నెట్టిల్లు


Sun,March 11, 2018 01:26 AM

నో సేస్ యెస్ టు నో

Total views64,369+(మార్చి 2 నాటికి)Published on : Feb 23, 2018
నటీనటులు : కుమార్ కాసారం, రూప కొడువాయుర్, పారు పవన్, అమూల్య నిధి, మధుర్
దర్శకత్వం: మాధవి పాముల
కాలేజీలోని అమ్మాయిలంతా శివ వెనుకాల పడుతుంటే.. శివ మాత్రం మహతి అనే అమ్మాయిని ఇష్టపడుతాడు. చూసిన వెంటనే ఐ లవ్యూ చెప్తాడు. నీ రిైప్లె కోసం ఎదురుచూస్తూ ఉంటా.. మూడు రోజుల్లో నీ మనసులో మాట చెప్పు.. నా ప్రేమను ఒప్పుకో అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు శివ. ఈ మూడు రోజుల్లో ప్రతీరోజు మహతికి తన ప్రేమను గుర్తు చేస్తూనే ఉంటాడు శివ. మూడు రోజుల తర్వాత ఏం జరిగింది? మహతి శివ ప్రేమను ఒప్పుకుందా? లేదా? యూట్యూబ్‌లో చూడండి. దర్శకురాలు కథను చెప్పడంలో ఎంచుకున్న విధానం బాగుంది. కెమెరా, మ్యూజిక్, నటుల పర్ఫామెన్స్ అన్నీ బాగున్నాయి.
No-say

కాల్‌బాయ్

Total views85,263+(మార్చి 2 నాటికి)Published on : Feb 23, 2018
నటీనటులు : అహ్మద్ చోటు, సింధూ
దర్శకత్వం: సాధు సంపత్
సన్నీ.. ఉరఫ్ సన్యాసిరావు. ఏం చేయాలో తెలియక కాల్‌బాయ్‌గా మారుతాడు. ఈ క్రమంలో ఒకరోజు మేఘన అనే మెడికల్ స్టూడెంట్ సన్నీకి కాల్ చేస్తుంది. ఆ అమ్మాయింటికి వెళ్తాడు. మేఘనకు ఇలాంటి అనుభవం లేదు. జీవితంలో మొదటిసారి ఒక పురుషుడిని కలువాలనుకుంటుంది. కానీ మనసు మాత్రం అందుకు అంగీకరించదు. ఈ క్రమంలో సన్నీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. వరుసగా మూడురోజులు తనతో గడిపి చివరిరోజు శారీరకంగా కలిసి వెళ్లిపోవాలన్నది ఆ ఒప్పందం సారాంశం. ఈ మూడు రోజులకు కలిపి కొంతమొత్తాన్ని ఇచ్చేందుకు ఒప్పుకుంటారు. ఈ మూడురోజులు వాళ్లేం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? మంచి కథనంతో డైరెక్టర్ సాధు సంపత్ ఆకట్టుకున్నాడు.
callboy

మరో ప్రేమకథ

Total views 25,425+(మార్చి 2 నాటికి)Published on: Feb 22, 2018
నటీనటులు : వంశీక్రిష్ణ, దివ్య, మేఘన, సతీష్, తేజ, కుమార్, ఆనంద్, అనిల్
దర్శకత్వం: తేజ
హర్ష మూడేళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను కీర్తికి చెప్పడానికి ధైర్యం చేయడు. ఒకరోజు ఎలాగైనా చెప్పేద్దామని ప్రిపేర్ అవుతాడు. కానీ కీర్తి కళ్లలోకి కళ్లు పెట్టి చూసేసరికి అంతా మరిచిపోతాడు. హర్ష తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయడం లేదని అర్థం చేసుకున్న కీర్తి తనే హర్షకు ఐలవ్యూ చెప్తుంది. ఆరునెలల తర్వాత ఇద్దరూ విడిపోతారు. కొంతకాలం తర్వాత కీర్తిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వాళ్ల నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు. రిైప్లె సరిగ్గా ఇవ్వడం లేదని కీర్తిని చంపేద్దామనుకుంటారు. అసలు కీర్తి, హర్ష ఎందుకు విడిపోయారు? కీర్తిని కిడ్నాప్ చేసింది ఎవరు? హర్ష ఏమైపోయాడు? తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చూడండి. కథ చివర్లో ఊహించని మలుపు ఉంది.
Maro-premakatha

ఇదిప్రేమ

Total views21,933+(మార్చి 2 నాటికి)Published on : Feb 23, 2018
నటీనటులు : సందీప్ కడిమె, జ్యోతి చివుకుల, సుష్మారెడ్డి లంకల
దర్శకత్వం : అవినాష్ ఇనగండల్ల
ఒకరినొకరు సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంటారు. చాలాకాలంగా ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఆనంద్ ఆకెల్ల, అంజలి కాశీనాథుని ఇద్దరూ కలిసి ఒకరోజు కలుద్దామని ఫిక్స్ అవుతారు. ఇద్దరూ ఒక డేట్, టైమ్ ఫిక్స్ చేసుకుని ఒక కాఫీషాప్‌లో కలుస్తారు. అక్కడ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఇంతలో ఆనంద్ ఫ్రెండ్ కాఫీషాప్‌లో కలిసి ఆనంద్‌ని ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత ఒకరికి తెలియని విషయాలు ఒకరు చాలా చెప్పుకొంటారు. ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేసుకుంటారా? ఏం జరిగింది? యూట్యూబ్‌లో చూడండి.
Idi-prema

సమీక్ష:అజహర్ షేక్

928
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles