నెట్టిల్లు


Sun,September 10, 2017 02:08 AM

సన్నాఫ్ మిడిల్‌క్లాస్

Total views 56,032(సెప్టెంబర్ 1 నాటికి)Published on Aug 28, 2017
నటీనటులు : టోని, విజయ్ గంధంశెట్టి, అరుణ్‌కుమార్, కళ్యాణ్‌రామ్, మధు, ప్రేమ్‌సాయి
దర్శకత్వం: నవీన్ అల్లసాని
ఆశలు కొండమీద.. జీవితం నేలమీద నడిచే మిడిల్‌క్లాస్ జీవితాన్ని అద్దంలో చూపించిన షార్ట్‌ఫిలిం ఇది. మిడిల్‌క్లాస్‌లో పుట్టిన వాళ్లంతా తమకు నచ్చింది కాకుండా.. తల్లిదండ్రులు చెప్పింది చేయాలి. కోరికల్ని, కలల్ని మిడిల్‌క్లాస్ జీవితానికి తాకట్టు పెట్టాలి అంటూ చెప్పిన డైలాగులు బాగున్నాయి. ఎవరో చెప్పింది కాకుండా తనకు నచ్చిందే చేస్తా అనే మిడిల్‌క్లాస్ అబ్బాయి అభి తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణం బాగుంది. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలో జీవితం ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, ఆనందం, అనురాగం అన్నీ ఉంటాయి. మిడిల్‌క్లాస్ నాన్నలందరూ తమ పిల్లలు కూడా మిడిల్‌క్లాస్‌లోనే ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం పిల్లల ఇష్ట్టాల కోసం హైక్లాస్ ఫ్యామిలీగా ఎదిగేలా చేస్తారు. ప్రతి మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ తప్పకుండా చూడాల్సిన షార్ట్‌ఫిలిం ఇది.
son-of-middle-class

పాప ఫ్లాట్..

Total views43,574(సెప్టెంబర్ 1 నాటికి)Published on Aug 25, 2017
నటీనటులు : సందీప్ సాండీ, వాసవిరెడ్డి, గౌతమ్ నాయుడు
దర్శకత్వం : సాయిచరణ్ టి
ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంతలో ఎదురుగా ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఇద్దరిలో ఒకబ్బాయి ఇష్టపడుతాడు. పక్కనున్న ఫ్రెండ్‌ని రోడ్డుకు అవతలివైపు పంపించి ఆ అమ్మాయినే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ నడుస్తాడు. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని చూస్తుంది. ఇలా వరుసగా మూడురోజులు జరుగుతుంది. నాలుగోరోజు ఎలాగోలా ధైర్యం చేసి, పక్కనున్న ఫ్రెండ్‌ని పంపించి ఆ అమ్మాయితో మాట్లాడుతాడు మొదటి అబ్బాయి. అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం విని ఆ అబ్బాయి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలిస్తే పడీ పడీ నవ్వుకుంటారు. యూట్యూబ్‌లో మీరే చూడండి. ఆ అమ్మాయి ఏం చెప్పిందో!
papa-flat

శ్రీమంతుడు

Total views21,961(సెప్టెంబర్ 1 నాటికి)Published on Aug 25, 2017
నటీనటులు : రాజ్‌కుమార్, చరిష్మా, శ్రీజ, మురళీకృష్ణ, సునితా మనోహరన్, ప్రదీప్
దర్శకత్వం: భరత్ జాస్మిన్
జీవితమంటే ఏందో చెప్పిన షార్ట్‌ఫిలిం. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఆ సుఖాన్ని, సంతోషాన్ని ఎక్కడ పొందాలో తెలుసుకోరు. డబ్బున్న ఇంట్లో పుట్టిన ఓ కుర్రాడు కూడా సంతోషమంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి, విలాసంగా బతికేయడమే అనుకుంటాడు. ఒకరోజు అర్ధరాత్రి ఇంటికొస్తే తల్లి మందలిస్తుంది. తల్లి మాటలకు ఆలోచనలో పడిన ఆ అబ్బాయి ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఎంతోమంది జీవితాలను చూసి ఎదుటివారికి సాయం చేయడమే నిజమైన ఆనందం అని తెలుసుకుంటాడు. సాయం చేసి సంతోషపడేవాడే నిజమైన శ్రీమంతుడని తెలుసుకుంటాడు. అందరూ తప్పక చూడాల్సిన, మనసును హత్తుకునే షార్ట్‌ఫిలిం.
srimanthudu

చేగువేరా

Total views 37,151(సెప్టెంబర్ 1 నాటికి)Published on Aug 30, 2017
నటీనటులు : విజయ్ భాస్కర్ ( చే), మనీషా చౌదరి, దిలీప్, సత్యం అనిశెట్టి, మోహన్
దర్శకత్వం: షణ్ముక్ ఎనంతలచే.. ఒక నిత్య చైతన్యకేతనం. ఆ పేరు చెబితేనే యువత రక్తం ఉప్పొంగుతుంది. స్ఫూర్తి ఏరులై పారి నవయువకులను పోరాట కెరటాలుగా మారుస్తుంది. ఈ దేశం కాకపోయినా ప్రపంచమంతా బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలి అని ఆలోచించిన మేధావి. ఆయన యుద్ధం, పోరాటాలతోనే జీవితమంతా గడిపిన వాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడే వ్యాధి బాధిస్తున్నా.. ఉద్యమాలకు, విప్లవాలకు ఊపిరి పోశాడు. ఆ వీరుడి జీవితాన్ని షార్ట్‌ఫిలింలో చూపించే ప్రయత్నం మెచ్చుకోదగింది. చే పాత్రలో నటించిన విజయ్ భాస్కర్ నిజమైన చేగువేరా ఇలాగే ఉంటాడేమో అనిపించేలా నటించాడు. డైలాగులు, నటన, డైరెక్షన్, కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి.
che-guveara

సమీక్ష:ప్రవీణ్‌కుమార్ సుంకరి

925
Tags

More News

VIRAL NEWS

Featured Articles