నెట్టిల్లు

Sun,July 16, 2017 02:22 AM

మళ్లీ కలుద్దాం..


mallikaluddam

Total views 98,755(జూలై 8 నాటికి)Published on Jul 2, 2017
నటీనటులు : కల్పికా గణేష్, అనిరుధ్ సమీర్, శ్రీధర్ నానా, నగేష్ లావూరి
దర్శకత్వం: శ్రవణ్ గజభింకర్
ప్రేమ్ ఓల్డ్‌సిటీలో బైక్ మెకానిక్. ఒకరోజు పక్క గల్లీలో బైక్ ఖరాబ్ అయిందని ఫోన్ చేస్తే వెళ్లి రిపేర్ చేస్తుంటాడు. అప్పుడే ఓ అమ్మాయి ఒక అబ్బాయిని బెదిరించడం చూస్తాడు. అప్పట్నుంచి ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు. ఆమె పేరు పవిత్ర అని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి అందం, ప్రవర్తన చూసి ప్రేమిస్తాడు. తన ప్రేమను పవిత్రకు అందరికంటే డిఫరెంట్‌గా చెప్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటారు. ఇంతలో పవిత్ర వాళ్ల అన్నయ్యను, పవిత్రను రౌడీలు చంపేస్తారు. చివరి క్షణాల్లో పవిత్ర ప్రేమ్‌కు ఫోన్ చేస్తుంది. పవిత్రను, వాళ్ల అన్నయ్యను చంపింది ఎవరు? ప్రేమ్ ఏం చేశాడు? యూట్యూబ్‌లో చూడండి. డైలాగులు, కెమెరా టేకింగ్, డైరెక్షన్ బాగున్నాయి. మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్.

ఎంతవరకు ఈ ప్రేమ..


entha-varaku-e-prema

Total views79,124(జూలై 8 నాటికి)Published on Jun 30, 2017
నటీనటులు : ముబాషిర్ షేక్, పూజా ధరియా
దర్శకత్వం : ముబాషిర్ షేక్
గౌతమ్, సహస్ర ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. గౌతమ్ మాటలంటే సహస్రకు చాలా ఇష్టం. ఒకరోజు కాఫీషాప్‌లో కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదాం అనుకుంటారు. తమ ప్రేమను చెప్పేద్దామనుకుంటారు ఇద్దరూ. కానీ చెప్పలేకపోతారు. నువ్వంటే నాకిష్టం అని చెప్పకనే చెప్పుకుంటారు. ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా కాఫీషాప్‌లో కలుసుకోవడం గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటారు. 431 కాఫీలు తాగిన తర్వాత సహస్ర వచ్చి మనం బ్రేకప్ అవుదాం. మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదు అంటుంది. అప్పుడు గౌతమ్ ఏం చేశాడు? సహస్ర ఎందుకు బ్రేకప్ చెప్పింది? యూట్యూబ్‌లో చూడండి.

ఇంటర్నల్ టార్చర్(ఐటీ)


internal-tarture

Total views46,059(జూలై 8 నాటికి)Published on Jul 2, 2017
నటీనటులు : నరేశ్ ఎవర్‌గ్రీన్, కుశ్బూ మహేశ్వరి, చరణ్‌రాయ్, జైనిల్ దామని, హరీష్ కుమార్ గరవ, రఘురాం, రాజీవ్ జోర్డాన్, కరణ్‌రెడ్డి, ఆర్. రవివర్మ(సురభి), నటరాజ్ ముర్త్తి
(సురభి), నితిన్
దర్శకత్వం: వంశీ ప్రతాప్ నాయుడు
సంతోష్.. ఐటీ ఎంప్లాయ్. వారానికి నాలుగుసార్లు బ్రేకప్ చెప్పే గర్ల్‌ఫ్రెండ్‌ని వదులుకోలేక, ఉద్యోగం వదిలేయలేక, బాస్‌కి ఎదురుతిరగలేక టార్చర్ అనుభవిస్తున్నట్టు ఫీలవుతుంటాడు. కష్టం రాకూడదనే ఆలోచనతో వచ్చిన కష్టాన్ని ఎప్పటికప్పుడు తప్పించుకుందామనుకుంటాడు. కానీ కష్టాన్ని తప్పించుకోవడం కంటే దాటుకుంటూ వెళ్తే మళ్లీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని చివర్లో తెలుసుకుంటాడు. ఐటీ ఎంప్లాయ్ బాధలు ఈ షార్ట్‌ఫిలింలో చక్కగా చూపించారు. మీరూ ఓ లుక్కేయండి.

హ్యాట్సాఫ్ టు ట్రూ లవ్


HATS-OFF-TO-TRUE-LOVE

Total views 6,901(జూలై 8 నాటికి)Published on Jun 30, 2017
దర్శకత్వం: పురం క్రిష్ణ
యశ్వంత్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ఫ్రెండ్స్‌కి చాలా విలువ ఇస్తాడు. జీవితంలో మనుషులు, బంధాల కంటే విలువైనవి వేరే ఏవీ లేవనే టైప్ అన్నమాట. ఓ రోజు గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేలోగా కార్లో ఓ అమ్మాయి పెళ్లికూతురు డ్రెస్‌లో కూర్చుని ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిందని తెలుసుకుంటాడు. ఆమె ఇష్టపడే అబ్బాయితో కలపడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి మాత్రం చివరికి యశ్వంత్‌నే పెళ్లి చేసుకుంటుంది. ఎందుకో యూట్యూబ్‌లో చూడండి.

356
Tags

More News