నెట్టిల్లు


Sun,October 8, 2017 04:47 AM

నేరం

Total views314,886(సెప్టెంబర్ 29 నాటికి)Published on Sep 22, 2017
నటీనటులు : గెటప్ శ్రీను, జాంబీ, ప్రతాప్, వంశీ, సుబ్రహ్మణ్యం, మురళీ
దర్శకత్వం: సంతోష్ జాగర్లపుడి
ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన ఇంటికొచ్చారు. కుటుంబ సభ్యులతో పోలీసులు ఇంటరాగేషన్ చేయడం ప్రారంభించారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నలడుగుతాడు ఎస్సైగా నటించిన గెటప్ శ్రీను. అతడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఏదైనా జరుగుతుందని ఊహిస్తామా అది జరుగకుండా ఇతర విషయాలు జరుతుంటాయి. ట్విస్ట్‌లు బాగున్నాయి. ఆసక్తికరంగా ఉండడంతో ఆద్యంతం ఆకట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో తేలిన విషయం ఒకటి ఉంటుంది. చివరకు శ్రీను ఏం న్యాయం చేసాడు? ఎవరికి శిక్ష పడింది? అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మామూలు పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా ఈ సినిమాలో శ్రీను కొంత భిన్నంగా ఆలోచిస్తాడు.
neram

క్వాంటం లవ్

Total views 110,060(సెప్టెంబర్ 29 నాటికి)Published on Sep 16, 2017
నటీనటులు : అర్జున్ కల్యాణ్, సింధు రెడ్డి, హేమంత్, మురళీ
దర్శకత్వం: పవన్ దగ్గుపాటి
నికోల టెస్లా ఫేమస్ ఇన్వెంటర్. నిఖిల్ టెస్లా గ్రేటెస్ట్ గీక్ ఆఫ్ కాలేజ్. టెస్లా మీదున్న అభిమానంతో నిఖిల్ తేజగా ఉన్న తన పేరును నిఖిల్ టెస్లా అని సైంటిఫిక్ నేమ్‌గా మార్చుకున్నాడు. సిక్త్స్‌సెన్స్ సినిమాలో పిల్లోడికి డెడ్ పీపుల్ కనిపిస్తున్నట్టు.. అతనికి డెట్ సైంటిస్ట్‌లు కనిపిస్తుంటారు. వాళ్లతో మాట్లాడుతుంటాడు. నికోల టెస్లాను ఆదర్శంగా తీసుకుని చదువులో బాగా రాణించాడు. కాలేజ్‌లో సీనియర్లు చేస్తున్న ర్యాగింగ్‌లో భాగంగా ఓ అమ్మాయికి ప్రపోజ్ చేయబోతాడు. అంతలోనే ఒక ట్విస్ట్ ఉంటుంది. బీటెక్ కాలేజ్ లైఫ్‌ను కొంత బాగా చూపించాడు దర్శకుడు. నిఖిల్ తను సైంటిఫిక్ పేరు పెట్టుకున్నట్టే తను ఇష్టపడుతున్న అమ్మాయికి కూడా సైంటిఫిక్ పేరు పెట్టుకుంటాడు. చదువులో ముందుండే ఆ అబ్బాయి ప్రేమలో మాత్రం ముందడుగు వేయలేకపోతాడు. ఎందుకో తెలియాలంటే క్వాంటం లవ్ షార్ట్‌ఫిలిం చూడాలి.
Quantum-Love


నా పిల్ల

Total views 93,900(సెప్టెంబర్ 29 నాటికి)Published on Aug 23, 2017
నటీనటులు : సుశాంత్ రెడ్డి, హరిక, అఖిల్ పండిట్, సాయి వర ప్రసాద్
దర్శకత్వం: ఎడ్వర్డ్ అశ్విన్ పాల్, వెంకట్
ఒక బ్యాచిలర్ రూం. ముగ్గురు స్నేహితులు. ఎలా ఉంటుంది? సరదాగా సాగిపోతున్న జీవితంలో.. సడెన్‌గా ట్విస్ట్‌లు పడితే ఎలా ఉంటుందో ఈ షార్ట్‌ఫిలింలో చూడొచ్చు. నిరుద్యోగం. డబ్బు విలువ అర్థమయ్యేటట్టు చూపించారు. సాధారణంగా ముగ్గురు మిత్రులన్నాక చిన్న చిన్న గొడవలు, ఎమోషన్లు ఉంటాయి. అవన్నీ ఇందులో ఉన్నాయి. పక్కనే ఉండి వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే ఈ రోజుల్లో పక్కనుంచి ప్రోద్బలం ఇచ్చే స్నేహాన్ని చూడొచ్చు. ఒకే గదిలో ఉండే మిత్రులు ఒకరికొకరు ఎలా మోసం చేసుకుంటారు? ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి వచ్చిన ఒక అమ్మాయి వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు పెట్టిస్తుంది? చివరకు నిజం తెలుసుకుని ఎవరు ఏం చేస్తారు? అనేదే ఈ పిల్ల కథ.
naa-pilla


మా పరిణయం

Total views16,639(సెప్టెంబర్ 29 నాటికి)Published on Sep 23, 2017
నటీనటులు : ్రశ్రీకాంత్ గుజ్జ, రిన్షా కౌశిక్
దర్శకత్వం : సునీల్ కలిదిండి
కొన్ని స్నేహాలు ఎక్కడ పుడతాయో తెలియదు. కొన్ని పరిచయాలు ఎక్కడ బ్రేకప్ చెప్పుకొంటాయో తెలియదు. కొన్ని ప్రేమ కథలు మాత్రం కొంత విచిత్రంగా ఉంటాయి. ఇది అలాంటి కథే. ఓ రెస్టారెంట్‌లో భార్యాభర్తలిద్దరూ లంచ్ చేయడానికి వెళ్తారు. హోటల్‌లో సందడిగా ఉంటుంది. ఎవరికి వాళ్లు మాట్లాడుకుంటుంటారు. పక్కన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు గమనించిన భర్త నవ్వుతాడు. భార్య భర్తను ఎందుకు నవ్వుతున్నారని అడుగుతుంది. మనమెలా కలిసామో గుర్తొచ్చి నవ్వానని చెప్తాడు భర్త. వాళ్ల్లెలా కలిసారో చెప్పిన కథే ఈ మా పరిణయం. అనుకోకుండా కలిసి అనుకున్నట్టు పెళ్లి చేసుకుంటారు వాళ్లిద్దరూ. మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమా షూటింగ్ అంతా సింగపూర్‌లో చేశారు. దీంతో బ్యాక్‌గ్రౌండ్ విషయంలో ఇతర షార్ట్‌ఫిలింలతో కొంత రిచ్‌గా కనిపించింది.
Maa-Parinayam

సమీక్ష:అజహర్ షేక్

936
Tags

More News

VIRAL NEWS

Featured Articles