted On : 24 Aug 2018
నటీనటులు : చైతూ, స్పందన, సంజన, షహనాజ్
దర్శకత్వం: చందు
తాగుడుకు బానిస అయిన ఓ తల్లి. ఆమెకు ఓ కూతురు. ప్రతిరోజూ తల్లికి తాగడానికి మందు తీసుకు వస్తుంది. ఆ పాపకు ఓ మిత్రుడు ఉంటాడు. అతడికి తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని స్నేహితున్ని తనతో పాటు ఇంట్లో షెల్టర్ కల్పిద్దామని తల్లిని కోరుతుంది కూతురు. అలాగే కొన్నాళ్ల పాటు వాళ్లతో కలిసి ఉంటాడతను. అంతలోనే ఓ ట్విస్ట్. దీంతో అమ్మాయి తీవ్రంగా డిప్రెషన్‌కు గురవుతుంది. చిన్న అంశమే, సూటిగా చెప్పేయొచ్చు. ఎందుకు ఇంత నిడివి పెంచారో అర్థం కాదు. ఇంత చిన్న విషయాన్ని లా....గి లాగి ఎటో తీసుకెళ్లారు. ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడే ముందు మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారనే విషయాన్ని మరువకూడదనే అంశాన్ని బాగా చెప్పాడు దర్శకుడు.
HEARTS

టూ హర్ట్స్

Total views 13,058+ (సెప్టెంబర్ 1 నాటికి)
Posted On : Aug 27, 2018
నటీనటులు : కిరణ్ రంగిశెట్టి, సౌమ్య చౌదరి అద్దంకి, వైష్ణవి నాడదూర్, కిషోర్ గిరి, సాయి సుమంత్ పొన్న, లోకేష్ వైకాశి, ఎంజే చరణ్, రాఘవరాజ్, ఈశ్వర్ గొల్ల
దర్శకత్వం: అఖిలా, సంజీవ్ రవి
చేతికున్న రెండు వేళ్లే ఒకేలా లేవు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములే ఎలా ఉంటారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన ఇద్దరు మనషులు, రెండు మనసులు ఒకేలా ఉండగలవు. ఒకేలా ఉంటారనుకోవడం పొరపాటు. చిన్న చిన్న అపార్థాల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న నేటితరం కథ ఇది. మాటంటే పడకపోవడం, ఓపిక లేకపోవడంతో ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఇలాంటి ప్రేమలే దాదాపు ప్రేమకు మచ్చను తీసుకొస్తున్నాయి. జరిగేదంతా జరిగిపోయాక అర్థం చేసుకొని, నిజాలు తెలుసుకొని బాధపడుతుంటారు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు. ముందే ఓపికగా జాగ్రత్తపడితే ఇలాంటి సంఘటనలు జరుగవు. చిన్న అంశాన్ని తక్కువ నిడివిలో బాగా చెప్పగలిగారు.
toliprema

తొలి ప్రేమ తుది శ్వాస

Total views23,021+ (సెప్టెంబర్ 1 నాటికి)
Posted On : 24 Aug 2018
నటీనటులు : శ్రావణ్, సంజన
దర్శకత్వం: హుస్సేన్ నాయక్
ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ప్రేమికుడికి ఓ ఫోన్‌కాల్ వస్తుంది. సంభాషణ అనంతరం కుప్పకూలుతాడు. ఎంతైనా ఈ ప్రేమలో కలిసుండడం కంటే విడిపోవడం చాలా సులభం. ప్రియుడికి, తల్లిదండ్రులకు ఒకేలా పంచిన ప్రేమ, ఇచ్చిన నమ్మకం గురించి ఈ షార్ట్‌ఫిలిం. మనం తల్లిదండ్రులం అయ్యే వరకు తెలియదు. మన తల్లిదండ్రులు మన గురించి ఎలా ఆలోచిస్తారో, తల్లిదండ్రుల మాటను నిలబెట్టలేదని అమ్మాయి, అమ్మాయికిచ్చిన మాట తప్పానని అబ్బాయి మథనపడుతారు. తొలిసారిగా పుట్టిన ప్రేమ తుది శ్వాస వరకు ఉంటుందా? ఉండదా? అనే అంశాన్ని తెలుపడానికి తీసిన ఈ షార్ట్‌ఫిలిం ఒక్కసారి చూడొచ్చు.

179
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles