నెట్టిల్లు


Sun,December 3, 2017 02:17 AM

జానకి రాముల ప్రేమకథ

Total views12,797+(నవంబర్ 25 నాటికి)Published on Nov 23, 2017
నటీనటులు : హరిప్రసాద్, దేవి ప్రియ
దర్శకత్వం: సత్యనారాయణ వెజ్జు
చాలా సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాడు ఓ ఎన్నారై యువకుడు. చిన్నపల్లెటూరు నుంచి విదేశాలకు వెళ్లినవాడు. ఊరితో అతనికి ఉన్న అనుబంధం కూడా ఎక్కువే. చిన్నప్పటి నుంచీ మరదలైన సీతను ఇష్టపడతాడు. వయసు పెరుగుతున్న కొద్దీ సీతమీద కూడా ప్రేమ పెరుగుతుంటుంది. ఊర్లో చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తాడు. బావ మరదలు అన్నాక ఆటపట్టించడాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి సీతపై ఇష్టం ఉన్నా బయటికి చెప్పలేక లోలోపల ఆనందపడుతూ, ఆలోచిస్తూ బతికేస్తుంటాడు. అంతలో ఒక ట్విస్ట్. ముందు నిర్లక్ష్యం చేసిన సీత చివరకు నిజం తెలుసుకుని బావకు దగ్గర కావాలనుకుంటుంది. అప్పుడేం జరిగింది? ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే ఈ జానకి రాముల ప్రేమకథ తెలుసుకోవాలి. స్క్రీన్‌ప్లే బాగుంది.
janaki-ram

నవీన

Total views 10,101+(నవంబర్ 25 నాటికి)Published on Nov 18, 2017నటీనటులు : పవన్‌కుమార్, లహరి
దర్శకత్వం: బాషా
ఓ తండ్రి తన కూతురుకి ప్రేమవిషయాలు చెప్తుంటాడు. అక్కడ మొదలవుతుందీ సినిమా. యవ్వనంలో తనుకు జరిగిన సంఘటనలను కూతురుకు కళ్లకు కట్టి చూపించాడు. చేయని నేరానికి బలైన ఓ అమాయక యువకుడి ప్రేమ కథ. చిన్న చిన్న మనస్పర్థల వల్ల దూరమయ్యారు. ప్రతి ప్రేమకథలో ఉన్నట్టుగానే ఈ ప్రేమకథలోనూ హ్యాపీనెస్, స్యాడ్‌నెస్ రెండూ ఉన్నాయి. దర్శకుడు కథ చెప్పాలనుకున్న తీరు బాగుంది. చెప్పాలనుకున్న విషయాన్ని కొంత ఆలస్యంగానైనా చెప్పగలిగాడు. చివరికి ఆ అమ్మాయి నిజం తెలుసుకొని వచ్చిందా? ఇద్దరూ కలుసుకున్నారా? తెలియాలంటే నవీన షార్ట్‌ఫిలిం చూడాలి. నేపథ్య సంగీతం, లొకేషన్లు బాగున్నాయి. కెమెరా పనితీరు మెరుగుగా ఉంటే ఇంకాస్త బాగుండేది. ట్విస్టులు షాకిస్తాయి.
naveena

లవ్ సర్కిల్

Total views 5,373+(నవంబర్ 25 నాటికి)Published on Nov 23, 2017
నటీనటులు : గౌతమ్, మౌనిక
దర్శకత్వం: బోలా శంకర్ సుంకర
అనుకున్నవి అన్నీ జరుగవు. అనుకోనివి కొన్ని అకస్మాత్తుగా జరుగుతాయి. ప్రేమలో అర్థాలు, అనర్థాలుంటాయి. అర్థం చేసుకుంటే సంతోషం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే అనర్థం అవుతుంది. అమ్మాయి గొంతు విప్పే వరకూ అసలు సంగతి అర్థం కాకుండా సాగిపోతుంటుంది. ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడటం మొదలుపెట్టాక టర్న్ అవుతుంది. ఈ షార్ట్‌ఫిలింలో చూపించినట్టు ప్రేమ ఎక్కడ పుడుతుందో తెలియదు కానీ ఒక దగ్గర మాత్రం పక్కా దొరుకుతుంది. రెండే పాత్రలున్నాయి. సంభాషణలు బాగుండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. అసలు లొకేషన్ లేకుండా.. కేవలం సంభాషణ మీద సాగుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇద్దరూ పాత్రలకు జీవం పోశారు.
love-circle

సస్పెక్ట్

Total views2,415+(నవంబర్ 25 నాటికి) Published on Nov 14, 2017
నటీనటులు : రజినీకాంత్, కిరణ్‌కుమార్, వికాస్, ఆకుల కిరణ్ కుమార్, నిఖిలేష్
దర్శకత్వం : శ్రీకాంత్ కృష్ణ
చేయని తప్పుకు బలైతే ఆవేశం వస్తుంది. ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న అంశం బాగుంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఇరవై నిమిషాల్లో చెప్పాడు. ఇదే విషయాన్ని పదినిమిషాల్లో కూడా చెప్పొచ్చు. మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నా ఇంకాస్త జాగ్రత్త పడితే అవుట్‌పుట్ మరింత బాగుండేది. మైండ్‌గేమ్‌తో సాగుతుంది. ముందు కొంత కన్‌ఫ్యూజ్ అనిపించినా చివరి వరకూ చూడాలనిపిస్తుంది. చివరకు బహిర్గతమయ్యే విషయాలు ముందే ఊహించేలా ఉన్నాయి. సెటిల్‌మెంట్లు, హత్య, ప్లాన్ల నేపథ్యంలో సాగే ఈ కథ, కథనం రొటీన్‌గా ఉన్నా.. దర్శకుడి ప్రయత్నం బాగుందని చెప్పొచ్చు.
suspect

1095
Tags

More News

VIRAL NEWS

Featured Articles